Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» రాం ఘర్

రాం ఘర్ - 'కుమావొన్ యొక్క పండ్ల గిన్నె' !

14

రామ్ ఘర్ ఒక అందమైన హిల్ స్టేషన్. ఇది ఉత్తరాఖండ్ లోని నైనిటాల్ జిల్లాలో కలదు. ఈ ప్రదేశం రెండు భాగాలుగా విభజించబడినది. ఒకటి 'మల్ల' అనబడే ఎత్తైన ప్రదేశం కాగా రెండవది'తల్ల'అనబడే కొండ కింద ప్రదేశం. ఈ ప్రదేశం సుమారు 1400 మీ. ల నుండి 1900 మీ. ల ఎత్తు వరకూ వుంటుంది. ఈ ప్రదేశాన్ని 'కుమావొన్ యొక్క పండ్ల గిన్నె' అని కూడా అంటారు. ఇక్కడ కల పచ్చటి పీచెస్, అప్రికట్స్ , పియర్స్ మరియు ఆపిల్ తోటల కారణంగా దీనికి ఈ పేరు వచ్చింది.

నగర బిజి, బిజీ జీవితాల నుండి తప్పించుకుందామనే వారికి ఈ ప్రదేశం బాగా నచ్చుతుంది. మంత్ర ముగ్ధులను చేసే మంచుతో కప్పబడిన హిమాలయాలు మరియు ప్రశాంత వాతావరణం ఈ ప్రదేశాన్ని ఒక చక్కటి సెలవుల విశ్రాంతి ప్రదేశంగా చేసాయి. బ్రిటిష్ వారు ఇక్కడ అధిక సమయం గడిపేవారు. దాని అందాలకు ముగ్ధులైన చాలామంది మన దేశపు గొప్ప వ్యక్తులు రవీంద్ర నాథ్ టాగోర్ , నారాయణ స్వామీ వంటి వారు వారి ఆశ్రమాలను ఇక్కడ స్థాపించారు.

పర్యాటకులు ఇక్కడ కల ప్రఖ్యాత రచయిత మహాదేవి వర్మ యొక్క లైబ్రరీ ని కూడా చూడవచ్చు. ఈ లైబ్రరీ ఆమెను 'లచ్చమ' అనే కధను వ్రాయుటకు ప్రోత్సహించినది. ఇక్కడ అనేక టూరిస్ట్ ఆకర్షణలు కలవు. వాటిలో అరబిందో ఆశ్రమం ప్రసిద్ధమైనది. ఈ ఆశ్రమం సందర్శకులకు యోగ మరియు ధ్యానం వంటివి నేర్పిస్తుంది.

సమయం దొరికితే, పర్యాటకులు ఇక్కడ కల కుమావొన్ మండల వికాస్ నిగం వారి రెస్ట్ హౌస్, శ్రీ నారాయణ్ స్వామీ ఆశ్రమం, మరియు గిరిజా దేవి టెంపుల్ వంటివి తప్పక చూడాలి. ఇక్కడే మరొక ప్రసిద్ధ ఆకర్షణ రాం ఘర్ నుండి సుమారు 25 కి. మీ. ల దూరంలో కల ముక్తేస్వర్ కూడా చూడాలి. ఈ ప్రదేశంలో సుమారు 350 సంవత్సరాల కిందటి శివుడి టెంపుల్ ఒకటి కలదు.

ఇంతే కాక, పర్యాటకులు ఇక్కడ కల ప్రశాంత వాతావరణం కల నతుఅఖాన్, అనే చిన్న గ్రామం దర్శించాలి. ఈ గ్రామం చుట్టూరా ఓక్, పైన్, బిర్చ్ మరియు కఫల్ చెట్లు కలవు. ఈ ప్రాంతం 12 చిన్న గ్రామాలుగా అంటే నవాడ, గవాన్, తల్లతండ, బగీచా, తపూక్, లామాఖాన్, మల్లతండ, కానాల, కఫల్దారి, ఝోప్రో, బనోలా, మరియు బున్గా అనే పేర్లు కలిగి వుంది. ఈ ప్రదేశంలో ఒక హెరిటేజ్ భవనం కలదు. దీనిని బాబ్ పాలస్ అంటారు, ఇది పర్యాటకులకు వసతి కల్పిస్తుంది.

రాక్ క్లైమ్బింగ్, రాప్పేల్లింగ్, మౌంటెన్ బైకింగ్ వంటి సాహస క్రీడలు రాం ఘర్ లో ఆచరించ వచ్చు. కోసి రివర్ లో మహాసీర్ ఫిషింగ్ చేసి ఆనందించవచ్చు.

అన్నిటికి మించి కోసి నది ఒడ్డున క్యాంపు చేయటంలో పర్యాటకులు అమితంగా ఆనందిస్తారు.

రాం ఘర్ కు సమీప ఎయిర్ పోర్ట్ అంటే పంత్ నగర్ ఎయిర్ పోర్ట్. ఈ ఎయిర్ పోర్ట్ న్యూ ఢిల్లీలోని ఇందిరా గాంధి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు తరచుగా విమానాలు కలిగి వుంది. కత్గోదాం రైలు స్టేషన్ రాం ఘర్ కు సమీప రైలు స్టేషన్. పర్యాటకులు ఈ స్టేషన్ నుండి రాం ఘర్ కు ప్రీ పైడ్ టాక్సీ లు పొందవచ్చు. నైనిటాల్ లేదా నుకుచిఅతాల్ ల నుండి బస్సులలో కూడా రాం గర్ చేరవచ్చు. రాం గర్ పర్యటనకు వేసవులు, వర్షాకాలాలు అనుకూలంగా వుంటాయి.

రాం ఘర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

రాం ఘర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం రాం ఘర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? రాం ఘర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్ ప్రయాణం సమీప పట్టణాల నుండి బస్సులు రాం ఘర్ కు కలవు. నైనిటాల్, నవ కుచిఅతల్ ప్రదేశాలనుండి చేరటం తేలిక. ఢిల్లీ నుండి కూడా ప్రభుత్వ మరియు ప్రైవేటు బస్సులు నడుస్తాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం కత్గోడం రైలు స్టేషన్ రాం ఘర్ కు సమీప రైలు స్టేషన్. ఇది సుమారు 50 కి.మీ.ల దూరం వుంటుంది. ఈ రైలు స్టేషన్ నుండి ఇండియా లోని అనేక నగరాలకు మరియు ఢిల్లీ కి రైళ్ళు కలవు. రైలు స్టేషన్ నుండి టాక్సీలు, కాబ్ లలో రాం ఘర్ చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం రాం ఘర్ కు పంత్ నగర్ ఎయిర్ పోర్ట్ దగ్గర. ఈ ఎయిర్ పోర్ట్ నుండి రెగ్యులర్ గా న్యూ ఢిల్లీ లోని ఇందిరా గాంధీ విమానాశ్రయానికి విమానాలు కలవు. పంత్ నగర్ ఎయిర్ పోర్ట్ నుండి పర్యాటకులు టాక్సీలలో రాం ఘర్ చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue