Search
  • Follow NativePlanet
Share
» »మంగుళూరు దేవాలయాల పర్యటన !

మంగుళూరు దేవాలయాల పర్యటన !

మంగళూరు కనుక ఒక వ్యక్తి అయితే, పిచ్చి పట్టినట్లు వ్యవహరించేది. అద్భుతమైన ఈ కోస్తా తీర పట్టణం వెనుక ఎన్నో వింతలు విడ్డూరాలు. గంభీరత, దైవ భీతి, వినోదం, ఆనందం, ఆహ్లాదం ఎన్నో భావనలు కలిగిస్తుంది. బీచ్ లు, చర్చి లు, దేవాలయాలు మొదలైనవాటితో ప్రతి ఒక్కరూ వారికి కావలసిన రీతిలో వినోదం, ఆనందం పొందవచ్చు. మంగళూరు సిటీ లిమిట్స్ లో క కొన్ని టెంపుల్స్ మా నేటివ్ ప్లానెట్ మీకు అందిస్తోంది. మీ ట్రావెల్ ప్రోగ్రాం లో ఈ టెంపుల్స్ తప్పక చూసి, ఆ టెంపుల్ దైవాల ఆశీస్సులు పొంది ఆనందించండి.

మంగళా దేవి టెంపుల్

మంగళా దేవి టెంపుల్

మంగళ దేవి టెంపుల్ ఒక హిందువుల టెంపుల్ కాగా ఇది సిటీ కి నైరుతి దిశలో, సెంట్రల్ రైల్వే స్టేషన్ కు మూడు కి. మీ. ల దూరం లో కలదు. మంగళూరు నగరపు పేరు ఈ దేవత పేరుతో వచ్చింది. ఈ దేవతను కన్య పిల్లలు పూజిస్తే, మంచి వరుడు భర్తగా లభిస్తాడని ప్రతీతి. టెంపుల్ కు వెళ్లేందుకు బస్సు లు, ఆటో రిక్షాలు కలవు.

కద్రి మంజునాథ

కద్రి మంజునాథ

కద్రి మంజునాథ స్వామీ టెంపుల్ సిటీ లిమిట్స్ లో కలదు. ఇది 9 వ శతాబ్దం నాటిది. టెంపుల్ నిర్మాణంలో బౌద్ధ, హిందూ అంశాలు గోచరిస్తాయి. శాసనాల మేరకు ఈ టెంపుల్ పడవ శతాబ్దం వరకు బౌద్ధుల ఆధీనంలో వుంది. బౌద్ధ మతం ప్రభావం తగ్గటంతో అది హిందువుల ఆధీనంలోకి వచ్చి మంజునాథ టెంపుల్ అయ్యింది.

గోకర్నతేస్వర టెంపుల్

గోకర్నతేస్వర టెంపుల్

గోకర్నతేస్వర టెంపుల్ సిటీ రైల్వే స్టేషన్ కు మూడు కి. మీ. ల దూరంలో కలదు. దీనినే కుదరాలి శ్రీ గోకర్నాత క్షేత్ర అని కూడా పిలుస్తారు. ఇది శివ భగవానుడి ఆలయం. ఇతర టెంపుల్స్ తో పోలిస్తే ఇది ఒక 20 వ శతాబ్దపు ఆధునిక టెంపుల్. ఈ టెంపుల్ లో నవగ్రహాల గుడి కూడా కలదు.

.శ్రీ దుర్గ పరమేశ్వరి టెంపుల్

.శ్రీ దుర్గ పరమేశ్వరి టెంపుల్

శ్రీ దుర్గ పరమేశ్వరి టెంపుల్ సిటీ కి కొంచెం దూరంగా వుంటుంది. ఈ దేవాలయం కటీల్ అనబడే పట్టణంలో కలదు. ఇది మంగళూరు కు 29 కి. మీ. లు. దేవాలయం ను కతీల్ దుర్గ పరమేశ్వరి టెంపుల్ అని కూడా పిలుస్తారు. పవిత్రమైన ఈ దేవాలయం నందిని నది ఒడ్డున కలదు. దేవాలయం చుట్టుపక్కల ఎన్నో ప్రకృతి దృశ్యాలు కలవు. భక్తి పై ఆసక్తి లేని వారు కూడా ఈ ప్రదేశ అందాలు సందర్శించి ముగ్దులవుతారు. ప్రతి రోజూ కతీల్ దేవాలయాన్ని వేలాది భక్తులు సందర్శించి మాత దుర్గ పరమేశ్వరి ఆశీస్సులు పొందుతారు.

శ్రీ శరవు మహాగణపతి టెంపుల్

శ్రీ శరవు మహాగణపతి టెంపుల్

శ్రీ శరవు మహాగణపతి టెంపుల్ రైల్వే స్టేషన్ కు ఒక కి. మీ. దూరంలో కలదు. ఈ దేవాలయాన్ని రాజు వీర బాహు ఆ ప్రదేశంలో తాను ఒక ఆవు ను చంపినందుకు పాప పరిహారంగా కట్టించాడని చెపుతారు. ఈ టెంపుల్ లో లార్డ్ గణేశ ప్రధాన దైవం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X