Search
  • Follow NativePlanet
Share
» »బారామతి - అందమైన వ్యవసాయ పర్యటన !

బారామతి - అందమైన వ్యవసాయ పర్యటన !

By Mohammad

భారతదేశం ఒక వ్యవసాయ దేశం. విదేశీయ పర్యాటకులకు కూడా ఇటీవలి కాలంలో వ్యవసాయ పర్యటనలు అంటే ఆసక్తిని కనబరుస్తున్నారు. విదేశీయులు వ్యవసాయ క్షేత్రాలలో పర్యటించి మన దేశ వ్యవసాయ దారులను కలుసుకోవడం, అధిక ఉత్పత్తులకు వారి మార్గాలు తెలుసుకోవడంవంటివి కూడా చేస్తున్నారు. అలాంటి వాటిలో మహారాష్ట్రలోని బారామతి పట్టణం ఒకటి.

వ్యవసాయ పర్యటన

వ్యవసాయ పర్యటనలో బారామతి ముందంజలో ఉన్నది. బారామతి పూణే నగరానికి 106 కి.మీ.ల దూరంలో కలదు. ఈ పట్టణంలో ఎంతో రుచికరమైన మహారాష్ట్ర ఆహారాలు దొరుకుతాయి. మీరు కనుక కొద్దిపాటి సాహసికులైతే, ఇక్కడ కల వ్యవసాయ క్షేత్రం లోని వెళ్ళండి పొలాలలో దొరికే అసలైన రుచికర గ్రామీణ ఆహారాలు కూడా ఆస్వాదించవచ్చు. ఈ ఆహారాలు చాలా చవకగా కూడా ఉంటాయి. బారామతి చెరకు తోటలకు కూడా ప్రసిద్ధి. ఈ తోటలకు వెళ్ళి తప్పక ఆనందించాలి.

వ్యవసాయ పంట పొలాలు, బారామతి

వ్యవసాయ పంట పొలాలు, బారామతి

చిత్ర కృప : Pandurang Taware

షాపింగ్

బారామతిలో షాపింగ్ కూడా ఆసక్తి కరంగా ఉంటుంది. ఇక్కడ అనేక బట్టల దుకాణాలు కలవు. తక్కువ ధరకు మంచి నాణ్యతగల దుస్తులు పొందవచ్చు. తక్కువ ధరలో ఒక మహారాష్ట్ర చీర కొనవచ్చు. ఈ బట్టలు విదేశీయులు మెచ్చుకుంటారు. పట్టణంలో కొన్ని హోటళ్ళు బయటకు చాలా సింపుల్ గా కనపడినప్పటికి, లోపలకు వెళితే నోరు ఊరించే రుచికర ఆహారాలను అందిస్తాయి.

సిద్దేశ్వర ఆలయం, బారామతి

సిద్దేశ్వర ఆలయం, బారామతి

చిత్ర కృప : AbhijeetHS

బారామతిలో మీకు ఫ్లైయింగ్ పట్ల ఆసక్తి ఉంటే తప్పక ఆనందించగలరు. బారామతి విమానాశ్రయంలో ఫైయింగ్ శిక్షణ కూడా ఇస్తారు. కనుక మీరు ఆకాశంలో ఎగరాలన్నా, వ్యవసాయ క్షేత్రాలలో ఎద్దుల బండ్లు నడపాలన్నా పర్యాటకులుగా బారామతి సందర్శించండి.

ఇది కూడా చదవండి : ఉత్తర మహారాష్ట్ర - ప్రధాన ఆకర్షణలు !

ఫ్లైయింగ్ క్లబ్

బారామతిలోని ఉచిత విమాన విహారానికి ఫ్లైయింగ్ క్లబ్ లో ఒక మధ్యాహ్నం సరైనది. ఇక్కడ ఒక ప్రయివేటు కంపెనీ నేర్చుకోవాలనుకునే వారికి ఉచిత పాఠాలు చెపుతుంది. చక్కటి జాయ్ రైడ్ అందిస్తుంది. నగరాన్ని మీరు సుమారు 3000 అడుగుల ఎత్తునుండి చూసి ఆనందించవచ్చు. వారి విమానాలలో ఏదేని పూనా వెళుతూంటే, మీరు కూనా కూడా చేరుకోవచ్చు.

ఫ్లైయింగ్ క్లబ్, బారామతి

ఫ్లైయింగ్ క్లబ్, బారామతి

చిత్ర కృప : AbhijeetHS

కమ్యూనిటీ సెంటర్

కమ్యూనిటీ కేంద్రంలో స్ధానికులు వారానికోసారి సమావేశమవుతారు. రుచికర ఆహారాలను సేవిస్తారు. వీటిలో పిజ్జాలు నుండి జ్యూసుల వరకు, మరియు ఇతర ఆహారాలైన మిసాల్ పావ్ మరియు సబుదాన వడలు మొదలైనవి ఉంటాయి.

ఆహారాలు, కమ్యూనిటీ సెంటర్

ఆహారాలు, కమ్యూనిటీ సెంటర్

చిత్ర కృప : Pandurang Taware

బారామతి ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

బారామతి కి సమీపాన పూణే ఎయిర్ పోర్ట్ కలదు. ఈ విమానాశ్రయం దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి కనెక్ట్ చేయబడినది. పూణే నుండి బారామతి వరకు చార్టెడ్ ఫ్లైట్ లు అద్దెకు కూడా దొరుకుతాయి.

రైలు మార్గం

బారామతి లో రైల్వే స్టేషన్ కలదు. పూణే నుండి ప్రతి రోజు ఈ స్టేషన్ మీదుగా 4 రైళ్ళు ప్రయాణిస్తాయి. ఉదయం 7 గంటల నుండి మొదలు కొని రాత్రి 10 గంటల వరకు రైళ్లు నడుస్తాయి. దగ్గరలో ఉన్న మరో రైల్వే స్టేషన్ దౌండ్ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ నుండి కూడా బారామతి బస్సు మార్గం ద్వారా చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం

పూణే నుండి బారామతి కి 100 కిలోమీటర్ల దూరంలో కలదు. సుమారు 3 గంటల సమయం పడుతుంది బారామతి చేరుకోవటానికి. సతారా రోడ్డు మార్గం ద్వారా కూడా బారామతి తేలికగా చేరుకోవచ్చు.

బారామతి ప్రభుత్వ బస్సు

బారామతి ప్రభుత్వ బస్సు

చిత్ర కృప : Ram@Sangola

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+