తులసి మ్యూజియ౦, ఒక పురావస్తు సంగ్రహాలయం, ఇది సాట్నా పర్యాటక రంగంలో గొప్ప ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మ్యూజియం రామ్వన్ అనే ఆసక్తిని కలిగించే ప్రదేశంలో సాట్నా నుండి 16 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది, ఈ మ్యూజియం 1977 వ సంవత్సరంలో ఏర్పాటుచేయబడింది.
తులసి సంగ్రహాలయ అని కూడా పిలువబడే ఈ మ్యూజియం లో అద్భుతమైన శిల్పాలు, టెర్రకోట, బిర్చ్ ఆర్క్, మర్రి ఆకు వంటి వివిధ మూలకాలతో పురాతన కాలంలో తయారుచేయబడిన భాగాలూ ఉన్నాయి. ఇది కొన్ని అరుదైన రాగి నాణాలు, రాగి రేకులు, బంగారు, వెండి శిల్పాలను కూడా ప్రదర్శిస్తుంది. ఒక్క సోమవారం తప్ప మిగిలిన అన్ని రోజులలో ఈ మ్యూజియం ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 7:00 గంటల మధ్య తెరవబడి ఉంటుంది.



Click it and Unblock the Notifications