Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» తారాపిత్

తారాపిత్  - తాంత్రిక ఆలయం గల పట్టణం!  

10

పశ్చిమ బెంగాల్ బిర్బమ్ జిల్లాలో తారాపిత్ శక్తి ఆవిర్భావం చేసిన తారా దేవతకు అంకితం చేయబడిన తాంత్రిక ఆలయం ఉన్నది. ఇది తాంత్రిక ఆలయ పట్టణంగా పేరు గాంచింది. హిందూ మతం విశ్వాసం ప్రకారం శక్త విభాగంనకు చెందిన దైవిక తల్లి దేవత. తారాపిత్ సాహిత్యపరంగా 'దేవత తారా స్థానంలో కూర్చోవడం'అని అర్దము. భారతదేశం అంతటా ఉన్న అనేక శక్తి పీఠాలలో ఒకటిగా కనుగొన్నారు.

తారాపిత్ మరియు పరిసరాలలోని పర్యాటక స్థలాలు

అనేక మతపరమైన గమ్యస్థానాలు బిర్చంద్రాపూర్ ఆలయం,నల్హతేశ్వరి ఆలయం,మల్లర్పూర్ శివ్ దేవాలయం,లక్ష్మీ ఆలయం,మలుతి దేవాలయాలు వంటివి ఉన్నాయి.

తారాపిత్ పురాణంపురాణం ప్రకారం శివ భార్య సతీదేవి ఆమె తండ్రిచే అవమానించబడి సిగ్గుపడి ఆమె అక్కడ జరిగే యజ్ఞాలలో (పవిత్ర అగ్ని) లో ఆమె తనని తాను బలిదానం చేసుకొనెను. మరణించిన తన భార్య వద్ద శివుడు మానసిక వ్యధతో విధ్వంస నాట్యం మనకు తెలిసిన తాండవ నాట్యంను ప్రారంభించేను.

రక్షణ దేవుడైన విష్ణువు వినాశనాన్ని ఆపే ప్రయత్నంలో సతీదేవి యొక్క శరీరంను విభజించి తన సుదర్శన చక్రంను ఉపయోగించి అనేక ముక్కలుగా చేసి భారతదేశం అంతటా వాటిని చెల్లాచెదురుగా పడవేసెను.

తారాపిత్ లో సతి యొక్క కళ్ళు పడ్డాయని చెప్పుతారు. బెంగాలీ లో'తారా'అంటే 'కన్ను' అని అర్ధం. అందువల్ల గ్రామానికి ముందు పేరు తారా అని పెట్టబడింది. చాందిపూర్ తారాపిత్ గా మార్చబడింది. సతీదేవి శక్తి యొక్క సాక్ష్యాత్కారానికి మరొక రూపం అని చెబుతారు.

ఆలయం

తారా మా యొక్క ఆలయం 'దోచల'అని పిలిచే వంపులు తిరిగిన పైకప్పు కలిగి పాలరాయి గోడలు కలిగిన ఒక మధ్యతరహా ఆలయంగా గుర్తించబడుతుంది. ఆలయం యొక్క టెర్రాకోట ప్రవేశద్వారం వద్ద దుర్గా, కాళి వంటి శక్తి యొక్క వివిధ అవతారాలు,హిందూ మతం పురాణ నుండి వివిధ సన్నివేశాలు ఉంటాయి.

అంతర్గత విగ్రహంనకు దారితీసే అన్ని తలుపులు అందమైన చెక్కుడుతో తయారుచేసి ఉంటాయి. శివ మరియు చక్రాల చిత్రాలతో పాటు అమ్మవారి పవిత్ర పుష్పం మందారపువ్వు ను కూడా మెటల్ తో తయారు చేయబడి ఉంటుంది.

మూర్తి మూడు కళ్ళు మరియు ఒక వెర్మిలియన్ అద్ది నోరు సరసముగా రూపొందించిన వెండి ముఖంతో ఉంటుంది. తారా మా యొక్క ప్రసాదం తారా యొక్క అభిషేకం నీరు,మద్యం మరియు సిందూర్ మిశ్రమం అని చెబుతారు. మద్యం తాంత్రిక సన్యాసుల ఎంపిక పానీయం. శివుని నాటి నుండి తారా దేవత దాదాపు ప్రత్యేకంగా మద్యం ఇచ్చేవారని భక్తుల నమ్మకం.

తాంత్రిక క్రిమేషన్ గ్రౌండ్స్

ప్రధాన ఆలయం సమీపంలో ఉన్న ఈ దహన మైదానాల్లో కొన్ని సంవత్సరాలుగా వివిధ తాంత్రిక ఆచారాలు కొనసాగుతున్నాయి. మహాస్మశానంలో తారా దేవత ఉందనే నమ్మకం కొనసాగుతుంది. ఆ ప్రదేశం కనుకోనటానికి ప్రయత్నిస్తారు. ఆమె ఎముకలు మరియు అస్థిపంజరాలతో ఆకర్షించే విధంగా ఉంటుందని నమ్ముతారు. దేవతను ప్రసన్నం చేసుకోవటానికి ప్రతి రోజు ఇక్కడ జంతు బలులు జరుగుతాయి.

మహాస్మశానం తాంత్రిక సెయింట్స్,శాశ్వతంగా దహన మైదానాల్లో అభ్యాసం,ఆధ్యాత్మిక సాధనలో నివశించే సాధువులను ఎక్కువ మందిని ఆకర్షిస్తుంది.

సెయింట్ బమఖేప

అత్యంత గౌరవించే తాంత్రిక సెయింట్స్ లో ఒకరైన, పట్టణప్రాంతంలో భారీ ప్రజాదరణను కలిగి ఉన్న బమఖేప తారాపిత్ యొక్క మాడ్ సెయింట్ గా ఉన్నారు. ఒక గులాబీ ఆలయం దైవిక పిచ్చి కి పేరుపొందిన శ్రీ శ్రీ బందేబ్ అంకితం చేయబడిన స్మ్రుతి మందిరం ఉన్నది. అది ఒక ప్రధాన రహదారి నుండి గ్రామంలోకి ప్రవేశించినప్పుడు కనిపిస్తుంది. బనఖేప యొక్క ఎరుపు సమాధిని దహన మైదానం ప్రవేశద్వారం వద్ద కనుగొన్నారు. యాత్రికులు అన్ని రకాల వస్తువులను ఇక్కడ నివాళిగా అందించే ప్రదేశంగా ఉన్నది.

తారాపిత్ చేరుకోవడం ఎలా

తారాపిత్ ను రహదారి, రైలు మరియు విమాన మార్గాల ద్వారా చేరవచ్చు.

 

తారాపిత్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

తారాపిత్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం తారాపిత్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? తారాపిత్

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
17 Apr,Wed
Return On
18 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
17 Apr,Wed
Check Out
18 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
17 Apr,Wed
Return On
18 Apr,Thu