Search
  • Follow NativePlanet
Share
» »అమర్నాథ్ యాత్రకు మీరు రెడీనా...పేరు నమోదు మర్చిపోకండి

అమర్నాథ్ యాత్రకు మీరు రెడీనా...పేరు నమోదు మర్చిపోకండి

అమర్నాథ్ యాత్రకు సంబంధించిన కథనం

By Kishore

భారతదేశంలోని పుణ్యక్షేత్రాల్లో అమర్నాథ్ క్షేత్రం మొదటి వరుసలో ఉంటుంది. ఛార్ దామ్ యాత్రలో భాగంగా ఈ పుణ్యక్షేత్రాన్ని ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో సందర్శిస్తుంటారు. సముద్ర మట్టం నుంచి దాదాపు 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ దేవాలయాన్ని చూడటానికి ఒక్క భారత దేశం నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. అయితే ఏడాది మొత్తం ఈ పుణ్యక్షేత్రం భక్తులకు అందుబాటులో ఉండదు. కేవలం వేసవి కాలంలో మాత్రమే ఇక్కడ భక్తులను అనుమతిస్తారు. ఈ నేపథ్యంలో జమ్ము కాశ్మీర్ లోని ఈ పుణ్యక్షేత్రం సందర్శన సమయాన్ని అక్కడి ప్రభుత్వం ప్రతి ఏడాది ప్రకటిస్తుంది. ఈ నేపథ్యంలో 2018 ఏడాదికి గాను ఇప్పటికే సందర్శన సమయాన్ని ప్రకటించింది. అందువల్ల ఈ ఏడాది అమర్నాథ్ యాత్రకు వెళ్లానుకొన్నవారు ఇప్పటి నుంచే ణాళికను సిద్ధం చేసుకోండి. ఎందుకంటే ఈ యాత్ర చేయాలనుకొన్నవారు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇందుకు సంబంధించిన వివరాలు మీ కోసం....

1. లక్షల ఏళ్ల క్రితం నాటిదని చెబుతారు....

1. లక్షల ఏళ్ల క్రితం నాటిదని చెబుతారు....

Image Source:

ఇదొక గుహాలయం. లక్షల సంవత్సరాల నాటిదని చెబుతారు. ఇక్కడ శివుడు లింగ రూపంలో మనకు దర్శనమిస్తాడు. మంచు ప్రతి ఏడాది ఇక్కడ ఖచ్చితంగా శివలింగం ఆకారం దాల్చుతుంది. ఇదంతా ఆ పరమేశ్వరుడి లీలా కటాక్షమని చెబుతారు. ఇక ఈ క్షేత్రాన్ని చేరుకోవడం అంత సులభమైన విషయం మాత్రం కాదు. కొండలను గుట్టలను దాటుకొంటూ వెళ్లాల్సి ఉంటుంది. అందువల్లే ఈ యాత్ర వెళ్లాలనుకొనేవారు చాలా రోజుల నుంచి ప్రణాళికను సిద్ధం చేసుకొంటూ ఉంటారు.

2.60 రోజుల పాటు యాత్ర

2.60 రోజుల పాటు యాత్ర

Image Source:

ఈ ఏడాది అమర్నాథ్ యాత్రం 60 రోజుల పాటు కొనసాగుతుంది. వివరాలు ఇలా
ఎప్పటి నుంచి ఎప్పటి వరకూ జూన్ 28 నుంచి ఆగస్ట్ 26 వరకూ

పేర్ల నమోదు ఎప్పటి నుంచి మార్చ్ 1 నుంచి ప్రారంభమయ్యింది. ఈ నెలాఖరు వరకూ

ఫీజు.. రూ.7,500
ఏ ఏ బ్యాంకులో చెల్లించాలి పంజాబ్ నేషనల్ బ్యాంక్, జమ్ము కాశ్మీర్ బ్యాంక్
ఒక రోజుకు గుహలోపలికి వెళ్లి శివలింగాన్ని సందర్శించే భక్తులు 1500

3. ఎవరెవరికి ప్రవేశం

3. ఎవరెవరికి ప్రవేశం

Image Source:

14 నుంచి 74 ఏళ్ల మధ్య ఉన్న వారికి మాత్రమే ఈ యాత్రలో పాల్గొనడానికి అనుమతి ఇస్తారు. వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిబంధన విధించింది.

4.సృష్టి రహస్యం ఇక్కడే చెప్పాడు

4.సృష్టి రహస్యం ఇక్కడే చెప్పాడు

Image Source:

శివుడు పార్వతి దేవికి సృష్టి రహస్యం చెప్పిన ప్రాంతం అమర్నాథ్ గుహ అని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఆ రహస్యం ఎవరూ వినకూడదని పరమశివుడు పలు జాగ్రత్తలు తీసుకొన్నాడు. ముఖ్యంగా తన తల పై ఉన్న చంద్రుడిని చందన పర్వతంలో, నందిని పెహల్కాలో, గణపతిని గణేష్ పర్వతం వద్ద కంఠాభరణమైన నాగుపామును శేష్ నాగ పర్వతం వద్ద వదిలి పెట్టి తన భార్య అయిన పార్వతి దేవితో సహా ఈ గుహలోకి వెలుతాడు.

5. రెండు పావురాలు మాత్రం

5. రెండు పావురాలు మాత్రం

Image Source:

ఇక తమ సంభాషణను ఎవరూ వినడం లేదని భావించిన పరమేశ్వరుడు పార్వతి దేవికి సృష్టి రహస్యం చెబుతాడు. అయితే అక్కడ ఉన్న రెండు పావురాలు ఆ రహస్యం విని అమరత్వాన్ని పొందుతాయి. ఆ పక్షులను ఇప్పటికీ అమర్నాథ్ గుహలోకి వెళ్ిన యాత్రికులు చూడవచ్చు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+