తమిళనాడు  పర్యాటకరంగం - విశిష్ట అవలోకనం

హోమ్ » ప్రదేశములు » » అవలోకనం

తమిళనాడు పర్యాటక రంగం అక్కడి సహజ అందాలకు, ప్రకృతికి, సంస్కృతీ, జాతీయతలతో విలక్షణ మైనది. పర్యాటకుల అభిరుచులకు అనుగుణమైన విశేషాలతో ఆకట్టుకోగలిగే గొప్పతనం కలది. ఇటువంటి విశేషాలతో తమిళనాడు పర్యాటకుల మనసుని ఆకట్టుకుని ఓక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నది. తమిళనాడు హిల్ స్టేషన్ - ఊరించే పర్యాటక విశేషాలు పర్యాటకులు విశేషంగా ఆకర్షించబడే తమిళనాడు హిల్ స్టేషన్ లలో ముందు ఉండేవి ఊటీ మరియు కొడైకనాల్. ఊటీ, కూనూర్, కోటగిరి మొదలగు నీలగిరి లోని హిల్ స్టేషన్ లు పర్యాటకులను వాటి మనోహరమైన ప్రక్రుతి, వాతావరణా లతో ఊరిస్తాయి . తమిళనాడు సేలం జిల్లా లోని మరొక ప్రఖ్యాత హిల్ స్టేషన్. ఏలగిరి, కొల్లి హిల్స్ మరియు వల్పరై వంటివి ఇప్పుడిప్పుడే పర్యాటకుల ఆకర్షణ చూరగొంటున్నాయి . తమిళనాడు బీచ్ లు - ఆకట్టుకునే తీరప్రాంతపు అందాలు తమిళనాడు తీరప్రాంతం లోని పర్యాటక ప్రదేశాలు బీచ్ లో వినోదం పొందాలను కునేవారికి చక్కటి మజిలీలు. అలాంటి బీచ్ లలో మహాబలిపురం మొట్ట మొదటగా గుర్తుకువస్తుంది. చెన్నై లోని మెరీనా బీచ్, బిసెంట్ నగర్ బీచ్ లు తమిళనాడు రాజధాని నగరాన్ని సందర్శించే పర్యాటకులకు వినోదాన్ని అందిస్తాయి.

మహాబలిపురం నీటి పొడిగింపు అయిన కోవేలోంగ్ బీచ్ చెన్నై లోని మరొక అందమైన ఆకర్షణ. నాగపట్టినం జిల్లా లోని ముఖ్య తీర ప్రాంతాలు అయిన నాగూరు, వేలన్కాన్ని, సిక్కల్, కోడియక్కరై, వేదరణ్యం, మన్నరగుడి మరియు ట్రంక్విబార్ పర్యాటక ఆకర్షణలు. తమినాడు మరియు పాండిచేరిలో,బే ఆఫ్ బెంగాల్ తీరాన ఉన్న ఆసక్తిని కలిగించే చిన్న పట్టణం ఈ నాగూరు. పూం పుహార్ తీర ప్రాంతం మాత్రమే కాక ప్రముఖ తమిళ పురాణం అయిన సిలపతికరం లో ప్రత్యేక స్థానం కలిగి ఉన్నది. దక్షిణాన అత్యంత చివరి కొనలో బే అఫ్ బెంగాల్, అరేబియన్ సీ మరియు హిందూ మహా సముద్రాలు సంగమించే ప్రదేశం ఈ కన్యాకుమారి. తమిళనాడు తరవాత పర్యాటక రంగంలో తన భౌగోళిక ప్రాకృతిక విశేషాలతో నిలువ గలిగేదీ ఈ కన్యాకుమారి. తీర ప్రాంతం లోని తిరుచెందూర్ మరియు రామేశ్వరం ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రదేశాలు. తమిళనాడు వారసత్వ ప్రదేశాలు - సంస్కృతిక కేంద్రాలు తమిళనాడు లోని కొన్ని ప్రదేశాలు వాటి యొక్క సంస్కృతిక వారసత్వ సంపదతో పర్యాటకులను స్వదేశం లోనే కాక విదేశాల నుండి కూడా ఆకర్షిస్తున్నాయి. విశిష్ట కరైకుడి ఉన్న చెట్టి నాడ్ ప్రదేశం ఇటువంటి ప్రదేశాలలో ముఖ్యమైనది. ఇక్కడి వంటలు , అల్లికలు , అనేక దేవాలయాలు , రిసార్ట్ లు గా మారిన భవనాలు తమిళనాడు సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. కొంగు సంస్కృతీ కల కోయంబత్తూర్, దేవాలయ నగరం మదురై మరియు తంజావూర్ నవీన యుగంలో కూడా సంస్కృతీ కి నెలవుగా ఉన్నాయి.

