Search
  • Follow NativePlanet
Share
» »Ayodhya Ram Mandir : అయోధ్య బాల‌రాముని ద‌ర్శ‌నానికి వెళ్లే భ‌క్తుల‌కు అల‌ర్ట్‌...

Ayodhya Ram Mandir : అయోధ్య బాల‌రాముని ద‌ర్శ‌నానికి వెళ్లే భ‌క్తుల‌కు అల‌ర్ట్‌...

జ‌న‌వ‌రి 22న అయోధ్య‌లో బాల‌రాముని విగ్ర‌హ ప్ర‌తిష్టాప‌న కార్య‌క్ర‌మం ఎంతో వైభ‌వంగా జ‌రిగింది. ఈ మ‌హ‌త్త‌ర కార్యం కోసం భార‌త‌దేశ ప్ర‌జలే కాకుండా విదేశీయులు కూడా ఎంత‌గానో ఎదురుచూశారు. దాదాపు ఐదువంద‌ల ఏళ్లుగా యావ‌త్ భార‌త‌దేశం ఈ మ‌హ‌త్త‌ర కార్యం కోసం ఎంత‌గానో వేచి చూసింది. అలాంటి త‌రుణం జ‌న‌వ‌రి 22న రానే వ‌చ్చింది. ఆ రోజున జ‌రిగిన అయోధ్య బాలరాముని విగ్ర‌హ ప్ర‌తిష్టాప‌న‌ను యావ‌త్ భార‌త‌దేశం ఎంత‌గానో ఎదురుచూసింది.

శ్రీ రాముడు జన్మించిన అయోధ్యానగరిలో సరయు నది తీరంలో రామ మందిరంలో బాల రామయ్య కొలువుదీరాడు. కొత్త ఏడాదిలో రామమందిరం రామయ్య భక్తులకు అందుబాటులోకి వ‌చ్చింది. ప్రాణప్ర‌తిష్ట వేడుక అనంత‌రం అయోధ్య‌కు వేలాది మంది భ‌క్తులు త‌ర‌లివెళ్లారు. ప్ర‌తిరోజూ ఇక్క‌డికి తండోప‌తండాలుగా భ‌క్తులు బారులుతీరుతున్నారు. దీంతో ఐదేళ్ల బాల‌రాముడు ఒత్తిడికి గుర‌వుతున్నారంటూ భక్తుల ద‌ర్శ‌నానికి బ్రేక్ ఇచ్చారు శ్రీరామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ నిర్వ‌హాకులు.

rammandirdarshanopening

బాలరాముడి దర్శనం కోసం నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణమంతా కిట కిటలాడుతుంది. దేశ, విదేశాల నుంచి వస్తుండడంతో ఇప్పటికే ఆలయ దర్శన వేళల్లో మార్పు చేసింది. అయితే మ‌రోసారి కీలక నిర్ణయం తీసుకుంది ఆల‌య ట్ర‌స్టు. ఈ నిర్ణ‌యం వెనుక కార‌ణాలను రామ‌మందిర ముఖ్య పూజారి అయిన ఆచార్య సత్యేంద్ర దాస్ వివ‌రించారు. అయోధ్య రామయ్య ఐదేళ్ల బాలుడు.

అలా అన్ని గంటల పాటు మెలకువగా ఉండటం వల్ల పడే ఒత్తిడిని తట్టుకోలేరు. అందువల్ల బాల రాముడికి కొంత విశ్రాంతి ఇచ్చేందుకు రోజూ గంట సేపు ఆలయ తలుపులు మూసివేయాలని ట్రస్ట్ నిర్ణయించింది ఆల‌య ముఖ్య పూజారి అన్నారు. ఆల‌య క‌మిటీ నిర్ణయంతో ప్ర‌తిరోజూ మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 గంటల వరకు బాల‌రామునికి విశ్రాంతి దొరక‌నుందని కొంద‌రు భ‌క్తులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇదే స‌మ‌యంలో విగ్ర‌హం ఒత్తిడికి లోన‌వుతుంద‌ని ఆల‌య క‌మిటీ ఇచ్చిన స్టేట్‌మేంట్‌ను కూడా వారు విభేదిస్తున్నారు. భ‌క్తుల ర‌ద్దీని నియంత్రించేందుకు క‌మిటీ తీసుకునే నిర్ణ‌యాల‌ను స్వాగ‌తించొచ్చు కానీ, ఇలాంటి కార‌ణాల‌ను బ‌హిర్గ‌తం చేయ‌డం వ‌ల‌న భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బ‌తినే అవ‌కాశం ఉంద‌ని వారు గుర్తుచేశారు. ఏదిఏమైనా శ్రీరామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో రామయ్య దర్శనానికి రోజూ గంటపాటు విరామం ఇవ్వనున్న‌ట్లు తెలుస్తోంది.

rammandir darshan

తెల్ల‌వారుజాము నుంచే సుప్ర‌భాత సేవ‌లు..

ప్ర‌స్తుతం అయోధ్య స్వామివారికి సుప్రభాత సేవా కార్యక్రమాలు తెల్లవారుజామున నాలుగు గంటలకే ప్రారంభమవుతున్నాయి. ఆ తర్వాత ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు రాములోరి దర్శనం కోసం భ‌క్తుల‌ను అనుమతిస్తున్నారు. జ‌న‌వ‌రి 22వ తేదీన అయోధ్య రామ్​లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేడుక ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగిన విష‌యం తెలిసిందే.

ఆ మ‌రుస‌టి రోజు నుంచి భక్తులకు బాల రాముని దర్శనానికి అనుమతించారు. అంతేకాదు, భారీసంఖ్యలో వస్తున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దర్శన సమయాన్ని ఆలయ నిర్వాహకులు పొడిగించడం కూడా జ‌రిగింది. ప్రతిరోజు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులు ఆలయాన్ని సందర్శించేందుకు అనుమతిస్తున్నారు. అంతకుముందు ఆలయ దర్శన వేళలు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే ఉండేవి.

More News

    Read more about: ayodhya ram mandir
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+