Search
  • Follow NativePlanet
Share
» »వింటర్ ట్రావెల్ డెస్టినేషన్ జాబితాలో కుర్సియోంగ్‌ను చేర్చండి...

వింటర్ ట్రావెల్ డెస్టినేషన్ జాబితాలో కుర్సియోంగ్‌ను చేర్చండి...

వింటర్ ట్రావెల్ డెస్టినేషన్ జాబితాలో పశ్చిమ బెంగాల్‌లోని కుర్సియోంగ్ హిల్ స్టేషన్‌ను చేర్చండి. ఎందుకంటే ఈ ప్ర‌దేశం ఈ సీజ‌న్‌లో సంద‌ర్శించేందుకు ఎంతో ఉత్త‌మ‌మైన‌ది. ఇక్కడి వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది. కుర్సియోంగ్‌కు రావ‌డం అంటే ప్ర‌కృతి అందాల‌ను ప్ర‌త్య‌క్షంగా చూడ‌డ‌మే. డిసెంబర్ చాలా ప్రదేశాలలో క్రిస్మస్, న్యూ ఇయర్ సుదీర్ఘ సెలవులు ఉంటాయి. ఈ నెల ప్ర‌యాణానికి ఎంతో ఉత్త‌మ‌మైన సమ‌యం. పశ్చిమ బెంగాల్‌లోని కుర్సోంగ్ ఈ సీజ‌న్‌లో సంద‌ర్శించేందుకు ఉత్త‌మ‌మైన ప్ర‌దేశం. దీనిని "ల్యాండ్ ఆఫ్ వైట్ ఆర్కిడ్స్" అని కూడా పిలుస్తారు. ఈ ప్ర‌దేశం సిలిగురి-డార్జిలింగ్ జాతీయ రహదారిపై ఉంటుంది. ఈ ప్రాంతం టీ తోటలు, ప్రకృతి సౌందర్యం, జలపాతాలు, మ్యూజియమ్‌లు దేవాలయాలకు ఎంత‌గానో ప్రసిద్ధి చెందింది.

dowhillkurseong

కుర్సియోంగ్ టీ గార్డెన్స్...

కుర్సియోంగ్ హిల్స్ స్టేషన్ టీ తోటలకు ఎంత‌గానో ప్రసిద్ధి చెందింది. ఇక్క‌డి తేయాకు తోటల అందాలు ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటాయి. ఇక్క‌డి అందాల‌ను మీ కెమెరాల్లో బందించొచ్చు. "మకాబిరి లేదా అంబోటియా" ఇక్కడ రెండు అద్భుతమైన తేయాకు తోటలు. పచ్చని తేయాకు తోటలు వాటి నుండి వచ్చే సువాసనతో కూడిన తేయాకు ఎంత‌గానో ప్ర‌సిద్ధిచెందింది. ఇక్కడ టీ తయారీ ప్రక్రియ, చరిత్రను కూడా తెలుసుకోవ‌చ్చు.

డౌ హిల్ కుర్సియోంగ్

కుర్సియోంగ్ హిల్ స్టేషన్‌ల‌లో విస్తరించి ఉన్న కొండలలో డౌ హిల్ ఒక‌టి. ఈ ప్ర‌దేశం అందంతో పాటు అనేక ఆకర్షణలతో నిండి ఉంటుంది. ఈ కొండలో ఎక్కువ భాగం అడవులతో చుట్టుముట్టబడి ఉంటుంది. ప్రకృతి అందాలను ఆరాధించడంతో పాటు అనేక రకాల అడవి జంతువులను కూడా ఇక్కడ చూడొచ్చు.

హిమాలయన్ రైల్వే మ్యూజియం

డార్జిలింగ్‌లో కేవ‌లం హిమాలయన్ రైల్వే మాత్రమే ప్ర‌సిద్ధిచెందింది కాదు. ఇక్క‌డి మ్యూజియం కూడా చాలా అద్భుతమైనది. ఇక్క‌డికి వ‌చ్చే ప‌ర్యాట‌కులు త‌ప్ప‌కుండా ఈ అనుభూతిని పొందాల్సిందే. ఈ మ్యూజియంలో, అరుదైన ఛాయాచిత్రాలు, పాత రైళ్ల స్కెచ్‌లతో పాటు వాటి నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్క‌డ ఉంటాయి. పర్యాటకులను ఆకర్షిస్తున్న ఈ మ్యూజియంలో మరో ప్రత్యేక‌మైన విష‌యం ఏమిటంటే, సమీపంలోని ప్రదేశాలను సందర్శించేందుకు టాయ్ ట్రైన్ రైడ్ కూడా అందుబాటులో ఉంటుంది. టాయ్ రైలు ప్రయాణం ఎంతో సరదాగా ఉంటుంది.

alpaigurirailwaystation

ఫారెస్ట్ మ్యూజియం

ఫారెస్ట్ మ్యూజియం కూడా కుర్సియోంగ్‌లో సందర్శించడానికి ఎంతో ఉత్త‌మమైన ప్ర‌దేశం. ప్రకృతి ప్రేమికుల‌కు ఉత్త‌మ‌మైన గ‌మ్య‌స్థానమిది. ఇక్క‌డి అడవిలో వివిధ రకాల జంతువులను చూడటంతోపాటు, అంతరించిపోయిన జంతువుల గురించి తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. పిల్లలతో కలిసి కుర్సియోంగ్ సంద‌ర్శించొచ్చు.

ఉత్తమ సమయం

కుర్సియోంగ్ హిల్స్ స్టేషన్‌ని సందర్శించడానికి ఉత్తమ సమయం సెప్టెంబర్ నుండి డిసెంబర్ మరియు మార్చి నుండి జూన్ వరకు. వ‌ర్ష‌కాలంలో త‌ప్ప ఎప్పుడైనా ఈ ప్ర‌దేశాన్ని సంద‌ర్శించొచ్చు. సాధారణంగా ఇక్కడ ఉష్ణోగ్రత 10 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ మాత్రమే ఉంటుంది.

darjeeelingteaestate

చేరుకోవడం ఎలా?

రైలు మార్గం ద్వారా కుర్సియోంగ్ చేరుకోవాల‌నుకుంటే సమీప రైల్వే స్టేషన్ న్యూ జల్పైగురి రైల్వే స్టేషన్. ఇక్కడ నుండి ఈ హిల్ స్టేషన్ సుమారు 44 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ చాలా పెద్ద నగరాలకు అనుసంధానించబడి ఉంది. రైల్వే స్టేషన్ నుండి కుర్సియోంగ్‌కి బస్సు లేదా క్యాబ్‌లు అందుబాటులో ఉంటాయి.

విమాన మార్గం ద్వారా అయితే, కుర్సియోంగ్‌లో విమానాశ్ర‌యం లేదు. కాబట్టి దీని కోసం ముందుగా బాగ్డోగ్రా చేరుకోవాల్సి ఉంటుంది. అనంత‌రం ఇక్కడి నుంచి 41 కిలోమీట‌ర్లు ప్రయాణం చేస్తే ఈ హిల్ స్టేషన్ చేరుకోవచ్చు. విమానాశ్రయం నుండి ఈ ప్ర‌దేశాన్ని చేరుకునేందుకు క్యాబ్‌స‌ర్వీసులు, ఆటోలు అందుబాటులో ఉంటాయి.

రోడ్డు మార్గం ద్వారా అయితే కోల్‌కతా, ఖరగ్‌పూర్ వంటి నగరాల నుండి కుర్సియోంగ్‌కి బస్సులు నడుస్తాయి. కాబట్టి తక్కువ డబ్బుతోనే ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+