Search
  • Follow NativePlanet
Share
» »ఇక ఢిల్లీ లేహ్ ప్ర‌యాణానికి మీరు సిద్ధ‌మా?!

ఇక ఢిల్లీ లేహ్ ప్ర‌యాణానికి మీరు సిద్ధ‌మా?!

ఇక ఢిల్లీ లేహ్ ప్ర‌యాణానికి మీరు సిద్ధ‌మా?!

గమ్యం కంటే ప్రయాణమే ముఖ్యమని నమ్మే వారైతే, ఈ వేస‌విలో మ‌రో కొత్త ప్ర‌పంచంలోకి మీరు అడుగు పెట్టాల‌నుకుంటే మాత్రం న్యూ ఢిల్లీ - లేహ్ నుండి బస్సు ప్రయాణం 33 గంటల సుదీర్ఘ అనుభవాన్ని మాత్రం మిస్ చేసుకోకండి. ఈ ప్ర‌యాణంలో అత్యంత ఉత్కంఠభరితమైన దృశ్యాలను ప్ర‌త్య‌క్షంగా చూసే అవ‌కాశం మీకు ల‌భిస్తుంది. హిమాచల్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఎట్టకేలకు న్యూఢిల్లీ నుండి లేహ్ వరకు తన బస్సు సర్వీసును పునఃప్రారంభించింది. హిమాచల్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ దేశంలోని కీలాంగ్ డిపో నుండి దేశంలోనే అత్యంత పొడవైన మరియు ఎత్తైన లేహ్-ఢిల్లీ మార్గంలో బస్సును ప్రారంభిస్తోంది. గతేడాది జూన్ 15 నుంచి ఈ బస్సు సర్వీసు ప్రారంభమైంది. ఈసారి వారం రోజుల ముందే ప్రారంభిస్తున్నారు. లేహ్ నుండి కీలాంగ్ దూరం 1026 కిలోమీట‌ర్లు. ఈ మార్గాన్ని పూర్తిచేసేందుకు దాదాపు 30 గంటలు పడుతుంది.

leh

ఢిల్లీ లేహ్ బస్ సర్వీస్ దేశంలోనే అతిపెద్ద మరియు ఎత్తైన ఢిల్లీ-లేహ్ మార్గం. ఈ బస్సు సర్వీస్ జూన్ 8వ తేదీ నుండి అంటే నేటి నుండి మరోసారి ప్రారంభమవుతుంది. అయితే ఈ 1026 కిలోమీటర్ల సుదూర ప్రయాణానికి ధర ఎంత? దానిని ఎలా బుక్ చేసుకోవాలి వంటి వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

అంద‌మైన లోయ‌లు..

లేహ్ నుండి ఢిల్లీకి బస్సులో ప్రయాణం చాలా సరదాగా ఉంటుంది. ఎంతో ఆహ్ల‌ద‌క‌రంగా ఉంటుంది. బ‌స్సులోనుంచి చూస్తే చుట్టూతా ఉన్న అందమైన లోయలు అన్ని వైపులా మ‌న‌కు ఆగుపిస్తాయి. ఈ బ‌స్సును బుక్ చేసుకునేందుకు హిమాచల్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ అధికారిక వెబ్‌సైట్ సంప్ర‌దించ‌వ‌చ్చు. అంతే కాకుండా, నేరుగా హిమాచల్ డిపో కౌంటర్‌లో కూడా బుకింగ్ చేయవచ్చు. ఈ థ్రిల్లింగ్ రైడ్ కోసం కేవలం రూ.1740 చెల్లించాల్సి ఉంటుంది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, హిమాచల్ మరియు లేహ్-లడఖ్‌లను సందర్శించే ఈ అవకాశాన్ని హిమాచల్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ చాలా తక్కువ బడ్జెట్‌లో అందిస్తుంది.

leh

30 గంటల ప్రయాణంలో ప్రయాణికులు 16,500 అడుగుల బరాలాచా, 15,547 అడుగుల నకిల్లా, 17,480 అడుగుల తంగ్లాంగ్లా మరియు 16, 616 అడుగుల ఎత్తైన లాచుంగ్ పాస్ యొక్క అందమైన దృశ్యాలను చూసే అవకాశం లభిస్తుంది. సెప్టెంబర్ 2022లో మంచు కురిసిన తర్వాత ఈ బస్సు సర్వీస్ నిలిపివేయబడుతుంది. ఇప్పుడు ఈ మార్గం క్లియర్ అయిన తర్వాత మరోసారి ఈ బస్సు సర్వీసును ప్రారంభించారు. ప్రతిసారీ వాతావరణాన్ని బట్టి ఈ బస్సు సర్వీసును ప్రారంభించడం, ఆపివేయడం జరుగుతుంది.

ముగ్గురు డ్రైవర్లు, ఇద్దరు కండక్టర్లు సేవలు...

హిమాచల్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఢిల్లీ-లేహ్ మార్గంలో 1026 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణానికి ముగ్గురు డ్రైవర్లు మరియు ఇద్ద‌రు కండక్టర్ల సేవలను అందిస్తుంది. లేహ్ నుండి బయలుదేరినప్పుడు మొదటి డ్రైవర్ కీలాంగ్ వరకు బస్సును న‌డుపుతారు. రెండవ డ్రైవర్ కీలాంగ్ నుండి సుందర్‌నగర్‌కు మరియు మూడవ డ్రైవర్ సుందర్‌నగర్ నుండి ఢిల్లీకి ప్రయాణాన్ని పూర్తి చేస్తారు. ఈ సమయంలో ఇద్దరు కండక్టర్లు బస్సులో సేవలు అందిస్తారు. మొదటి కండక్టర్ లేహ్ నుండి కీలాంగ్ వరకు మరియు రెండవ కండక్టర్ కీలాంగ్ నుండి ఢిల్లీ వరకు ప్రయాణాన్ని పూర్తి చేస్తారు. మ‌రెందుకాల‌స్యం అంద‌మైన లోయ‌ల అద్భుత దృశ్యాల‌ను వీక్షించాల‌నుకుంటే మాత్రం త‌ప్ప‌కుండా ఇక్క‌డికి రావాల్సిందే.

More News

    Read more about: leh
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+