Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» డార్జీలింగ్

డార్జీలింగ్ పర్యాటకం – భారతదేశ టీ స్వర్గం!

28

బొమ్మ ట్రైను

యాత్రికులను ప్రకృతి అందాల నడుమ అత్యద్భుతంగా ఉండే పర్వత శ్రేణుల గుండా తీసుకువెళ్ళే సుప్రసిద్ధ డార్జీలింగ్ హిమాలయన్ రైల్వే అనే చిన్న రైలు సర్వీసును ఇప్పటికే హిందీ, ఆంగ్ల చిత్రాలు ప్రఖ్యాతం చేసాయి. భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ ఉత్తర భాగంలో ఉండే డార్జీలింగ్ పర్వత ప్రాంతం మంచుతో కప్పబడిన పర్వత శిఖరాలతో అలరారుతూ, దిగువ హిమాలయాలు లేదా మహాభారత శ్రేణులలో ఒక నిజమైన స్వర్గసీమగా వెలుగొందుతుంది. బ్రిటీషు కాలంనాటి నుండి ఒక యాత్రాస్థాలంగా తీర్చిదిద్దబడిన చిన్న పట్టణం డార్జీలింగ్, ఇక్కడి తేయాకు తోటలకు, నాణ్యతకు సుప్రసిద్ధమైనది. డార్జీలింగ్ నించి జరిగే ఎగుమతులలో తేయాకుదే ప్రధమ స్థానం అవడం, అందువల్ల ఆశ్చర్యం కలిగించదు.

 యుద్ధ స్మారకం

శాంతియుతమైన, సహజమైన ప్రకాశానికి విరుద్ధంగా నేడు, డార్జీలింగ్ నియంత్రణ కోసం యుద్ధ పోరాటాలతో గతం ఎగుడుదిగుడుగా ఉంది. నేటికీ, ఉత్తేజిత గూర్ఖాలాండ్ ఉద్యమానికి ఇప్పటికీ చెదురుమదురు హింసలు జరుగుతూనే ఉన్నాయి. మనోహరంగా మంచుతో కప్పబడిన శిఖరాలకు వ్యతిరేకంగా డార్జీలింగ్ యుద్ధ స్మారకాన్ని ఖచ్చితంగా సందర్శించాలి, ఇది ఫొటోగ్రాఫర్ల కలను నిజంచేస్తుంది.

డార్జీలింగ్ వద్ద ప్రకృతి

డార్జీలింగ్, సాల్, ఓక్ చెట్లను కలిగిఉన్న సమశీతోష్ణ అడవులు, ఎత్తైన శిఖరాలతో ప్రకృతి ప్రేమికులు ముందుకు వెళ్ళే ప్రదేశం. వాతావరణంలో మార్పు ఉన్నప్పటికీ, డార్జీలింగ్ లోని ఎక్కువ అడవులు డార్జీలింగ్ పర్యాటక విలువకు పచ్చదనాన్ని జోడిస్తాయి. ఈ పట్టణంలో పద్మజ నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్కు, ప్రకృతి ప్రేమికులు, ఫోటోగ్రాఫర్లు మధ్యాహ్న సమయాలు ప్రశాంతతను ఇచ్చే ల్లోయడ్స్ బొటనికల్ గార్డెన్ వంటి అనేక సహజ పార్కులు ఉన్నాయి. డార్జీలింగ్ లో కొన్ని తాజా పూలను కోయడంతో తమ ఆడ స్నేహితురాలు లేదా భాగస్వామితో విలాసం కోరుకునే వారికి అనేకరకాల ఎగుమతి స్థాయి పూలమొక్కలను కలిగి ఉంది.

వన్యప్రాణులు

వెస్ట్ బెంగాల్ అటవీ శాఖవారు ఈ ప్రాంతంలో వన్యప్రాణుల సంరక్షణ బాధ్యత వహిస్తారు. ఒకకొమ్ము ఖడ్గమృగాలు, ఏనుగులు, భారతీయ పులి, చిరుత, మచ్చల జింక వంటివి ఈ ప్రాంతంలో కనిపించే కొన్ని సాధారణ జాతులు. డార్జీలింగ్ కొన్ని అందమైన వలస పక్షులతో పక్షి ప్రేమికులకు ఒక అందమైన ప్రదేశం.

ఈ ప్రాంతంలోనూ, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు

ఎక్కువ సాంప్రదాయ, స్థానిక షాపింగ్ జరిగే మాల్ రోడ్డు, మీరు బేరం చేస్తే మంచి కొనుగోలును చేయవచ్చు. సరదాను ఇష్టపడి, స్నేహపూర్వకంగా ఉండే స్థానికులు దుర్గా పూజ, దీవాలి, కాళి పూజ వంటి అనేక భారతీయ పండుగలను జరుపుకుంటారు. ఇవేకాకుండా; అనేక స్థానిక పండుగలను కూడా జరుపుకుంటారు. మీరు డార్జీలింగ్ వెళ్ళినపుడు, మూలల చుట్టుపక్కల జరిగే చిన్న పండుగల గురించి చెప్పనవసరం లేదు. బౌద్ధ ఆరామాలు స్థానిక సంస్కృతి గురించి నేర్చుకోవడానికి మంచి ప్రదేశాలు, సన్యాసులు సాధరణంగా ఈ ఆలయాల చుట్టూ పర్యాటకులకు దర్శనమిస్తారు.

