Search
  • Follow NativePlanet
Share
» »‘దక్షిణ భారత దేశ ఆజ్మీర్’ వెనుక ఉన్న రహస్యాలు మీ కోసం...

‘దక్షిణ భారత దేశ ఆజ్మీర్’ వెనుక ఉన్న రహస్యాలు మీ కోసం...

కడప పెద్ద దర్గాకు సంబంధించిన కథనం.

దక్షిణ భారత దేశ ఆజ్మీర్ గా పేరుగాంచిన దర్గా మత సామరస్యానికి ప్రతీక. ఇక్కడ సాహెబ్ ను నమ్ముకొని ప్రార్థించి విబూది తీర్థం సేవిస్తే సర్వ వ్యాధులు హరిస్తాయని భక్తులు నమ్ముతారు. ఈ దర్గాను ఎంతో మంది రాయకీయ, సినీ ప్రముఖులు నిత్యం సందర్శిస్తూ ఉంటారు. అటువంటి దర్గా పూర్తి వివరాలు మీ కోసం...

కడప, అమీన్ పీర్ పెద్ద దర్గా

కడప, అమీన్ పీర్ పెద్ద దర్గా

P.C: You Tube

ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ ప్రాతంలో ప్రముఖ పట్టణమైన కడపలో ఆస్తానయో ఇలాహి ఉంది. దీనినే పెద్ద దర్గా లేక అమీన్ పీర్ దర్గా అని అంటారు. ఇది దక్షిణ భారత దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన దర్గా కావడం గమనార్హం.

కడప, అమీన్ పీర్ పెద్ద దర్గా

కడప, అమీన్ పీర్ పెద్ద దర్గా

P.C: You Tube

అందువల్లే దీనిని దక్షిణ భారత దేశ ఆజ్మీర్ అని అంటారు. ఈ దర్గా నిర్మాణానికి మూలపురుషుడు హజరల్ ఖ్వాజా సయ్యద్ షా పీరుల్లా మహమ్మదుల్ హుసేనీ చిష్తీవుల్ ఖాద్రీనాయబ్-ఎ-రసూల్.

కడప, అమీన్ పీర్ పెద్ద దర్గా

కడప, అమీన్ పీర్ పెద్ద దర్గా

P.C: You Tube

ఈ మహ్మద్ ప్రవక్త వంశీయుడని చెబుతారు. కర్నాటకలోని బీదర్ నుంచి క్రీస్తుశకం 1683లో కడపకు వచ్చాడు. అక్కడే ప్రజలకు దైవ బోధన చేస్తూ కాలం గడిపాడు.

కడప, అమీన్ పీర్ పెద్ద దర్గా

కడప, అమీన్ పీర్ పెద్ద దర్గా

P.C: You Tube

ఈయన శిష్యుడు నేక్ నామ్ ఖాన్. ఆ సమయంలో కడపను పాలించేవాడు. నేక్ నామ్ ఖాతన్ తన గురువుకు జీవసమాధి నిర్మించిన స్థలమే ప్రస్తుతం పెద్ద దర్గా అని అంటాము.

కడప, అమీన్ పీర్ పెద్ద దర్గా

కడప, అమీన్ పీర్ పెద్ద దర్గా

P.C: You Tube

అటు పై క్రీస్తుశకం 1716లో అమీర్ పీర్ దర్గాలోనే హజరల్ ఖ్వాజా సయ్యద్ షా పీరుల్లా మహమ్మదుల్ హుసేనీ చిష్తీవుల్ ఖాద్రీనాయబ్-ఎ-రసూల్ జీవసమాధి అయ్యారు.

కడప, అమీన్ పీర్ పెద్ద దర్గా

కడప, అమీన్ పీర్ పెద్ద దర్గా

P.C: You Tube

ఈయన ఇద్దరి కుమారుల్లో పెద్ద కుమారుడైన ఆరీఫుల్లా హుసేనీ కడప పీఠాధిపతి కాగా, మరో కుమారుడైన అహ్మద్ హుసేనీ నందలూరు పీఠాధిపతిగా నియమితులయ్యారు.

కడప, అమీన్ పీర్ పెద్ద దర్గా

కడప, అమీన్ పీర్ పెద్ద దర్గా

P.C: You Tube

కడప పీఠాధిపతుల మరణం తర్వాత వారి పెద్ద కుమారుడు పీఠాధిపతిగా ఆ కాలం నుంచి ఇప్పటి వరకూ కొనసాగుతూ వస్తోంది. ఈ పరంపరలో ప్రస్తుతం 11వ పీఠాధిపతి కొనసాగుతున్నారు.

కడప, అమీన్ పీర్ పెద్ద దర్గా

కడప, అమీన్ పీర్ పెద్ద దర్గా

P.C: You Tube

ఇదిలా ఉండగా ఆరీఫుల్లా హుసేనీ వారసుడైన హజ్రత్ సూఫీ సర్మస్ సానీ చిల్లకష్ ఖ్వాజా సయ్యద్ షా ఆరీఫుల్లా మహ్మద్ మహ్మదుల్ హుసేనీ తన 11వ ఏట ఇంటి నుంచి వెళ్లిపోయి తాడిపత్రి సమీపంలోని గుహల్లో 50 ఏళ్లు తపస్సు చేశారు.

కడప, అమీన్ పీర్ పెద్ద దర్గా

కడప, అమీన్ పీర్ పెద్ద దర్గా

P.C: You Tube

అటు పై కడప సమీపంలోని గండి వాటర్ వర్క్స్ గుహల్లో 13 ఏళ్లు తపస్సు చేపట్టారు. ఆ సమయంలో నిత్యం ఒక మేక కొండల్లోకి వెళ్లి వస్తుండటం దాని కాపరి గమనించాడు.

