తిరుచెందూర్ –సముద్ర తీరం లోని ఆలయ పట్టణం !

తిరుచెందూర్ ను తిరుచెందూర్ అని కూడా అంటారు. ఇది ఒక చిన్న అందమైన కోస్తా తీర పట్టణం, ఇది దక్షిణ ఇండియాలోని తమిల్ నాడు లో తూతుకుడి జిల్లాలో కలదు. ఇక్కడ శ్రీసుబ్రహ్మన్యేశ్వర దేవాలయం ప్రసిద్ధి.

ఒక ఆలయ పట్టణం తిరుచెందూర్ చుట్టుపట్ల కల ఆకర్షణలు

తిరుచెందూర్ ప్రధానంగా ఒక ఆలయ పట్టణం. దీనిలో అందమైన దేవాలయాలు , తిరుచెందూర్ మురుగన్ టెంపుల్, వల్లి గుహ లేదా దత్తాత్రేయ గుహ కలవు. టెంపుల్స్ మాత్రమే కాక ఇతర ఆకర్షణలలో పంచాలంకురిచి కోట, మేలపుతుకూది, కుదిరి మోజితేరి, తూటికోరిన్ మరియు వనతిరుపతి, పున్నై నగర్ లు కలవు.

తిరుచెందూర్ గురించి మరింత చెప్పాలంటే, ఈ టవున్ చుట్టూ తీర ప్రాంత అడవులు వుంటాయి. ఈ అడవి ప్రదేశాలు పచ్చని తాటి చెట్లు, జీడిపప్పు మొక్కలు, మరియు ఉష్ణమండల మొక్కలు కలిగి వుంటాయి. ఈ టవున్ చాలా ప్రాచీనమైనది. చరిత్ర మేరకు ఈ పట్టణం క్రిస్టియన్ గ్రందాల లో కూడా పేర్కొనబడినది. పురాణాల మేరకు శ్రీ మురుగన్ తిరుచెందూర్ లో సురపద్మన్ అనే రాక్షసుడిని వధించాడు. ఈ ప్రదేశం శ్రీ మురుగన్ కు పవిత్ర నివాసం.

తిరుచెందూర్ ను గతంలో కాపాడపురం అనే వారు. తర్వాతి కాలంలో తిరుచేన్ చెందిలూర్ అని మరియు తర్వాత తిరుచెన్ – చెందిలూర్ అని ఆతర్వాత తిరు చెందూర్ అని పిలిచారు. తిరుచెందూర్ ను అనేక రాజ వంశాలు పాలించాయి. వారిలో చెరలు, పంద్యాలు మొదలైన వారు కలరు. క్రి.శ.1649 లో ఈ పట్టణం డచ్ వారిచే దాడి చేయబడినది. వీరు తూతుకుడిని పోర్చుగీస్ నుండి జయించటానికి ప్రయత్నించారు. అయితే పోర్చుగీస్ వారు మదురై నాయకుల సహకారంతో డచ్ ను పారద్రోలారు.

తిరుచెందూర్ వాతావరణం

తిరుచెందూర్ వాతావరణం సంవత్సరం పొడవునా ఒకే మోస్తరుగా వుంటుంది. అక్టోబర్ నుండి మార్చ్ వరకు పర్యాటకుల, తీర్థ యాత్రికుల విహారాలు బాగానే సాగుతాయి. జూన్ నుండి సెప్టెంబర్ వరకూ టెంపుల్స్ చూసేందుకు చిన్న పాటి సందర్శనలు అనుకూలం.

తిరుచెందూర్ ఎలా చేరాలి ?

తిరుచెందూర్ కు చక్కని రోడ్డు మార్గం కలదు. సమీప ఎయిర్ పోర్ట్ టూటికోరిన్ లో కలదు. ఇది 27 కి.మీ.ల దూరంలో వుంటుంది. ఈ ప్రదేశం తిరునల్వేలి జంక్షన్ కు కూడా రైలు మార్గంలో కలుపబడి దేశం లోని ఇతరప్రాంతాలకు కలుపబడి వుంది. మీకు చరిత్రపై ఆసక్తి, యాత్ర చేసే ఆసక్తి ఉన్నట్లయితే, తిరుచెందూర్ మీ పర్యటనకు సరైన ప్రదేశం.

Please Wait while comments are loading...