హౌరా  - ఇమిడిపోయే వారసత్వ రూపకల్పన !

భారతదేశంలో చాలా మెట్రోపాలిటన్ లలో ఉన్న జంట నగరాల మాదిరిగానే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హౌరా మరియు కోలకతా నగరాలు జంట నగరాలుగా ఉన్నాయి. అయితే ఏ ఒక్క పారిశ్రామిక పట్టణం నగరం యొక్క గాలి మరియు మానసిక స్థితి వల్ల పరిపూర్ణ శృంగారం ఉన్నప్పటికీ హౌరా అందుకు విభిన్నంగా ఉంటుంది.

హౌరా లో నాలుగు వంతెనలు కోలకతాకు అనుసంధానం చేయబడి ఉన్నాయి. ఆ వంతెనలు వివేకానంద, విద్యాసాగర్,అత్యంత ప్రజాదరణ పొందిన హౌరా మరియు నివేదిత లుగా ఉన్నాయి. ఈ వంతెనలు మీద నడక ఒక అద్భుతమైన అనుభవంగా ఉంటుంది. గంగా నది యొక్క వీక్షణలు తేలియాడే ధోవాస్ మరియు ఓడల ద్వారా చూడవచ్చు.

ఈ వంతెనలు వారి సొంత మార్గాల్లో ప్రత్యేకమైన వాస్తవం కలిగి ఉన్నాయి. విద్యాసాగర్ వంతెన లేదా సేతు ఒక కేబుల్ వంతెన అని చెప్పవచ్చు. హౌరా వంతెన దాని సంక్లిష్టమైన నెట్వర్క్నురూపకల్పన ఒక కాంటిలివర్ వంతెన మాత్రమే పరమాద్భుతం మరియు ఎత్తును అందిస్తుంది.

హౌరా మరియు పరిసరాలలోని పర్యాటక స్థలాలు

బొటానికల్ తోటలు లేదా ఆచార్య జగదీష్ చంద్రబోస్ భారత బొటానిక్ గార్డెన్ హౌరాలో మనస్సును ఆకర్షించే పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా ఉన్నది. శిబ్పూర్ లో ఉన్న ఈ గార్డెన్ 109 హెక్టార్లకు పైగా విస్తరించి ఉన్నది. ఇక్కడ12,000 కంటే ఎక్కువ జాతుల మొక్కలు ఉన్నాయి.

గొప్ప రావి చెట్టు దాని పందిరి వివిధ ప్రాంతాలకు బాగా కవర్ చేయబడి ఉంటుంది. ప్రపంచంలోనే అతి పెద్ద రావి చెట్టుగా భావిస్తున్నారు. సంత్రగ్చ్చి ఝీల్ లేదా సరస్సు లో అనేక వలస పక్షులు నివాసంగా ఉంటాయి. అంతేకాక ఫోటోగ్రాఫర్లకు తమ కలకు నిజమైన భావన కలుగుతుందని చెప్పవచ్చు.

మంత్రముగ్దులను చేసే నిర్మాణంతో హౌరా వంతెన మరొక ఆకర్షణీయమైన ప్రదేశంగా ఉంటుంది. ఇది హౌరా మరియు కోలకతా లను కలుపుతుంది. ఇది హూగ్లీ నదిపై ఉంటుంది. విద్యాసాగర్ సేతు లేదా రెండవ హూగ్లీ వంతెన కూడా ఈ రెండు నగరాలను కలుపుతుంది. హూగ్లీ నదికి దగ్గరలో ఉన్న అవని రివర్ సైడ్ మాల్ హౌరా పౌరులకు వినోద కేంద్రంగా ఉంటుంది.

ఆహారము మరియు పండుగలు

హౌరా మరియు చుట్టు ప్రక్కల ప్రాంతాలలో దుర్గా పూజను ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు. దుర్గా పూజ మరియు కాళి పూజ తర్వాత దీపావళి పండుగలను ఈ ప్రాంతంలో అత్యంత ప్రసిద్ధ ఉత్సవాలుగా జరుపుకుంటారు.

బెంగాలీ స్వీట్లు ఈ సమయంలో సమృద్ధిగా తయారుచేస్తారు. అంతేకాక దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెంది ఉంటాయి. సందేశ్ మరియు రాస్ మలై వంటి స్వీట్లు నగరం అంతటా అందుబాటులో ఉంటాయి. రామ్రాజతల ఆలయంలో హిందూ మతం పండుగ అయిన శ్రీ రామనవమి సమయంలో పూజిస్తారు.

ప్రకృతి సహజమైన అందం,షాపింగ్ సెంటర్ మరియు పారిశ్రామిక పట్టణం కారణంగానే కాక హౌరా ఒక విద్యా కేంద్రంగా కూడా అభివృద్ధి చెందింది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు మరియు అత్యధికంగా విద్యార్థుల జనాభా తమ ఉన్నత మరియు విశ్వవిద్యాలయ స్థాయి అధ్యయనాల కోసం హౌరా వస్తారు.

ఇక్కడ ఉన్న విశ్వవిద్యాలయాలలో రామకృష్ణ మిషన్ విద్యామందిర మరియు బెంగాల్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ యూనివర్సిటీ ముఖ్యమైనవి. అంతేకాక డాన్ బాస్కో హై స్కూల్ దేశంలో ఉత్తమమైన వాటిలో ఒకటిగా ఉంది.

హౌరాలో ప్రతి ఒక్కరు,అన్ని వయసుల వారు కూడా పట్టణంలో ఒక రోజు పర్యటన గురించి అనేక వాస్తవాలను తెలుసుకునెందుకు సహాయం చేస్తారు. హౌరా పర్యాటనలో కోలకతా సందర్శించడం ప్రయాణికులకు ఒక గొప్ప ఉత్సాహాన్ని ఇస్తుంది. పశ్చిమబెంగాల్ ఇతర గమ్యస్థానాలకు తెలుసుకోవటం ప్రారంభించటానికి ఇది ఒక మంచి ప్రదేశం.

హౌరా సందర్శించడానికి ఉత్తమ సమయం

హౌరా సందర్శించడానికి ఉత్తమమైన సమయం శీతాకాలంలో అని చెప్పవచ్చు.

హౌరా చేరుకోవడం ఎలా

హౌరా పశ్చిమబెంగాల్ ఇతర ప్రాంతాలకు రహదారులు మరియు రైలు మార్గాలను అనుసంధానం చేయబడివుంది. హౌరా నుంచి రైళ్లు కూడా భారతదేశం యొక్క ఇతర రాష్ట్రాలను కలుపుతుంది.

Please Wait while comments are loading...