తిరుత్తణి - పవిత్రమైన గ్రామం !

మురుగా భక్తులకు తిరుత్తణి ఒక పవిత్రమైన భూమి. ఈ గ్రామంలో ఆరు హిందూ దేవతల గుడులు కలవు. ఈ గ్రామం తమిల్ నాడు లోని తిరువళ్లూర్ జిల్లాలో కలదు. ఇక్కడ ప్రసిద్ధ ఆకర్షణ శ్రీ సుబ్రహ్మణ్యస్వామి టెంపుల్ కాగా ప్రతి సంవత్సరం అనేక మంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు. ప్రకృతి అందాలను ఆస్వాదించే వారికి ఇక్కడ ఒక చిన్న అందమైన సరస్సు - నంది నది కలదు. శరవణ పాయికల్ అనబడే కుమారా తీర్థ కూడా ఒక పవిత్రమైన కొలను గా భావిస్తారు. ఈ నీరు ఔషధ గుణాలు కలిగి వుందని నమ్ముతారు.

తిరుత్తణి చుట్టుపట్లకల పర్యాటక ప్రదేశాలు

శ్రీ మురుగా దుష్ట శక్తులపై విజయంసాధించిన ఆరు స్థలాలలో తిరుత్తణి ఒకటి గా భక్తులు నమ్ముతారు. మిగిలిన అయిదు దేవాలయాలు పాలని దండయుధపని స్వామి టెంపుల్, తిరుచెందూర్ సెంథిల్ అందవార్ టెంపుల్,తిరుపరంకుండ్రం సుబ్రమణ్య స్వామి టెంపుల్, స్వామి టెంపుల్, స్వామిమలై స్వామినాథ స్వామి టెంపుల్ మరియు పాలముదిర్చోలై సుబ్రమణ్య స్వామి టెంపుల్. సుబ్రహ్మనేశ్వర్ డి ఆశీర్వాదాలు పొందాలంటే, ఈ ఆరు పుణ్య క్షేత్రాలు దర్శించాల్సిందే. టూరిస్టులకు తిరుతణిలో సుబ్రహ్మణ్యస్వామి టెంపుల్ మాత్రమే కాక ఇంకా అనేక ఆకర్షణలు కలవు. వాటిలో సంతాన వేణుగోపాలపురం టెంపుల్ ఒకటి. ఈ గుడిని వేలాది భక్త్రులు, పర్యాటకులు ప్రతి సంవత్సరం దర్శించు కొంటారు.

తిరుతణి వాతావరణం సంవత్సరం పొడవునా ఇక్కడి వాతావరణం తేమగాను వేడిగాను వుంటుంది. ఈ ప్రదేశ సందర్శనకు సెప్టెంబర్ నుండి మార్చ్ వరకూ గల వింటర్ అనుకూలమైనది.

తిరుతణి ఎలా చేరాలి

తిరుత్తణి కి అనువైన రోడ్డు మరియు రైలు మార్గాలు కలవు. ఈ ప్రదేశానికి సమీప రైలు స్టేషన్ చెన్నై లో కలదు. తమిళ్ నాడు లోని ప్రధాన నగరాలనుండి బస్సులు టాక్సీలు తరచుగా లభిస్తాయి.

Please Wait while comments are loading...