ఖ్రిసలిస్ గ్యాలరీ స్థానిక కళాకారిణి అయిన జయ తాండా ద్వారా నడుపుతున్న ఒక స్థానిక కళా గేలరీ. ఆర్ట్ గ్యాలరీ షిల్లాంగ్ యొక్క చిన్న కొండ స్టేషన్ లో ఉన్నది. ఇది షిల్లాంగ్ లోని ఫోటోగ్రాఫర్స్,శిల్పులు, కళాకారులు మరియు చిత్రకారులకు సహాయపడుతుంది. పెద్ద గ్యాలరీ హాల్ లో అనేక చిత్రాలు, ఛాయాచిత్రాలు,హస్తకళ వస్తువులు,శిల్పాలు ప్రదర్శించడానికి ఉపయోగించే తగినంత మరియు సౌకర్యవంతమైన ప్రదేశం ఉన్నది.
ఖ్రిసలిస్ ఆర్ట్ గ్యాలరీ పోలీస్ బజార్లో నగరం యొక్క నడిబోడ్డులో ఉన్నది. జయ తాండా షిల్లాంగ్ లో నివసించే ఒక స్థానిక కళాకారిణి. నిజానికి తాండా పారిస్ లో ఒక సోలో ప్రదర్శన నిర్వహించిన ఈశాన్య ప్రాంతం నుండి మొదటి కళాకారిణి అని చెప్పవచ్చు. ఆమె కూడా లలిత కళా అకాడమిలో ఈశాన్య ప్రాంతంనకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె చిత్రాలను న్యూఢిల్లీ లో ప్రధాన మంత్రి కార్యాలయం, ప్రెసిడెంట్ యొక్క కార్యాలయం మరియు అనేక ప్రదేశాల్లో చూడవచ్చు.