తిరుచెందూర్ మురుగన్ టెంపుల్ టవున్ కు ప్రధాన ఆకర్షణ. ఇది లార్డ్ మురగకు గల ఆరు టెంపుల్స్ లో ఒకటి. ఈ టెంపుల్ లో మురుగన్ తో పాటు అతని భార్యలు అయిన వల్లి మరియు దేవసేన లు కూడా కొలువు తీరి వుంటారు. ఈ టెంపుల్ లో శివుడు, విష్ణువు విగ్రహాలు కూడా కలవు. ఈ టెంపుల్ వేదకాలం నుండి కలదు. దీనిని గురించి ప్రాచీన గ్రంధాలలో పేర్కొనబడింది. ఈ టెంపుల్ కు తొమ్మది అంతస్తుల గోపురం ప్రవేశం లో కలదు. టెంపుల్ ఆవరణలో కల ఒక నీటి బుగ్గకు భావిని నిర్మించారు. మురుగన్ విగ్రహం తూర్పు ముఖంగా వుంటుంది. అయితే టెంపుల్ ప్రవేశం దక్షిణంగా వుంటుంది.
ఈ మురుగన్ టెంపుల్ మాత్రమే సముద్రపు ఒడ్డున కలదు. మురుగన్ కు చెందిన ఇతర అయిదు టెంపుల్స్ కూడా కొండలపై లేదా అడవులలో కలదు. ఈ టెంపుల్ లో బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, విస్క విసాకం, స్కంద సష్టి, ఆవని ప్పెరుని తిరున్నాల్, మరియు మాసిప్పేరున్తిరునాల్ మరియు ఊంజల్ సేవ వంటివి అతి వైభవం గా జరుపుతారు.