Search
  • Follow NativePlanet
Share
» »నిజంగానే దెయ్యాలు కనిపించిన కొన్ని ప్రదేశాలు ఇవే..

నిజంగానే దెయ్యాలు కనిపించిన కొన్ని ప్రదేశాలు ఇవే..

మీరు హాంటెడ్ ప్రదేశాలు గ్రామాలు లేదా నిర్జీవ ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయని భావిస్తున్నారా. అయితే మీరు పొరబడినట్లే. భారతదేశంలో ప్రధాన నగరాల్లో కూడా కొన్ని హాంటెడ్ ప్రదేశాలు ఉన్నాయి.

మీరు హాంటెడ్ ప్రదేశాలు గ్రామాలు లేదా నిర్జీవ ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయని భావిస్తున్నారా. అయితే మీరు పొరబడినట్లే. భారతదేశంలో ప్రధాన నగరాల్లో కూడా కొన్ని హాంటెడ్ ప్రదేశాలు ఉన్నాయి. ముంబై, ఢిల్లీ, బెంగుళూర్, కోలకతా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి నగరాల్లో కూడా హాంటెడ్ ప్రదేశాలు ఉన్నాయి. నగరాలలో ప్రజలకు కూడా ప్రతిసారీ దిగ్భ్రాంతిని కలిగించే మరియు భయానకంగా ఉండే అతీంద్రియ చర్యలకు సంబంధించిన కేసులు నమోదు అయ్యాయి. కొన్ని ప్రదేశాలు నిజంగా ప్రమాదకరమైనప్పటికి,అక్కడ అనేక దయ్యాలు మరియు దుష్ట ఆత్మలు ఉంటాయి. రాజస్థాన్ లో భంగ్రా భవన్ ప్యాలస్ లేదా ముంబై లో మహీం వారి డి 'సౌజా చావ్ల్ తీసుకోండి. ఈ హాంటెడ్ ప్రదేశాలలో దయ్యాలను చూసి మీరు భయపడి ఉండవచ్చు. కనుక భారతదేశంలో టాప్ హాంటెడ్ ప్రదేశాలను పరిశీలిద్దాము.

ఇండియాలో దెయ్యాలు తిరిగే అతిభయంకరమైన ప్రదేశాలంటూ కొన్ని ప్రదేశాలను చెప్తూవుంటాం. ఇంతకి ఆ ప్రదేశాలు ఏంటో ఈ వ్యాసంలో తెలుసుకుందాం. ఇక్కడ ప్లేస్ కి వెళితే మీరు భయపడవలసిన దాని కన్నా ఇంకా ఎక్కువ భయపడతారంటా.అది ఎక్కడో తెలుసా?

రియల్ గా దెయ్యం కనపడ్డ ప్రదేశాలు..!

రియల్ గా దెయ్యం కనపడ్డ ప్రదేశాలు..!

రాజస్థాన్ లోని భాంగ్రాకోట

హాంటెడ్ ప్రదేశం అనగానే రాజస్థాన్ ప్రజలకు వినిపించే ప్రదేశమే భాంగ్రాఫోర్ట్.ఇది రాజస్థాన్ లోని ఆళ్వార్ జిల్లాలో వుంది. భారతదేశంలోని అత్యంత భయంకరప్రదేశాలలో భాంగ్రాఫోర్ట్ ముందుంటుందట.

PC:youtube

రియల్ గా దెయ్యం కనపడ్డ ప్రదేశాలు..!

రియల్ గా దెయ్యం కనపడ్డ ప్రదేశాలు..!

రాజస్థాన్ లోని భాంగ్రాకోట

ఈ కోటపైన చాలా రకాల కధలున్నాయి. ఈ కోట బయట ప్రవేశద్వారం వద్ద ఒక హెచ్చరిక బోర్డుకూడా వుంటుంది. మీరు వెళ్ళినప్పుడు చూడండి.

PC:youtube

రియల్ గా దెయ్యం కనపడ్డ ప్రదేశాలు..!

రియల్ గా దెయ్యం కనపడ్డ ప్రదేశాలు..!