తమిళనాడు దేవాలయాలు - ఆపేక్షపూరిత అధ్బుతాలు తమిళనాడు పర్యటన రంగానికి ఆయువు పట్టు ఈ రాష్ట్ర దేవాలయాలు. ఈ దేవాలయాలయాల గోపురాలు కోప్ప కళా నైపుణ్యం కలిగిన కళాకారుల ప్రతిభకు, శిల్పకళా చాతుర్యానికి నెలవు . కుంబకోణం మరియు తంజావూర్ అప్పటి రాజుల నిర్మాణ కౌశలానికి అద్దం పడతాయి, పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి . దరసురం, మయ్లడుతురై , తిరువరూర్ , తిరుమనంచేరి , తిరుకరుకవుర్ మొదలగు అనేక ముఖ్య దేవాలయాలు సందర్సిన్చతగినవి. పాండ్య రాజులచే నిర్మించ బడిన మధుర మీనాక్షి దేవాలయం, తమిళనాడు లోని దేవాలయ నిర్మాణ కౌశలానికి శిల్ప కళా నైపుణ్యానికి ఒక గొప్ప ఉదాహరణ. సముద్ర తీర ప్రాంతాన ఉన్న శివక్షేత్రం రామేశ్వరం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. తమిళనాడు లోని అనేక దేవాలయాలు ఆధ్యాత్మిక పర్యటనకు కొలువై ఉన్నాయి.

తంజావూర్ చుట్టూ ఉన్న నవగ్రహ దేవాలయాల లో దేశం నలుమూలల నుండి వచ్చే భక్తులు నవగ్రహాలను పుజిస్తారు. అలంగుడి (జుపిటర్), తిరునల్లర్ (సాటర్న్), కన్జనూర్ (వీనస్), తిరువెంకడు (మెర్క్యూరీ ) , తిరునగేస్వరం (స్నేక్ ప్లానెట్ ), కీజాపెరుమ్పల్లం (స్నేక్ ప్లానెట్ ), సురిఅనర్ కోయిల్ (సన్ గాడ్ ) , తిన్గాలుర్ (మూన్ ) మరియు వైదీశ్వరన్ ( మార్స్ ) నవగ్రహ దేవాలయాలు. పంచభూత దేవాలయాలు - పంచభూతాల మూలమయిన పరమ శివుని దేవాలయాలు ఈ పంచభూత దేవాలయాలు.

తిరువనైకవల్, తిరువన్నమలై , కాంచీపురం మరియు చిదంబరం వీటిలో నాలుగు తమిళనాడులో ఉన్నాయి. శ్రీ కాళహస్తి ఐదవ దేవాలయమ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది . భగవంతుడు సుబ్రమణ్యుని (మురుగ) 6 యుద్ద శిబిరాలు - తమిళు దేవుడు అయిన మురుగ, ఆయన యొక్క వీరత్వము మరియు జ్ఞానానికి ప్రసిద్ది. ఇక్కడి ఆరు భగవంతుడు మురుగ దేవాలయాలు భక్తుల ఆధ్యాత్మిక కేంద్రాలు గా విరసిల్లుతున్నాయి. పళని, తిరుపరంకుండ్రం, తిరుచెందూర్, పలముదిర్చోలై, తిరుత్తణి మరియు స్వామిమలై అయిదు ప్రాశస్త్య ముఖ్య దేవాలయాలు .తమిళనాడు నగరాలు చెన్నై , కోయంబతోర్ , మదురై , త్రిచి , సేలం , ఈరోడ్ , వెల్లూర్ , తిరుపూర్ , తిరునెల్వేలి మరియు తూతుకుడి నుండి ఈ రాష్ట్ర పర్యటనకు స్తానాలయిన నగరాలు .

Please Wait while comments are loading...