శిర్దిలోని ముఖ్యమైన స్థలాల్లో ఒకటి లక్ష్మీ బాయ్ షిండే ఇల్లు. సాయి బాబా నిజమైన భక్తులకు ఆయన జీవితంలో లక్ష్మీ బాయ్ షిండే పోషించిన కీలకమైన పాత్ర ఏమిటో తెలుస్తుంది. సాయి బాబా షిర్డీ వచ్చిన నాటి నుంచి చుట్టుపక్కల ఇళ్లలో భోజనం కోసం యాచన చేసేవారు. లక్ష్మీ బాయ్ తనకు చేసిన సేవలను ఆయన ఎప్పుడూ గుర్తు పెట్టుకునేవారు. అందుకే తన శరీరాన్ని సమాధి చేసే ముందు ఆవిడకు ఒక 5 రూపాయల నోటు, నాలుగు రూపాయి బిళ్ళలు కలిపి మొత్తం తొమ్మిది రూపాయలు ఇచ్చారు.ఈ చర్య ద్వారా నిజమైన భక్తుడికి ఉండాల్సిన 9 లక్షణాలను ఆయన సూచించారు. బాబా ఎప్పుడూ లక్ష్మీబాయి కి డబ్బులు ఇచ్చే వారు, కానీ చివరిసారిగా ఇచ్చిన ఈ 9 రూపాయలు చాల ముఖ్యమైనదిగా అందరూ భావిస్తారు.



Click it and Unblock the Notifications