ఆహారం

స్థానిక వంటలు గుర్తింపు పొందిన మోమోలు (కుడుములు) తో జాబితాలో ప్రధమ స్థానం కోసం ప్రయత్నం చేస్తున్నాయి. చికెన్, గొడ్డుమాంసం, కూరగాయలు, పందిమాంసం తో చేసే ఈ కుడుములను వేడి సాస్ తో అందిస్తారు. నూడుల్ ఆధారిత సూపులు, కొన్ని స్పైసీ రైస్ తోచేసేవి అనేకరకాల ఇతర వీధి ఆహారాలు.

బ్రిటీషు కాలంనాటి నిర్మాణ శైలి

డార్జీలింగ్ బ్రిటీషు కాలంనాటి నిర్మాణ శైలితో చిత్రించబడింది, ఈ నగరం బ్రిటీషు రాజ్ సమయంలో చాలా బాగా నిర్వహించబడింది. భావనలు ఎక్కువగా సంరక్షించబడిన ఈ పట్టణం ఇప్పటికీ బ్రిటీషు రాజుల అవశేషాలను కలిగి ఉంది. పోస్ట్ కార్డ్ జ్ఞాపకాలు, అందమైన చిత్రాల కోసం గోతిక్ శైలి చర్చ్ లు తయారుచేయబడ్డాయి.

డార్జీలింగ్ లోని ప్రజలు దీనిని సందర్శనకు విలువైన పట్టణంగా తయారుచేసారు. సరదాని ఇష్టపడే వీరు వాయిద్య సాధనాలను ప్లే చేస్తారు. సంగీత ప్రియులు వివిధ చిన్న వీధి క్లబ్బుల గురించి రాసి, బ్లాగ్ చేస్తారు, స్థానికులు సంగీతం వారి సంస్కృతిలో మిళితం చేసుకుని ఈ మార్గంలో తమనుతాము గొప్పగా భావిస్తారు.

డార్జీలింగ్ యాత్రీకులకు, అలాగే కుటుంబాలకు, దగ్గరలో ఉన్న అనేక చిన్న పట్టణాలకు ఖచ్చితమైన గమ్యస్థానంగా హామీ ఇస్తుంది. ఇది వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతంలోని ఇతర పట్టణాలను సందర్శించడానికి ఒక ప్రత్యేక మూల స్థానం.

డార్జీలింగ్ లోను, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు

డార్జీలింగ్ పర్యాటకం సందర్శకులకు అనేకం అందిస్తుంది. ఇక్కడ హ్యాపీ వాలీ టీ ఎస్టేట్, ల్లోయడ్స్ బొటనికల్ గార్డెన్, డార్జీలింగ్ హిమాలయన్ రైల్వే, బతసియా లూప్, యుద్ధ స్మారకం, కేబుల్ కార్, భూటియ బస్తి గొంప, హిమాలయ పర్వతారోహణ సంస్థ, మ్యూజియం వంటి అనేక ఆకర్షణలను కలిగి ఉంది.

డార్జీలింగ్ వాతావరణం

వేసవి, వర్షాకాలం, శీతాకాలం అనే మూడుకాలాలుగా విభజించబడిన డార్జీలింగ్ వాతావరణం, వేసవి మధ్యస్తంగా, శీతాకాలం చాలా చల్లగా ఉంటుంది.

డార్జీలింగ్ చేరుకోవడం ఎలా

డార్జీలింగ్, ప్రసిద్ధ ప్రదేశమైన పశ్చిమ బెంగాల్ లోని ప్రధాన ప్రాంతాలకు బాగా అనుసంధానించబడి ఉంది, అనువల్ల సందర్శకులు అక్కడికి చేరుకోవడం చాలా తేలిక.

డార్జీలింగ్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

డార్జీలింగ్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం డార్జీలింగ్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? డార్జీలింగ్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుద్వారా డార్జీలింగ్, 55 వ జాతీయ రహదారిని అనుసరించే 31వ జాతీయ రహదారి గుండా అందుబాటులో ఉంది, ఇది సిలిగురి, కాలింపోంగ్ కి దగ్గరగా ఉంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుద్వారా డార్జీలింగ్, డార్జీలింగ్ రైల్వే స్టేషన్ ద్వారా సేవలందిస్తుంది, సిలిగురి కి సమీపంలోని అతిపెద్ద జల్పైగురి గమ్యస్థానం దేశంలోని, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలతో అనుసంధానించబడి ఉంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా సిలిగురి అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశంలోని అనేక నగరాలూ, కొన్ని అంతర్జాతీయ ప్రదేశాలకు డార్జీలింగ్ ని కలుపుతూ సేవలందిస్తుంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat