Search
  • Follow NativePlanet
Share
» »త‌క్కువ బ‌డ్జెట్‌తో లాంగ్ వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా.. అయితే దేశంలోని బెస్ట్ ప్లేస్‌లు ఇవే..

త‌క్కువ బ‌డ్జెట్‌తో లాంగ్ వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా.. అయితే దేశంలోని బెస్ట్ ప్లేస్‌లు ఇవే..

దీపావళి సమీపిస్తున్న కొద్దీ, చాలా మంది షాపింగ్ ఇత‌ర‌త్రా పనుల‌తో ఫుల్ బిజిగా ఉంటారు. మ‌రికొంద‌రైతే ఈ సెల‌వుల‌ను ఎలా స‌ద్విన‌యోగం చేసుకోవాల‌ని ఆలోచిస్తుంటారు. ఈస‌మ‌యంలో ఎలాంటి ప్రాంతాల‌ను సంద‌ర్శించాల‌ని ప్ర‌ణాళిక‌లు వేస్తుంటారు. దీపావళి ప్రయాణం చేయడానికి ఉత్తమ సమయం. ఎందుకంటే ఈ పండుగ సమయంలో అనేక ప్రదేశాలలో ఒకటి లేదా రెండు మూడు రోజులు సెలవులు ఉంటాయి.

కాబ‌ట్టి ఈ లాంగ్ వీకెండ్‌లో సంద‌ర్శించేందుకు దేశంలో ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. వాటిని కూడా త‌క్కువ బ‌డ్జెట్‌తోనే సంద‌ర్శించొచ్చు. మ‌రెందుకాల‌స్యం ఆ ప్ర‌దేశాలేంటో చూద్దాం ప‌దండి. దేశంలోని ఈ స్థలాలు అందంగా ఉండటమే కాకుండా మీ బ‌డ్జెట్‌కు స‌రిప‌డే విధంగా కూడా ఉంటాయి.

udaipur1

ఉదయపూర్

సరస్సుల నగరంగా ప్రసిద్ధి చెందిన ఉదయపూర్ దీపావళి సెల‌వుల్లో సందర్శించేందుకు మంచి ఎంపిక. ఢిల్లీ నుండి ఉదయపూర్‌కి నేరుగా బస్సులు అందుబాటులో ఉంటాయి. వీటి ధర కూడా చాలా త‌క్కువ‌గా ఉంటుంది. అంతే కాకుండా, రైలు మార్గం కూడా ఎంతో ఉత్త‌మ‌మైన‌ది. ఇక్క‌డి స‌ర‌స్సుల అందాల‌తో పాటు ఉదయపూర్ దాని ప్యాలెస్‌లు రుచికరమైన వంట‌కాల‌కు కూడా ఎంతో ప్ర‌సిద్ధిచెందింది. ఇక్క‌డ స్టే చేయాల‌నుకుంటే మాత్రం త‌క్కువ బ‌డ్జెట్ క‌లిగిన హోట‌ల్స్ ఎన్నో ఉన్నాయి. వాటిలో ప‌ర్యాట‌కులు బ‌స చేయొచ్చు. ఉద‌య‌పూర్ అందాలను వీక్షించేందుకు రెండు రోజుల స‌మ‌యం స‌రిపోతుంది.

mountabu

మౌంట్ అబూ

రాజస్థాన్‌లోని మౌంట్ అబూ చాలా ప్రసిద్ధి చెందిన హిల్ స్టేషన్. దీపావ‌ళి సెల‌వుల‌కు సంద‌ర్శించేందుకు ఈ ప్రాంతం ఎంతో అంద‌మైన ప్ర‌దేశం. ఈ ప్రాంతం దాని సుందరమైన అందానికి ప్ర‌సిద్ధి చెందింది. మౌంట్ అబూ జైనులకు మతపరమైన ప్రాముఖ్యత కలిగిన ప్రదేశంగా కూడా పేరుగాంచింది. మౌంట్ అబూలోని నిర్మాణ అద్భుతాలు ఎంతో ప్రాముఖ్య‌త‌ను సంత‌రించుకున్నాయి. వీటిని సందర్శించేందుకు ఇతర ప్రదేశాలతోపాటు, ప్రపంచంలోని వివిధ మూలల నుండి చరిత్ర ప్రియులు, వాస్తుశిల్ప ఔత్సాహికులు త‌ర‌లి వ‌స్తుంటారు. మౌంట్ అబూ ఆరావళి శ్రేణిలో రాతి పీఠభూమిపై ఉంది. దాని చుట్టూ అడవి ఉంది. మౌంట్ అబూ చేరుకోవడానికి రైలు ప్ర‌యాణం ఎంతో ఉత్త‌మ‌మైన మార్గం.

binsar

బిన్సార్

ఉత్తరాఖండ్‌లోని బిన్సార్ చాలా అందమైన ప్రదేశం. స‌హ‌జ సౌంద‌ర్యాల‌కు ఈ ప్రాంతం పేరుగాంచింది. ఈ ప్రాంతాన్ని సంద‌ర్శించాలంటే ఎక్కువ డ‌బ్బు ఖ‌ర్చు చేయాల్సిన అవ‌స‌రం లేదు. అందమైన తోటలు, సరస్సులతో, చిన్న పట్టణంగా విరాజిల్లుతుంది ఈ ప్రాంతం. బిన్సార్‌కి సమీప రైల్వే స్టేషన్ క‌త్గోడం. ఇది బిన్సార్ నుంచి సుమారు 119 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది.

dalhousie

డల్హౌసీ

డల్హౌసీ హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో ఉన్న ఎంతో అందమైన హిల్ స్టేషన్. ఇది సముద్ర మట్టానికి 2,700 మీటర్ల ఎత్తులో ఉంటుంది. డల్హౌసీ చుట్టూ ధౌలాధర్ కొండల శ్రేణి ఉంటుంది. డల్హౌసీ హిమాచల్‌లోని ఐదు కొండలపై నిర్మించిన హిల్ స్టేషన్. ఈ ఐదు కొండలు కత్లోగ్, పోర్టెన్, టెహ్రా, బక్రోటా మరియు బలూన్. దీపావళి సెలవులకు ఈ ఐదు కొండ‌ల హిల్‌స్టేష‌న్‌ను సంద‌ర్శించేలా ప్ర‌ణాళిక‌లు వేసుకోవ‌చ్చు.

More News

    Read more about: dalhousie udaipur mount abu binsar
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+