తమెంగ్లాంగ్ జిల్లా ప్రధాన కార్యాలయం నుండి 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న తరాన్ గుహలు 655,6 మీటర్ల పొడవైన గుహ అని చెప్పవచ్చు. తరాన్ గుహ ఐదు ఎగ్జిట్ మరియు 34 అతుకులు కలిగి ఉన్నట్లుగా చెప్పుతారు. గుహ త్రవ్వకాల్లో ఉత్తర వియత్నాం హొబినిఅన్ సంస్కృతి ఆధారాలు కనిపించాయి.
గుహల లోపలి భాగంలో అన్వేషించాలని అనుకునేవారి కోసం మొత్తం 655,6 మీటర్ల పొడవైన గుహ మ్యాప్ గుహ ద్వారం వద్ద ఉంటుంది. ఔత్సాహికులు ప్రతి మూల,మలుపు మరియు లోపల సన్నగా ఉండే మార్గాలు కూడా చూడవచ్చు. మ్యాప్ ను ప్రవేశద్వారం వద్ద రాతి మీద చిత్రీకరించారు.
తరాన్ గుహ సాహసికుల కోసం ఒక ఆసక్తికరమైన గమ్య స్థానంగా ఉంది. మీరు సందర్శిస్తే ఖచ్చితంగా ఒక జీవితకాల అనుభవం ఉంటుంది. మణిపూర్ ప్రయాణంలో మీరు తరాన్ గుహలను చూడటం మాత్రం మర్చిపోకండి.