Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» రిష్యప్

రిష్యప్ – అద్భుతమైన లోయల పట్టణం !!  

సముద్ర మట్టానికి 8000 అడుగుల ఎత్తున ప్రపంచం మరోలా కనపడుతుంది. గాలి స్వచ్చంగా వుంటుంది, వాతావరణం ఉల్లాసం కలిగిస్తుంది, ఓ నగర జీవికైతే ఇక్కడన్నీ చాలా నింపాదిగా కదులుతూ, ప్రతీ క్షణం ఆస్వాది౦చాలనిపిస్తుంది. పశ్చిమ బెంగాల్ ఉత్తరాన లావా నుంచి 4 కిలోమీటర్ల పర్వతారోహణ ద్వారా రిష్యప్ చేరుకోవచ్చు – ఇక్కడ దొరికే అనుభవం దృష్ట్యా ఈ కష్టం అంటా పడవచ్చు.

6

రిష్యప్ లోను, చుట్టు పక్కలా పర్యాటక ప్రదేశాలు

రిష్యప్ అంటే ‘కొండ శిఖరం మరియు ఒక చెట్టు’ అని అర్ధం చెప్పుకోవచ్చు. ఇది నియోరా లోయలో దాగి వున్న అందమైన కొండల మధ్య నెలకొని వుంది. ఇక్కడి నుంచి కాంచేన్ జంగా చాలా అధ్బుతంగా కనిపిస్తుంది, తప్పక చూడాల్సిన, ఫోటోలు తీసుకోవాల్సిన ప్రసిద్ద కొండ శిఖరాలు తాలుంగ్, పందిం, సిమ్వో, ఖరగ్. రిష్యప్ నుంచి నడక దూరంలో లావా మఠం కూడా వుంది.

సహజ సౌందర్యం :

దట్టమైన దేవదారు అడవులను చూడాలంటే రిష్యప్ నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో వున్న పిడాంగ్ కు వెళ్ళండి. ఈ ప్రాంతం భారత దేశాన్ని టిబెట్ కు కలుపుతుంది. మంచు కప్పిన హిమాలయాలు కనపడే, షేర్పా దారా అని పిలువబడే టిఫన్దారా కూడా ఆసక్తి కరమైన మరో ప్రదేశం. నేపాల్, టిబెట్ ల దృశ్యాలను కూడా చూడగలిగే ఏకైక ప్రదేశం రిష్యప్.

కాలినడకన రిష్యప్ :

రిష్యప్ లో కాలినడక సాధారణంగా చేసేదే, అయితే గైడ్ ను పెట్టుకుని ఈ ప్రాంతం పర్యటించాలి. ఇక్కడి నుంచి సిలిగురి సమీప విమానాశ్రయం. మీ ప్రయాణపు ఏర్పాట్లు ముందుగానే చేసుకోవాలని, అవసరమైన మందులు కూడా రిష్యప్ లో దొరకవు కనుక ముందుగానే తీసుకు వెళ్లాలని సూచన.

రిష్యప్ వాతావరణ౦ :

రిష్యప్ లో వాతావరణం ఆహ్లాదకరంగా వుంటుంది.

రిష్యప్ ను సందర్శించడానికి ఉత్తమ సమయం :

శీతాకాలాల తరువాత ఉష్ణోగ్రత మరీ ఎక్కువగా వుండనప్పుడు, ప్రయాణానికి అనుకూలంగా ఉండేటప్పుడు రిష్యప్ ను సందర్శించడానికి ఉత్తమ సమయం.

రిష్యప్ ఎలా చేరుకోవాలి :

రిష్యప్ రోడ్డు, రైలు మార్గాల ద్వారా బాగానే అనుసంధానించబడి వుంది.

రిష్యప్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

రిష్యప్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం రిష్యప్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? రిష్యప్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం : సిలిగురి నుంచి 94 కిలోమీటర్ల దూరంలో వున్న రిష్యప్ కు రోడ్డు మార్గంలో జాతీయ రహదారి 31A గుండా చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం *రిష్యప్రిష్యప్ లో రైల్వే స్టేషన్ లేదు. రిష్యప్ నుంచి దగ్గరలో వున్న సిలిగురి రైల్వే స్టేషన్ నుంచి రాష్ట్రం లోని ఇతర ప్రాంతాలకు నిత్యం రైళ్ళు తిరుగుతాయి. రిష్యప్ కు దగ్గరి రైల్వే స్టేషన్ న్యూ జల్పాయి గురి జంక్షన్ న్యూ జల్పాయి గురి జంక్షన్ కి రైళ్ళు (*న్యూ జల్పాయి గురి జంక్షన్ లో దిగి రోడ్డు మార్గం లో రిష్యప్ వెళ్ళాలి)
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం : భారత దేశంలోని ప్రధాన నగరాలకు సర్వీసులున్న బాగ్డోగ్రా రిష్యప్ కు దగ్గరలోని విమానాశ్రయం. ఇక్కడి నుంచి కొన్ని అంతర్జాతీయ నగరాలకు కూడా విమానాలు తిరుగుతాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
07 Sep,Mon
Check Out
08 Sep,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue