ఈ మావో పట్టణం మణిపూర్ కు ప్రవేశం ద్వారం వాలే వుంటుంది. ఈ గ్రామం సేనాపతి టవున్ కు 45 కి. మీ. ల దూరం లో జాతీయ రహదారి 39 పై వుంటుంది. మణిపూర్ కు ఇది ప్రధాన మార్గం. దీనిని మావో గేటు అని కూడా పిలుస్తారు. ఈ పట్టణం ఎల్లపుడూ బిజి గా వుంది అనేక వాణిజ్య కార్యకలాపాలు సాగిస్తుంది. మణిపూర్ మరియు పక్కనే కల నాగాలాండ్ రాష్ట్ర ప్రజలు కూడా ఇక్కడే నివసిస్తారు. ఈ పట్టణం సమీప గ్రామాలకు ఒక ధాన్యాగారం గా వుంటుంది. కొనుగోళ్ళు, అమ్మకాలు విరివిగా సాగుతాయి కనుక మణిపూర్ కు ఇది ఒక వాణిజ్య కూడలి అని చెప్పవచ్చు.