గుజరాత్ లోని డ్యుమాస్ బీచ్

ఈ బీచ్ గురించి సాగరతీరాన సేదతీరవచ్చు అంటుకుంటారు కానీ ఈ బీచ్ కు వెళితే మీ పని అంతే అంటూవుంటారు. ఈ వేడి పర్యాటకప్రదేశం కూడా ఒక హాంటెడ్ ప్రదేశమే.సాయంత్రం తర్వాత ప్రజలు ఈ బీచ్ ని సందర్శించటానికి లేదు.

PC:youtube

రియల్ గా దెయ్యం కనపడ్డ ప్రదేశాలు..!

రియల్ గా దెయ్యం కనపడ్డ ప్రదేశాలు..!

గుజరాత్ లోని డ్యుమాస్ బీచ్

ఎందుకంటే ఈ బీచ్ లో అనేక మిస్సింగ్ కధలున్నాయి. ఈ బీచ్ ముందుభాగంలో మృత దేహాలను కాల్చటానికి వుపయోగిస్తారు. భయంకరరహస్యమేంటో ఇంకా అంతుచిక్కకుండానే వుంది.

youtube

రియల్ గా దెయ్యం కనపడ్డ ప్రదేశాలు..!

రియల్ గా దెయ్యం కనపడ్డ ప్రదేశాలు..!

డౌహిల్ వెస్ట్ బెంగాల్ లోని ఒక పాఠశాల

పశ్చిమబెంగాల్ లోని కుర్సియాంగ్ దగ్గర వున్న పాఠశాల ఇది.ఒక అడవిలో వుంటుంది.ఈ ప్రదేశాన్ని అక్కడ హాన్టేడ్ ప్రదేశంగా భావించబడుతుంది.చాలా మంది హత్యలు భయంకరమైన అరుపులు, శబ్దాలు వినిపిస్తాయట.

PC:youtube

రియల్ గా దెయ్యం కనపడ్డ ప్రదేశాలు..!

రియల్ గా దెయ్యం కనపడ్డ ప్రదేశాలు..!

ఢిల్లీ కంటోన్మెంట్ న్యూఢిల్లీ

ఢిల్లీలో అత్యంత భయంకరప్రదేశం.ఈ ప్రదేశం డార్క్ మరియు ఆకుపచ్చఅడవి. చనిపోయిన అనేకమంది తెలుపుచీర కట్టుకుని వచ్చేపోయే వాహనాలకు లిఫ్టడుగుతూవుంటారు.

PC:youtube

రియల్ గా దెయ్యం కనపడ్డ ప్రదేశాలు..!

రియల్ గా దెయ్యం కనపడ్డ ప్రదేశాలు..!

ఢిల్లీ కంటోన్మెంట్ న్యూఢిల్లీ

మీరు ఆమెకు లిఫ్ట్ ఇవ్వకపోతే ఆమె మీ వెనుక వస్తూ మిమ్మల్ని వెంటాడుతుందని చెప్తూవుంటారు. మరి మీరు ఎప్పుడైనా వెళ్లి ఆ రూట్ లో లిఫ్ట్ ఇవ్వొచ్చు ఆ అందాల దెయ్యానికి.

PC:youtube

రియల్ గా దెయ్యం కనపడ్డ ప్రదేశాలు..!

రియల్ గా దెయ్యం కనపడ్డ ప్రదేశాలు..!

సెయింట్ మార్క్స్ రోడ్ లోని ఒక ఇల్లు

ఇది ఎక్కడో కాదు. బెంగుళూరులో వుంటుంది. బెంగుళూరులో వుండే ప్రజలు సెయింట్ మార్క్స్ రోడ్ లోకి వెళ్ళాలంటే భయపడతారు. ఎందుకంటే అక్కడ ఒక ఇంట్లో దెయ్యం తిరుగుతూవుంటుందని ఆ దెయ్యాన్ని చాలా మంది చూసారని చెబుతూవుంటారు. ఆ ఇంట్లో వున్న ఒక మహిళ అనుమానాస్పద హత్య జరిగింది. ఆ ఇల్లు చుట్టుపక్కల ఆ మహిళ దెయ్యంగా తిరుగుతూవుంటుందంట.

