ప్రాత:కాలంలో, సంధ్యాసమయంలో మాత్రమే దేవాలయాల్లో పూజలు, యగాలు జరుగుతాయి. అయితే అష్టభైరవ కాలేశ్వర దేవాలయంలో మాత్రం అమావాస్య, పౌర్ణమి, అర్థరాత్రి దాటిన తర్వాతనే పూజలు జరుపుతారు. దీని వల్ల అనుకొన్న కోర్కెలన్నీ నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. ఈ అష్టభైరవేశ్వర దేవాలయం భారత దేశంలో రెండు చోట్ల మాత్రమే ఉంది. ఒకటి కాశీలో ఉండగా మరొకటి అరగలూరులో ఉంది. ఈనేపథ్యంలో ఈ దేవాలయానికి సంబంధించిన కథనం.

అష్టభైరవ దేవాలయం, సేలం
P.C: You Tube
భారతీయ పురాణాల ప్రకారం భైరవుడు ప్రమద గణాలకు నాయకుడు. మరొకొన్ని చోట్ల ఈశ్వరుడి ప్రతిరూపమే ఈ భైరవుడు. ఈ భైరవుడికి ఎనిమిది రూపాలు ఉంటాయి.

అష్టభైరవ దేవాలయం, సేలం
P.C: You Tube
ఈ ఎనిమిది రూపాలు భారత పురాణాల ప్రకారం ఎనిమిది దిక్కులకు ప్రతీకలు. అంటే ఒక్కొక్క బైరవుడికి ఒక్కొక్క దిక్కును కేటాయించారు. అంతేకాకుండా ఆ దిక్కుకు క్షేత్రపాలకుడిగా కూడా వ్యవహరిస్తారు.

అష్టభైరవ దేవాలయం, సేలం
P.C: You Tube
అంటే ఆ క్షేత్రంలోని దేవాలయాలకు అధిపతి, రక్షకుడు అని చెబుతారు. చాలా చోట్ల ఎనిమిది మందికి వేర్వేరుగా దేవాలయాలు ఉంటాయి.

అష్టభైరవ దేవాలయం, సేలం
P.C: You Tube
అయితే ఈ ఎనిమిది మందికి కలిపి ఒకే దేవాలయం ఉండటం చాలా అరుదు. ఆ దేవాలయాన్ని అష్టభైరవ దేవాలయం అంటారు. అటువంటి దేవాలయాలు భారత దేశంలో కేవలం రెండు చోట్ల మాత్రమే మనకు కనిపిస్తాయి.

అష్టభైరవ దేవాలయం, సేలం
P.C: You Tube
ఒక దేవాలయం కాశీలో ఉండగా మరో దేవాలయం తమిళనాడులోని సేలం సమీపంలో ఉంది. ఈ సేలంలోని దేవాలయంలో పూజలు చేయడానికి దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు.

అష్టభైరవ దేవాలయం, సేలం
P.C: You Tube
ఈ దేవాలయంలో భైరవుడు ఉన్మత్త, సంహార, రురు, రుద్ర, క్రోధ, కపాల, కాల, అసితంగా పేర్లతో కొలువై ఉన్నాడు. ప్రతి నెల అష్టమి తర్వాత వచ్చే పౌర్ణమి రోజున మాత్రమే ఇక్కడ పూజలు నిర్వహిస్తారు.

అష్టభైరవ దేవాలయం, సేలం
P.C: You Tube
ఈ పూజల్లో పాల్గొనడానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ పూజల్లో పాల్గొనడం వల్ల అలౌకిక ఆధ్యాత్మికత కలుగుతుందని చెబుతారు. భారతదేశం మొత్తం మీద కేవలం పౌర్ణమి రోజున అది కూడా అర్థరాత్రి తర్వాత పూజలు నిర్వహించే దేవాలయం ఇదొక్కటే.

అష్టభైరవ దేవాలయం, సేలం
P.C: You Tube
ఈ దేవాలయం అత్యంత మహిమాన్వితమైనది భక్తులు నమ్ముతారు. ఇక్కడ శివుడిని కామనదీశ్వరుడిగా పేర్కొంటారు. ఇక మార్చి-ఏప్రిల్ మధ్యన సూర్యకిరణాలు సూర్యోదయం అయిన వెంటనే ఈ దేవాలయంలోని శివలింగాన్ని తాకుతాయి.

అష్టభైరవ దేవాలయం, సేలం
P.C: You Tube
ఏడాదికి ఒకసారి మాత్రమే ఈ అపురూప ఘట్టం అవిష్కారమవుతుంది. ఈ విషయాన్ని చూడటానికి దక్షిణ భారత దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు.

అష్టభైరవ దేవాలయం, సేలం
P.C: You Tube
ఈ దేవాలయం క్రీస్తుశకం మూడో శతాబ్దంలో నిర్మించారు. ఈ దేవాలయానికి మూడు గోపురాలు ఉన్నాయి. ఇలా ఒకే దేవాలయంలోని గర్భగుడికి మూడు గోపురాలు ఉండటం చాలా అరుదైన విషయం.

అష్టభైరవ దేవాలయం, సేలం
P.C: You Tube
ఈ అత్యంత పురాతన, అరుదైన దేవాలయం తమిళనాడులోని ప్రముఖ పట్టణం సేలం జిల్లాలో ఉన్న అరళగూరు అనే గ్రామంలో ఉంది. ఇది తలైవసూల్ అనే టౌన్ నుంచి కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది.

అష్టభైరవ దేవాలయం, సేలం
P.C: You Tube
ఇక సేలం నుంచి అష్టభైరవ దేవాలయం 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిత్యం బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. సాధారణ రోజుల్లో ఈ దేవాలయానికి వెలితే కేవలం స్వామివారిని దర్శించుకొని తిరిగి రావాల్సి ఉంటుంది.



Click it and Unblock the Notifications













