Search
  • Follow NativePlanet
Share
» »Ayodhya Ram Mandir :అయోధ్య‌లో సంద‌ర్శించాల్సిన ప్ర‌దేశాలు...

Ayodhya Ram Mandir :అయోధ్య‌లో సంద‌ర్శించాల్సిన ప్ర‌దేశాలు...

ఈ సమయంలో దేశం మొత్తం అయోధ్య వైపే చూస్తోంది. ఎందుకంటే, ఈ నెల 22న అయోధ్య‌లో శ్రీ‌రాముని విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టించ‌నున్నారు. అందుకే, ఎక్కడ చూసినా రాముని పేరు మార్మోగిపోతోంది. రామ మందిర ప్రారంభోత్సవానికి సర్వత్రా సన్నాహాలు జరుగుతున్నాయి. దాదాపు 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, రామజన్మభూమి అయోధ్యలో శ్రీ‌రాముని గొప్ప దేవాలయం నిర్మించబడుతుంది. ఈ విశిష్టమైన, చారిత్రక సందర్భాన్ని చూసేందుకు చాలా మంది అయోధ్యకు బయలుదేరుతుంటారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో కేవ‌లం ఇక్క‌డ రామ‌మందిరమే కాకుండా ఇక్క‌డ ప్ర‌సిద్ధిచెందిన ప్ర‌దేశాలు కూడా చాలానే ఉన్నాయి. కాబ‌ట్టి అవేంటో ఓసారి చూసేయండి.

hanumangarhi1

హనుమాన్ గర్హి

అయోధ్యలో ఉన్న హనుమాన్‌గర్హి ఎంతో ప్ర‌సిద్ధిచెందిన ప్ర‌దేశం. ఇక్కడ ఒక గుహ కూడా ఉంటుంది. అందులో రామ భక్తుడు హనుమంతుడు నివశిస్తున్నాడని ఇక్క‌డి ప్ర‌జ‌ల న‌మ్మ‌కం. అందుకే చాలామంది అయోధ్య‌కు వెళ్లిన ప్ర‌తిసారి హ‌నుమంతుని ఆల‌య‌మైన హ‌నుమాన్ గ‌ర్హిని త‌ప్ప‌క సంద‌ర్శిస్తుంటారు.

kanakbhavan1

కనక్ భవన్

అయోధ్య‌లో కేవ‌లం రామాలయమే కాకుండా, కనక్ భవన్ కూడా ఇక్కడ ప్రసిద్దిచెందిన‌ దేవాలయం. ఈ భవనాన్ని కైకేయి రాణి శ్రీ రాముడితో వివాహం చేసుకున్న తర్వాత సీతాదేవికి బహుమతిగా ఇచ్చిందని చెబుతుంటారు. ఈ భవనం సీతా దేవి మరియు రాముడి ప్రైవేట్ ప్యాలెస్‌గా అభ‌వర్ణిస్తుంటారు. అయోధ్యలో ఉన్న ఈ భవన్ అధ్భుతమైన శిల్పకళా వైభవానికి నిద‌ర్శ‌నం. ఈ భ‌వ‌నంలో సీతారాముల విగ్రహాలుంటాయి.

sarayughat1

సరయూ ఘాట్

అయోధ్యకు వెళ్లాల‌ని ప్లాన్‌చేస్తుంటే మాత్రం త‌ప్ప‌కుండా సరయూ ఘాట్ చూడాల్సిందే. ప్రతి సంవత్సరం రామనవమి, దీపావళి, విజయదశమి వంటి పర్వదినాలలో వేలాది మంది ప్రజలు సరయూ నది ఒడ్డుకు వ‌స్తుంటారు.

తులసి స్మారక భవనం

అయోధ్యలో రామచరిత్ మానస్ రచయిత, సాధువు-కవి గోస్వామి తులసీదాస్ జీకి అంకితం చేసిన స్మారక చిహ్నం కూడా కొలువై ఉంది. దీనినే తులసి స్మారక్ భవన్ అని పిలుస్తారు. ఇక్క‌డ ప్రార్థనలు, భక్తి సంగీతం, మతపరమైన ప్రసంగాలు ఇక్కడ క్రమం తప్పకుండా జరుగుతాయి. అంతే కాదు, ఈ భవనంలో ఉన్న అయోధ్య రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో గోస్వామి తులసీదాస్ సాహిత్య రచనల పెద్ద భాండాగారం కూడా ఉంది.

నాగేశ్వరనాథ్ ఆలయం

అయోధ్య రామాలయాన్ని సందర్శించిన అనంత‌రం ఇక్క‌డ కొలువై ఉన్న‌నాగేశ్వర్ నాథ్ ఆలయాన్ని త‌ప్ప‌కుండా సంద‌ర్శించాల్సిందే. శ్రీరాముడు స్వయంగా శివలింగాన్ని ప్రతిష్టించించిన ఆలయమే ఈ నాగేశ్వరనాథ్ ఆలయమ‌ని చెబుతుంటారు. ఈ ఆలయంలోని శివలింగానికి భక్తులు సరయూనది నుంచి నీటిని తీసుకువచ్చి అభిషేకం చేస్తుంటారు. ఈ ఆలయాన్ని రాముడి కుమారుడు కుశుడు నిర్మించాడని ఇక్క‌డివారి న‌మ్మ‌కం.

rosegarden1

గులాబీ తోట

అయోధ్య‌లో కేవ‌లం మతపరమైన ప్రదేశాలే కాకుండా ప్రకృతి అందాలను తిల‌కించే ప్ర‌దేశాలు కూడా చాలానే ఉన్నాయి. ఇక్కడ ఉన్న గులాబ్ బారీ నగరంలోని అత్యంత అందమైన తోటలలో ఒకటిగా ప్ర‌సిద్ధిచెందింది. ఇక్కడి పచ్చదనం ప‌ర్యాట‌కుల్ని ఎంత‌గానో ఆకట్టుకుంటుంది. 8వ శతాబ్దంలో ఈ తోటలో అనేక రకాల రంగురంగుల గులాబీలను నాటారు. అవధ్ మూడవ నవాబ్ షుజా-ఉద్-దౌలా, అతని కుటుంబ సభ్యుల సమాధి కూడా ఇక్కడ ఉంది.

మోతీ మహల్

అయోధ్యలో రామాల‌యం వంటి మతపరమైన ప్రదేశాలు కాకుండా ప్ర‌కృతి సౌంద‌ర్యంతో నిండిన చారిత్ర‌క ప్ర‌దేశాలు కూడా ఉన్నాయి. అందులో మోతీ మహల్ ఒకటి. ఇది చారిత్రక, సాంస్కృతిక‌ ప్రాముఖ్యత కలిగిన ఫైజాబాద్‌లో ఉన్న ఒక స్మారక చిహ్నం. చాలా మంది మోతీ మహల్‌ను "పెర్ల్ ప్యాలెస్" అని కూడా పిలుస్తుంటారు.

బహు బేగం సమాధి

అయోధ్యలోని రామాలయం కాకుండా ప్రత్యేకంగా ఏదైనా చూడాలనుకుంటే మాత్రం త‌ప్ప‌కుండా బహు-బేగం సమాధిని సందర్శించవచ్చు. దీనిని పూర్వాంచల్ తాజ్ మహల్ అని కూడా అంటారు. అవధ్ యొక్క మూడవ నవాబు షుజా-ఉద్-దౌలా తన భార్య జ్ఞాపకార్థం వందల సంవత్సరాల క్రితం ఈ స‌మాధిని నిర్మించాడ‌ని చెబుతుంటారు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+