అర్వాలెం గుహలనే పాండవ గుహలని కూడా అంటారు. పాండవులు తమ 12 సంవత్సరాల అరణ్య వాసంలోఈ గుహలలో తలదాచుకున్నట్లుగా కూడా ఇతిహాసాలు చెపుతున్నాయి. ఈ గుహలు సాకేలిం పట్టణానికి సమీపంలోనే ఉంటాయి. ఇవి చిన్న గుహలు. వీటి శిల్పకళ లేదా ఇతర ప్రాధాన్యతల గురించు పెద్దగా తెలిపేందుకు ఏమీ లేదు. అయితే ఈ గుహలు 6వ శతాబ్దానికి చెందినవిగా చెపుతారు. నేటికి వీటిని ఎవరు నిర్మించారనేది నిర్ధారించబడలేదు. కొంతమంది చారిత్రికులు ఈ గుహలు బౌద్ధుల కాలం నాటివని చెపుతారు. అయితే, గోడలపై చెక్కబడిన లింగాలు కొంత చిక్కుముడులను చూపుతున్నాయి.
ఇక్కడ కల లేటరైట్ రాయి నిర్మాణం మరియు కొన్ని బౌద్ధ పర చెక్కడాలు, ఈ గుహలు బహుశ బుద్ధుని కాలంనాటివై వుండవచ్చని కూడా చెపుతున్నాయి. ఈ గుహలలో 7వ శతాబ్దంనాటి కొన్ని సంస్కృతిక శాసనాలను పురావస్తు శాస్త్రవేత్తలు నేటికి పరిశీలిస్తూనే ఉన్నారు.
అర్వాలెం గుహలను హిందూ పర్యాటకులు తరచుగా దర్శిస్తారు. వీటికి పౌరాణిక ప్రాశస్త్యం కలదు. పౌరాణిక ప్రాధాన్యతే కాక, ఈ గుహల నిర్మాణంలో వాడిన ఎర్రటి ఇటుకలు కూడా ఒక సగటు పర్యాటకుడిని బాగా ఆకర్షిస్తాయి. పర్యటనలో ఒక మధ్యాహ్న సమయం కేటాయించగలిగితే, ఈ గుహలు ఒక వినోద ప్రదేశంగా ఉండి, ప్రకృతి ఒడిలే సేద తీరేలా చేస్తాయి. అర్వాలెం గుహల సందర్శనకు వర్షాకాలం అనువైనది. అర్వాలెం చేరటం ఎలా? అర్వాలెం గుహలు సాంకేలిం పట్టణానికి సమీపంలో కొంచెం ఎత్తుగా ఉంటాయి. ఇవి వాస్కో, మార్గోవా, పనాజిం లకు తూర్ప దిశగా ఉంటాయి. గుహల సందర్శనకు అద్దె బైక్ లేదా మీ స్వంత వాహనం సూచించదగినది. ఉత్తరగోవాలో క్యాబ్ లున్నప్పటికి వారు ఈ ప్రదేశానికి మైటర్ పై ఛార్జీ వసూలు చేయరు. అధిక ధరలను కోరతారు.



Click it and Unblock the Notifications