Search
  • Follow NativePlanet
Share
» »అద్భుత దృశ్యాల ఆల్మోరా - చూడవలసిన ప్రదేశాలు !

అద్భుత దృశ్యాల ఆల్మోరా - చూడవలసిన ప్రదేశాలు !

అల్మోర ఒక ప్రసిద్ధ హిల్ స్టేషన్. ఈ హిల్ స్టేషన్ ఉత్తరాఖండ్ లోని కుమావొన్ ప్రాంతంలో కలదు. అల్మోర హిల్స్ నుండి పర్యాటకులు హిమాలయ పర్వతాల అందాలను ఆస్వాదించవచ్చు.

ఇక్కడ కల బ్రైట్ ఎండ్ కార్నర్ నుండి పర్యాటకులు సూర్యోదయ , సూర్యాస్త మయ దృశ్యాలు చూసి ఆనందించవచ్చు. తరచు ఈ ప్రాంతంలో విహారం కోరే వారికి సిమ్తోలా మరియు మర్తోలా లు సరైన ప్రదేశాలు.

ఇక్కడ కల డీర్ పార్క్ లో లేడి, చిరుత, మరియు హిమాలయ నల్ల ఎలుగు వంటి జంతువులు చూడవచ్చు. ఈ ప్రదేశంలో గోవింద్ వల్లభ పంత్ పబ్లిక్ మ్యూజియం మరియు బిన్సార్ వైల్డ్ లైఫ్ సాన్క్చురి లు ఇతర ఆకర్షణలు. ట్రెక్కింగ్ మరియు మౌంటెన్ బైకింగ్ ఇక్కడ ప్రసిద్ధ క్రీడలు

అల్మోర హోటల్ వసతులకు క్లిక్ చేయండి

ఎలా చేరాలి ?

ఎలా చేరాలి ?

అల్మోర కు సమీప రైల్వే స్టేషన్ కాత్గోదాం లో కలదు. ఇక్కడ నుండి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు రైళ్ళు కలవు. రైలు స్టేషన్ నుండి అల్మోర హిల్ స్టేషన్ కు షేర్ టాక్సీ లలో చేరవచ్చు. తేలికగా చేరాలంటే ఢిల్లీ నుండి విమాన ప్రయాణంలో చేరవచ్చు. ఇక్కడకు బస్సు లలో కూడా ప్రయాణించవచ్చు.

Photo Courtesy: Travelling Slacker

బిన్సార్

బిన్సార్

బిన్సార్ ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఇది అల్మోర జిల్లాలో కలదు. దీనికి ఈ పేరు హిందువుల దేవుడు అయిన శివుడికి గల మరొక పేరు బిన్సార్ దేవ్ అనే ద్వారా వచ్చింది. ఈ ప్రదేశం నేపధ్యంలో హిమాలయ పర్వత శ్రేణులు కలిగి వుంటుంది. అల్మోర లో ఇదొక హిల్ స్టేషన్. ఇక్కడ నుండి మీరు హిమాలయ శిఖరాలైన, కేదార్నాథ్, శివ లింగం, త్రిశూల్, నందా దేవి మొదలైన శిఖరాలు చూడవచ్చు.
Photo Courtesy: sporadic

బిన్సార్ వైల్డ్ లైఫ్ సాన్క్చురి

బిన్సార్ వైల్డ్ లైఫ్ సాన్క్చురి

బిన్సార్ వైల్డ్ లైఫ్ సంక్చురి ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఇది చిరుత, లేడి, జంగలే కేట్ బ్లాకు బేర్, నక్క, లంగూర్ , కోతి, ముళ్ళపంది వంటి జంతువులకు సహజ నివాసం. ఈ సంక్చురి ని ఒక ప్రధాన పక్షి ప్రదేశం గా బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ ప్రకటించింది. ఇక్కడ సుమ్మారు 200 కు పైగా పక్షి జాతులు సంచరిస్తున్నాయని చెపుతారు. ప్రకృతి ప్రియులకు, వన్య జంతువుల ప్రియులకు ఇది ఒక చక్కని ప్రదేశం.
Photo Courtesy: Mathias

బ్రైట్ ఎండ్ కార్నర్

బ్రైట్ ఎండ్ కార్నర్

మంచుతో కప్పబడిన శిఖరాల వెనుక అస్తమించే మరియు ఉదయించే సూర్య కిరణాల దృశ్యం చూసేందుకు బ్రైట్ ఎండ్ కార్నర్ ఒక చక్కని పర్యాటక ప్రదేశంగా పేరు కెక్కింది. ఈ ప్రదేశంలో తమ ప్రియమైన వారితో కలసి పౌర్ణమి రాత్రులు కూడా గడపవచ్చు. ఇక్కడ కల సూర్యోదయ, సూర్యాస్తమయాలు, పౌర్ణమి రాత్రులు జీవితంలో మరువలేని అనుభవాలుగా ఉంటాయి.
Photo Courtesy: Travelling Slacker

చితాయ్ టెంపుల్

చితాయ్ టెంపుల్

చితాయ్ టెంపుల్ ఒక పవిత్ర ప్రదేశం. ఇక్కడ కుమావొన్ ప్రాంత పౌరాణిక దేవత గోలు దేవత విగ్రహం వుంటుంది. ఇది హిందూ వుఅల ఆరాధ్య దైవం శివుడి అవతారమని చెపుతారు. ఈ తెంప్లె దట్టమైన అడవుల మధ్య ఒక కొండపై కలదు.
Photo Courtesy: Abhineet Khorana

డీర్ పార్క్

డీర్ పార్క్

అల్మోర లో కల డీర్ పార్క్ పర్యాటకులకు మరొక అద్భుత ఆకర్షణ. ఈ ప్రదేశం అంతా పచ్చటి పైన్ వృక్షాలతో నిండి వుంటుంది. వివిధ రకాల వృక్ష జాతులకు ఇది ఒక సహజ నివాసంగా కలదు. టూరిస్ట్ లు ఇక్కడ లేడి, చిరుత, హిమాలయ నల్ల ఎలుగు వంటివి చూడవచ్చు.
Photo Courtesy: Tambako The Jaguar

లాల్ బజార్

లాల్ బజార్

లాల్ బజార్ ఎల్లపుడూ బిజీ గా వుండే ఒక పర్యాటక కేంద్రం. విజిటర్ లు ఇక్కడ అతి రుచికర స్వీట్ లు , అందమైన ఇత్తడి మరియు బ్రాంజ్
వస్తువులు కొనుగోలు చేయవచ్చు. ధరలు సరసంగా వుంటాయి. ఇక్కడి షాపింగ్ లో కుందేలు ఊలు తో చేసిన దుస్తులు ఒక గొప్ప ఆకర్షణ.
Photo Courtesy: rajkumar1220

నందా దేవి

నందా దేవి

అల్మోర లో కల నందా దేవి ఒక ప్రసిద్ధ మత పర ప్రదేశం. ఇది ఒక ప్రసిద్ధ , ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశంగాను, పవిత్ర ప్రదేశంగాను కుమావొనీ ప్రాంతంలో పరిగనించ బడుతోంది. ఇక్కడ నందా దేవి టెంపుల్ ప్రసిద్ధి. ఈ క్షేత్రంలో చుట్టూ చెక్క కలిగి అలంకరించబడిన రాతి అమలక అనబడే కిరీటం ఒక ప్రత్యేక ఆకర్షణ.
Photo Courtesy: Michael Scalet

మరిన్ని అల్మోర ఆకర్షణలకు క్లిక్ చేయండి

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+