PC:youtube

రియల్ గా దెయ్యం కనపడ్డ ప్రదేశాలు..!

రియల్ గా దెయ్యం కనపడ్డ ప్రదేశాలు..!

పూనాలోని శనివార్ వాడా

పూనా లోని ఈ కోట అక్కడ కల అందమైన శిల్పాలకు, మొగల్ శిల్ప సంపాదకు ప్రసిద్ధి. కాని స్థానికులు ఇది ఒక దెయ్యాల కోట అని నమ్ముతారు. ఇక్కడ నారాయణ రావు అనే ఒక 13 సంవత్సరాల పీష్వా వారసుడు హత్య గావించబడ్డాడు. హంతకులు అతనిని తరుముతూ వుంటే, ఆ చిన్న బాలుడు కోట అంతా పరుగెడుతూ "కాకా , మాలా వచ్వా " అని కేకలు పెట్టాడట. అంటే "అంకుల్, నన్ను రక్షించండి" అని అర్ధం చెపుతారు. నేటికి రాత్రులందు ఇక్కడ ఆ కేకలు కోటలో వినపదతాయని స్థానికులు చెపుతారు. పిల్లవాడు అతి క్రూరంగా హత్యగావించ బడ్డాడు. అతని ఆత్మా నేటికీ ఆకోతలో వుందని చెపుతారు. ప్రత్యేకించి ప్రతి పౌర్ణమి నాడు అర్ధ రాత్రిలో ఆ కేకలు వినపదతాయని చెపుతారు.

రియల్ గా దెయ్యం కనపడ్డ ప్రదేశాలు..!

రియల్ గా దెయ్యం కనపడ్డ ప్రదేశాలు..!

హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ

హైదరాబాద్ లో రామోజీ ఫిలిం సిటీ ఒక గొప్ప పర్యాటక ఆకర్షణ. కాని దీనిని కూడా ప్రేతాత్మల నిలయం అంటారు. విశాలంగా నిర్మించబడిన ఈ గొప్ప ఆకర్షణ ఒకప్పుడు నిజాం సుల్తానుల యుద్ధ భూమి. అక్కడ మరణించిన సైనికుల ఆర్త నాదాలు నేటికీ అక్కడ ప్రతిధ్వనిస్తూ ఉంటాయని చెపుతారు. ఇక్కడి హోటల్స్ లో ఎన్నో వింత సంఘటనలు జరుగుతూ వుంటాయి. షూటింగ్ లు జరిగేటపుడు మిస్టరీ గా వాటి అంతట అవే లైట్ లు ఆరిపోతాయి. అక్కడ ఉన్నవారిని ఎవరో తోసినట్లు అనిపిస్తుందని కొందరు చెపుతారు. మరి ఈ గొప్ప పర్యాటక ఆకర్షణల వెనుక కల దెయ్యాల గాధలు తెలిసిన తర్వాత కూడా ఈ ప్రదేశాలు సందర్సిస్తారా ? లేక ఆ ఏముందిలే ...అంటూ ఒక నవ్వు నవ్వి కొట్టి పారేస్తారా...?

రియల్ గా దెయ్యం కనపడ్డ ప్రదేశాలు..!

రియల్ గా దెయ్యం కనపడ్డ ప్రదేశాలు..!

ఆగ్రాసెన్స్ బావోలీ - ఢిల్లీ

ఢిల్లీ రాజధానిలో వుండే ఈ బంగళాలో కొన్ని భయానక శబ్దాలు వినిపిస్తాయని అక్కడి జనావాసులు ఇప్పటికీ చెబుతుంటారు. అంతేకాదు.. రాత్రివేళల్లో తెల్లచీరలో ఎవరో తిరుగుతున్నట్లు కనిపిస్తుందట.

Photo Courtesy: gopal

రియల్ గా దెయ్యం కనపడ్డ ప్రదేశాలు..!

రియల్ గా దెయ్యం కనపడ్డ ప్రదేశాలు..!