కడప, అమీన్ పీర్ పెద్ద దర్గా

కడప, అమీన్ పీర్ పెద్ద దర్గా

P.C: You Tube

ఒకరోజు దానిని వెంబడించగా తపస్సులో నిమగ్నమై పెద్ద ఎత్తున జడలున్న వ్యక్తి కనిపించారు. అంతలోనే ఆయన ఈ విషయం బయట చెప్పవద్దని చెబతితే నీకు ముప్పు తప్పదని పేర్కొన్నాడు.

కడప, అమీన్ పీర్ పెద్ద దర్గా

కడప, అమీన్ పీర్ పెద్ద దర్గా

P.C: You Tube

దీంతో ఆ మేకల కాపరి ప్రతి రోజూ తన మేక గుహలోకి వచ్చి ఏమి చేస్తోందని ప్రశ్నించాడు. పక్కనే ఉన్న పెద్ద పామును చూపించి దీనికి పాలు ఇస్తున్నట్లు హజ్రత్ సూఫీ సర్మస్ సానీ చిల్లకష్ ఖ్వాజా సయ్యద్ షా ఆరీఫుల్లా మహ్మద్ మహ్మదుల్ హుసేనీ వివరించారు.

కడప, అమీన్ పీర్ పెద్ద దర్గా

కడప, అమీన్ పీర్ పెద్ద దర్గా

P.C: You Tube

ఈ మహత్తును గమనించిన మేకల కాపారి తన తల్లకి కళ్లు తెప్పించల్సిందిగా కోరుతాడు. దీంతో ఆ మేకల కాపరి పరుగు పరుగున ఇంటికి వెళ్లి తన తల్లిని ఆ స్వామి వద్దకు తీసుకువస్తాడు.

కడప, అమీన్ పీర్ పెద్ద దర్గా

కడప, అమీన్ పీర్ పెద్ద దర్గా

P.C: You Tube

మేక పాలతో కాపరి తల్లిని శుద్ధి చేయగానే ఆమెకు చూపువ వస్తుంది. ఇదిలా ఉండగా అదే ఏడు కడప దర్గాలో జరుగున్న ఉరుసు చూడటానికి ఆ తల్లి వస్తుంది. ఈ ఉత్సవంలో ఆ స్వామిని పోలికలతో ఉన్న ఓ మహిళ కనిపిస్తుంది.

కడప, అమీన్ పీర్ పెద్ద దర్గా

కడప, అమీన్ పీర్ పెద్ద దర్గా

P.C: You Tube

దీంతో ఆ తల్లి ఆమెకు కొండ గుహల్లో మీలాగే ఉన్న ఓ స్వామి తపస్సు చేస్తున్నాడని చెబుతుంది. దీంతో అందరూ అక్కడికి వెళ్లి చూడగా అక్కడ తన తమ్ముడే ఉన్నాడని కడప పీఠాధిపతి గుర్తిస్తారు.

కడప, అమీన్ పీర్ పెద్ద దర్గా

కడప, అమీన్ పీర్ పెద్ద దర్గా

P.C: You Tube

పెద్ద దర్గాకు రావాల్సిందిగా పీరుల్లా కోరగా 10 రోజుల తర్వాత వస్తానని చెబతుడు. పది రోజుల అనంతరం వస్తానని చెబుతాడు. ఆటు పై పదోరోజు ఊరేగింపుగా స్వామిని తీసుకువస్తారు. అదే సంప్రదాయం నేటికీ కొనసాగుతూ ఉంది.

కడప, అమీన్ పీర్ పెద్ద దర్గా

కడప, అమీన్ పీర్ పెద్ద దర్గా

P.C: You Tube

అమీన్ పీర్ దర్గాలో చిన్న, పెద్ద కలిపి మొత్తం 18 దర్గాలు ఉన్నాయి. ప్రతి నెల గంధం, ఉరుసు ఇక్కడ జరుగుతుంది. అరీఫుల్లా హుస్సేనీ ఉరుసు ఏడు రోజుల పాటు జరుగుతుంది.

కడప, అమీన్ పీర్ పెద్ద దర్గా

కడప, అమీన్ పీర్ పెద్ద దర్గా

P.C: You Tube

కుల, మత, ప్రాంతాలకు అతీంతగా లక్షల సంఖ్యలో ఇక్కడ జరిగే ఈ ఉరుసుకు భక్తులు హాజరవుతారు. ఉర్దూ మాసం మదార్ లో నిర్వహించే ఈ ఉరుసు ఉత్సవం కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతుంది.

కడప, అమీన్ పీర్ పెద్ద దర్గా

కడప, అమీన్ పీర్ పెద్ద దర్గా

P.C: You Tube

ఈ సందర్భంగా సాంస్క`తిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు. భక్తులకు సూఫీతత్వ ఉపదేశాలిస్తారు. ఉరుసు సందర్భంగా పెద్ద ఎత్తున ముషాయోరా (కవి సమ్మేళనం) జరుగుతుంది.

కడప, అమీన్ పీర్ పెద్ద దర్గా

కడప, అమీన్ పీర్ పెద్ద దర్గా

P.C: You Tube

ఈ పెద్ద దర్గాకు రెండు శాఖలు ఉన్నాయి. నందలూరులో ఒకటి, రెండోది చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండలం కలిచెర్ల గ్రామంలో మరొకటి ఉంది. ఈ దర్గా మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+