తీర్థ తొట్టి తేని కి 19 కి. మీ. లు, పెరియకులం కు 2 కి. మీ. ల దూరం లో వుంటుంది. మదురై - కోచి నేషనల్ హై వే లో బోదినయక్కనుర్ వెళ్ళే దారి లో వుంటుంది. ఇక్కడ సుబ్రమణ్య గుడి కలదు. ఈ టెంపుల్ కు వేయి సంవత్సరాల చరిత్ర కలదు. తీర్థ తొట్టి అంటే పవిత్ర నీటి తొట్టి అని అర్ధం. ఇక్కడ వేప చెట్ల మధ్య ఒక సహజ నీటి బుగ్గ కలదు. ఈ చెట్ల మధ్య కల సరస్సు నే తీర్థ తొట్టి అంటారు. ఈ సరస్సు ఎపుడూ ఎందిపోదు. ఈ ట్యాంక్ కు ఒక మండపం, కొన్ని మెట్లు కలవు. తీర్థ తొట్టి గోడలు పై సప్త కన్యలు లేదా ఏడు కన్యలు మురుగన్ మరియు వినాయకుడిని పూజిస్తున్నట్లు వుంటుంది.