బెంగుళూర్ అంతర్జాతీయ విమానాశ్రయం - బెంగుళూర్

బిజీ ప్రదేశంలో ఉన్న విమానాశ్రయంను హాంటెడ్ ప్రదేశం అంటారు. ఎందుకంటే బెంగుళూర్ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో సిబ్బంది మరియు ప్రయాణీకులు కొన్ని పారానార్మల్ కార్యకలాపాలను చూసారు.

Photo Courtesy:Hynek Moravec

రియల్ గా దెయ్యం కనపడ్డ ప్రదేశాలు..!

రియల్ గా దెయ్యం కనపడ్డ ప్రదేశాలు..!

ఆలేయ ఘోస్ట్ లైట్స్ - పశ్చిమ బెంగాల్

బెంగాల్ రాష్ట్రంలో వున్న అడవిలో రాత్రి సమయంలో కొన్ని ప్లేసుల్లో వెలుగుతున్నట్లు కనిపిస్తుంది. అవి ఎలా ఎందుకు మెరుస్తాయో ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగా వుండిపోవడంతో అవి దెయ్యాలని అనుకుంటున్నారు.

Photo Courtesy: fedrik

రియల్ గా దెయ్యం కనపడ్డ ప్రదేశాలు..!

రియల్ గా దెయ్యం కనపడ్డ ప్రదేశాలు..!

బ్రిజ్ భవన్ ప్యాలెస్ - రాజస్థాన్

రాజస్థాన్ లోని కోట ప్రాంతంలో ఈ భవనం వుంది. చంద్రముఖి సినిమా అందరికీ తెలిసి వుంటుంది. ఆ స్టోరీలాగే ఈ భవంతిలో కూడా ఓ లేడీ దెయ్యం సంచరిస్తున్నట్లు ఇక్కడి జనాలు చెబుతుంటారు.

Photo Courtesy: jhon

రియల్ గా దెయ్యం కనపడ్డ ప్రదేశాలు..!

రియల్ గా దెయ్యం కనపడ్డ ప్రదేశాలు..!

ఫిరోజ్ షాహ్ కోట్ల ఢిల్లీ

రాజధాని ప్రాంతంలో వుండే ఈ మస్జిద్ చాలా పురాతనమైంది. ఇక్కడ ఎవరైనా ఒంటరిగా సంచరిస్తే.. అంతే సంగతులు! ఎవరో వెంబడిస్తున్నట్లు, మనపై దాడిచేస్తున్నట్లుగా అనిపిస్తుంది. అంటే.. దెయ్యం వెంటపడుతున్నట్లు ఫీలింగ్ కలుగుతుంది.

Photo Courtesy: boldsky

రియల్ గా దెయ్యం కనపడ్డ ప్రదేశాలు..!

రియల్ గా దెయ్యం కనపడ్డ ప్రదేశాలు..!

జటింగా వ్యాలీ

అస్సాం రాష్ట్రంలో వుండే ఈ ప్రదేశం చూడ్డానికి ఎంతో అందమైనప్పటికీ.. మోస్ట్ హాంటెడ్ ప్రదేశంగా పేరుగాంచింది. అనుకోని సంఘటన జరిగిన నేపథ్యంలో అప్పటినుంచి దీనికాపేరు వచ్చింది.

Photo Courtesy: prabhu

రియల్ గా దెయ్యం కనపడ్డ ప్రదేశాలు..!

రియల్ గా దెయ్యం కనపడ్డ ప్రదేశాలు..!

టన్నల్ నెం.103

కలనల్ బారోగ్ నిర్మించిన ఈ టన్నల్ షిమ్లా వెళ్లేదారిలో వుంది. దీనిగుండా ప్రయాణిస్తున్నప్పుడు దీని సృష్టికర్త బారోగ్ రూపం కనిపిస్తుందని ప్రయాణికులు అంటున్నారు. ఒకప్పుడు దీన్ని మూసేయాలని ప్రభుత్వం మెటల్ డోర్ చేసి ప్రవేశద్వారంలో పెట్టినా.. మరుసటి రోజే అది విరిగిపోయింది. దాంతో ఇక్కడ దెయ్యం వుందని అందరికీ నమ్మకం ఏర్పడిపోయింది.

Photo Courtesy: anurag

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+