Search
  • Follow NativePlanet
Share
» » ముతైదువుల పసుపు కుంకుమలను కాపాడే శ్రావణ లక్ష్మీ ఇక్కడే

ముతైదువుల పసుపు కుంకుమలను కాపాడే శ్రావణ లక్ష్మీ ఇక్కడే

భారత దేశంలో అత్యంత ముఖ్యమైన లక్ష్మీ దేవి దేవాలయాల గురించి కథనం.

హిందువులు ఆరాధించే ముఖ్యమై దేవతల్లో మహాలక్ష్మి కూడా ఒకరు. లక్ష్మీ దేవిని కొలిస్తే ఐశ్వర్యాన్ని వద్ధి చేస్తుందని భక్తులు అనాదిగా నమ్ముతున్నారు. భారత దేశంలో మహాలక్ష్మి దేవాలయాలు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. దక్షిణ భారత దేశంలో శ్రావణ శుక్రవారం రోజున మహాలక్ష్మీ పూజను ఘనంగా జరుపుకొంటారు.ఈ శ్రావణ శుక్రవారం రోజున ప్రతి ముత్తైదువూ మహాలక్ష్మీ పూజ చేస్తుంది. తద్వార తమ పసుపు కుంకుమలు చల్లగా ఉంటాయని వారు భావిస్తారు.

ఇక ఉత్తర భారత దేశంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో లక్ష్మీ దేవి దీపావళి సమయంలో తమ ఇళ్లలోకి వస్తుందని భావిస్తారు. అందుకు అనుగుణంగా ఇంటిని శుభ్రం చేసి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ నేపథ్యంలో భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన లక్ష్మీ దేవి దేవాలయాలకు సంబంధించిన కథనం.

లక్ష్మీ నారాయణ దేవాలయం, ఢిల్లీ

లక్ష్మీ నారాయణ దేవాలయం, ఢిల్లీ

P.C: You Tube

దీనినే బిర్లా టెంపుల్ అని కూడా అంటారు. ఈ దేవాలయాన్ని ప్రముఖ పారిశ్రామిక కుటుంబం బిర్లా క్రీస్తు శకం 1939లో నిర్మించారు. ఈ దేవాలయంలో ప్రధాన దైవం లక్ష్మీతో పాటు విష్ణువు. ఈ దేవాలయాన్ని మహాత్మాగాంధీ ప్రారంభించారు. ఢిల్లీలో ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఇది కూడా ఒకటి. ఈ దేవాలయాన్ని శ్రావణ శుక్రవారంతో పాటు దిపావళి, క్రిష్ణాష్టమి రోజున ఎక్కువ మంది సందర్శిస్తుంటారు.

గోల్డన్ టెంపుల్, వెల్లూరు

గోల్డన్ టెంపుల్, వెల్లూరు

P.C: You Tube

తమిళనాడులోని వెల్లూరులో ఉన్న గోల్డన్ టెంపుల్ ను శ్రీపురం లక్ష్మీ దేవి దేవాలయం అంటారు. ఇది భారత దేశంలోనే అత్యంత విశిష్టమైన పుణ్యక్షేత్రం. ఈ దేవాలయం మొత్తం బంగారం రేకులతో తాపడం చేయబడింది. ఈ దేవాలయం నక్షత్రాకారంలో ఉంటుంది. ఈ దేవాలయాన్ని ఆకాశం నుంచి చూస్తే శ్రీ చక్రం ఆకారంలో కనిపిస్తుంది.

కొల్హాపూర్ మహాలక్ష్మీ దేవాలయం

కొల్హాపూర్ మహాలక్ష్మీ దేవాలయం

P.C: You Tube

మహారాష్ట్రలోని కొల్హాపూర్ మహాలక్ష్మీ దేవాలయం పురాణ ప్రాధాన్యత కలిగిన దేవాలయం. ఇది శక్తిపీఠాల్లో ఒకటి. ఇక్కడ విష్ణువుతో పాటు మహాలక్ష్మీ నిత్యం కొలువై ఉంటుందని భక్తులు ఎన్నో ఏళ్లుగా నమ్ముతున్నారు. ఈ దేవాలయాన్ని మొదట చాళుక్యులు నిర్మించినట్లు చెబుతారు.

అష్ట లక్ష్మీ దేవాలయం, చెన్నై

అష్ట లక్ష్మీ దేవాలయం, చెన్నై

P.C: You Tube

తమిళనాడు రాజధాని చెన్నైలోని అష్ట మహాలక్ష్మీ దేవాలయంలో మహాలక్ష్మీ ఎనిమిది రూపాల్లో ఒకే చోట దర్శనమిస్తుంది. అందువల్లే ఈ అష్టలక్ష్మీ దేవాలయ దర్శనానికి నిత్యం భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. ఈ దేవాలయం ఎలియోట్ బీచ్ కు సమీపంలో ఉంటుంది. ఇక్కడ విష్ణువు విగ్రహం కూడా ఉంటుంది. ఈ దేవాలయాన్ని సందర్శించడం వల్ల విజయం, ధైర్యం, ఐశ్వర్యం తదితరాలు సమకూరుతాయని భక్తులు నమ్ముతారు.

లక్ష్మీ దేవి దేవాలయం, హాసన్

లక్ష్మీ దేవి దేవాలయం, హాసన్

P.C: You Tube

కర్నాటకలోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక, ధార్మిక పట్టణమైన హాసన్ లోని లక్ష్మీ దేవాలయం చాలా పురాతనమైనది. ఈ దేవాలయాన్ని హొయసులు మొదట నిర్మించారని చెబుతారు. ఈ దేవాలయ ప్రాంగణంలో శివుడు, పార్వతి, విష్ణువు తదితర దేవుళ్లకు ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఈ దేవాలయంలోని శిల్పాలు భారతీయ శిల్పకళకు అద్దం పడుతాయి.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+