పలుసా జలపాతం సజన్ ఊళ్ళో వుంది. సజన్ పట్టణం నుంచి 12 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ జలపాతం చాలా అందంగా, ప్రత్యేకంగా ఉంటుంది.ఈ జలపాతం ఏడాది లో ఎప్పుడూ ఎండిపోకుండా నిరంతరం ప్రవహిస్తూనే వుంటుంది. ఎప్పుడు నిండు ప్రవాహంతో వుండే పలుసా జలపాతానికి నాలుగు వైపులా దట్టమైన అడవులు పరుచుకుని ఉన్నాయి. క్రింద వున్న రాళ్ళను తాకే ముందు నీరు 40 నుంచి 50 అడుగుల ఎత్తు మీద నుంచి జాలువారుతుంది.ఈ ప్రదేశం ఏడాది పొడవునా పర్యాటకులతో కిటకిటలాడుతూ అద్భుతమైన పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది. నిరంతరం ప్రవహించే ఇక్కడి స్వచ్చమైన జలం క్రింద వున్న బండ రాళ్ళ మీదకు జాలువారుతున్న దృశ్యం అందం చూసి తీరాల్సిందే.ఈ నీటిని సంరక్షించేందుకు దగ్గరలోనే ఒక చిన్న డ్యాం కూడా వుంది. ఇక్కడ పర్వతారోహణ అవకాశాలు కూడా వున్నాయి.



Click it and Unblock the Notifications