Search
  • Follow NativePlanet
Share
» »త‌మిళనాడులోని రెండు వేల ఏళ్ల చ‌రిత్ర క‌లిగిన అర్థ‌నారీశ్వ‌ర ఆల‌యం...

త‌మిళనాడులోని రెండు వేల ఏళ్ల చ‌రిత్ర క‌లిగిన అర్థ‌నారీశ్వ‌ర ఆల‌యం...

కార్తీక‌మాసం సంద‌ర్భంగా చాలామంది భ‌క్తులు నిత్యం శివాల‌యాల‌ను సంద‌ర్శిస్తుంటారు. సాధార‌ణంగా శివాల‌యాలు అన‌గానే మ‌న‌కు ట‌క్కున గుర్తుచ్చేది లింగం ఆకారంలో క‌నిపించే శివుడు.. ఏ ఆల‌యంలో చూసిన స‌రే, శివ‌లింగమే మ‌న‌కు క‌నిపిస్తుంది. కానీ, త‌మిళనాడులోని ఈ ఆల‌యంలో మాత్రం శివ‌లింగం, పార్వ‌తిదేవీలు అర్థ‌నారీశ్వ‌ర రూపంలో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు. అదే ఇక్క‌డి విశిష్ట‌త‌...ఏ ఆల‌యంలో చూసినా శివ‌లింగం, పార్వ‌తిదేవి విగ్ర‌హాలు వేరు వేరుగా ఉండ‌డం చూస్తుంటాం. కానీ, ఇక్క‌డ మాత్రం మ‌హాశివుడు, పార్వ‌తీదేవీలూ ఇద్ద‌రూ అర్థ‌నారీశ్వ‌ర రూపంలో ఒకే ద‌గ్గ‌ర కొలువై ఉంటారు. అంతేకాదండోయ్ ఈ ఆల‌యానికి రెండువేల సంవ‌త్స‌రాల చ‌రిత్ర ఉంది. ఇంకా, ఈ ఆల‌యంలో విష్ణుమూర్తి ద‌ర్శ‌న భాగ్యం కూడా భ‌క్తుల‌కు క‌లుగుతుంది..

ఈ ఆల‌యం త‌మిళనాడులోని నాముక్క‌ల్‌కు ద‌గ్గ‌ర‌గా తిరుచెంగోడ్‌లో నాగ‌గ‌రిగా పిలిచే కొండ‌పైనే వెల‌సింది. ఈ శివాల‌యం నిర్మాణ శైలి అంతా చోళుల కాలం నాటిదే. ఈ ఆల‌యం ఎత్త‌యిన శిఖరంపైన ఉంటుంది. స్వామి ఇక్క‌డ అర్థ‌నారీశ్వ‌రునిగా కొలువై ఉండ‌డం వ‌ల్లే ఈ ఆల‌యానికి ఆ పేరు వ‌చ్చింద‌ని ఇక్క‌డివారు చెబుతున్నారు. ఇక్క‌డి అలంక‌ర‌ణ‌లు జ‌రిపే తీరుకూడా ఎంతో ప్ర‌త్యేకంగా ఉంటుంది. ఈ ఆల‌యంలోని అర్ధ‌నారీశ్వ‌ర విగ్ర‌హం చేతిలో దండాయుధం ఉంటుంది. ఈ విగ్ర‌హానికి ధోవ‌తినీ చీర‌నూ అలంక‌రించ‌డం ఆనవాయితీ. వీటితోపాటు రుద్రాక్ష‌మాల‌తోపాటు మంగ‌ళసూత్రాలు కూడా వేస్తారు. అంతేకాకుండా, స్వామి వారి త‌ల‌పైన జుటాజూట‌మూ, ఎడ‌మ‌కాలికి ప‌ట్టీ కూడా ఉంటుంది.

arthanariswaratemple

ఆల‌య ప్ర‌త్యేక‌త‌లు...

ఈ ఆల‌యం నాగ‌గిరి శిఖ‌రంపై వెలసింది. ఈ ఆల‌యాన్ని చేరుకోవాలంటే సుమారు 1200 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. అంతేకాకుండా, ఏడు కిలోమీట‌ర్ల మేర విస్త‌రించి ఉన్న ఈ గిరి చుట్టు ప్ర‌దక్షిణ‌లు చేస్తే కోరిన కోర్కేలు తీరతాయ‌ని భ‌క్తుల న‌మ్మ‌కం. ఇంకా ఇక్క‌డ‌, ఆదికేశవ పేరుమాళ్‌గా పిలిచే విష్ణుమూర్తి, భూదేవీ- శ్రీ‌దేవీ ఆల‌యాలు కూడా ఉన్నాయి. అర్థ‌నారీశ్వ‌ర ద‌ర్శ‌న అనంత‌రం ఈ ఆల‌యాల‌ను కూడా భ‌క్తులు సంద‌ర్శించి విశేష పూజ‌లు నిర్వ‌హిస్తారు. శివ‌రాత్రి, కార్తీక‌మాసం సంద‌ర్భంగా ఇక్క‌డ భ‌క్తులు తండోప‌తండాలు త‌ర‌లి వ‌స్తారు.

ఆ స‌మ‌యంలో ఇక్క‌డ విశేష పూజ‌లు చేసి స్వామివారి ద‌ర్శ‌న భాగ్యం పొందుతారు. ఇంకా, ఇక్క‌డ వైశాఖ మాసంలో నిర్వహించే ర‌థోత్స‌వం కూడా ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది. ఈ ర‌థోత్స‌వం సంద‌ర్భంగా నాలుగు ర‌థాలు భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్ట‌కుంటాయి. నాలుగు ర‌థాల్లో వేరువేరుగా అర్థ‌నారీశ్వ‌రుడు, వినాయ‌కుడు, మురుగ‌న్‌, విష్ణుమూర్తి విగ్ర‌హాలను ఊరేగించే వేడుక ఎంతో వైభ‌వంగా జ‌రుగుతుంది.

arthanariswaratemple, tamilnadu

చేరుకోవ‌డం ఎలా..

ఈ ఆల‌యం త‌మిళ‌నాడులోని నామ‌క్క‌ల్ నుంచి తిరుచెంగోడ్‌కు సుమారు 20 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. విమానంలో రావాల‌నుకునేవారు తిరుచిరాప‌ల్లి లేదా కోయంబ‌త్తూరు విమాన‌శ్ర‌యానికి ముందుగా చేరుకోవాల్సి ఉంటుంది. అక్క‌డి నుండి ఆల‌యానికి వెళ్లేందుకు ఆటోలు, టాక్సీలు, క్యాబ్‌లు, బ‌స్సులు అందుబాటులో ఉంటాయి. ఇక‌, రైలు మార్గం ద్వారా గానీ, బ‌స్సుమార్గం ద్వారా గానీ రావాల‌నుకునేవారు మాత్రం ముందుగా నామ‌క్క‌ల్ రైల్వేస్టేష‌న్‌లో గానీ, బ‌స్ స్టేష‌న‌ల్‌గానీ దిగాల్సి ఉంటుంది. అక్క‌డి నుండి ఆలయాన్ని చేరుకోవాలంటే ఆటోలు, క్యాబ్‌లు అందుబాటులో ఉంటాయి. మ‌రెందుకాల‌స్యం ఈ కార్తీక మాసం సంద‌ర్భంగా ఈ అర్ధ‌నారీశ్వ‌రుని ద‌ర్శ‌న భాగ్యం పొందండి..

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+