Search
  • Follow NativePlanet
Share
» »బీచ్ ప్రేమికులు త‌ప్ప‌కుండా భార‌త్‌లోని వీటిని చూడాల్సిందే..

బీచ్ ప్రేమికులు త‌ప్ప‌కుండా భార‌త్‌లోని వీటిని చూడాల్సిందే..

బీచ్ ప్రేమికుల‌కు భారతదేశంలోని ఆఫ్‌బీట్ బీచ్‌లు స్వాగ‌తం ప‌లుకుతున్నాయి. పరిశుభ్రంగా, ప్రశాంతంగా ఉండే బీచ్‌లు మ‌న‌సుకు ఎంతో ప్ర‌శాంత‌తనిస్తాయి. సాయంత్రం వేళ సాగర తీరాన కూర్చొని సేదతీరడం, అందమైన సూర్యాస్తమయాన్ని వీక్షించాల‌ని చాలామందికి ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆత్మీయులతో కబుర్లు చెప్పడం, నోరూరించే సీఫుడ్ రుచిచూడటం ఒకటేమిటి ఇలాంటి అనేక రకాల అంశాలు బీచ్‌లు మనకు అందిస్తాయి. మీరు బీచ్ ప్రేమికులైతే, ఖచ్చితంగా భార‌త్‌లోని ఈ బీచ్ గమ్యస్థానాలను మీ ప‌ర్య‌ట‌న జాబితాలో చేర్చండి.

బీచ్‌ల‌న‌గానే అందరికి మొద‌ట‌గా గుర్తుకొచ్చేది గోవా. అయితే ఇక్క‌డి బీచ్‌లు ఏడాదిలో ఎక్కువ‌భాగం ప‌ర్యాట‌కుల‌తో ర‌ద్దీగా ఉంటాయి. ఇక్క‌డ‌కు రావ‌డం ద్వారా మీరు అనుకున్నంత ఆనందాన్ని పొంద‌లేరు. గోవానే కాకుండా భార‌తదేశంలో అనేక ఇత‌ర అందమైన బీచ్‌లు ఉన్నాయి. ఆ బీచ్‌ల‌ను మీ ప‌ర్య‌ట‌న జాబితాలో చేర్చండి.

mushappilangadbeach1

ముషప్పిలంగడ్ బీచ్‌..

ఇది కేరళలో ఉన్న ఏకైక డ్రైవ్-ఇన్ బీచ్. ఈ బీచ్‌లో కారును లేదా బైక్‌ను సముద్ర అలలపై కూడా నడ‌పొచ్చు. ఇది భారతదేశంలో అతిపెద్ద డ్రైవ్-ఇన్ బీచ్, ఆసియాలో అత్యుత్తమ డ్రైవ్-ఇన్ బీచ్‌గా కూడా ఇది ప్ర‌సిద్ధి చెందింది. ఈ బీచ్ కన్నూర్ జిల్లాలో ఉంది. ఇది కన్నూర్ నుండి తలస్సేరి వరకు జాతీయ రహదారి వెంబడి నడుస్తుంది. ఇక్కడ నుండి కన్నూర్ దూరం కేవలం 17 కిలోమీటర్లు. ఈ బీచ్ తీరం ఐదు కిలోమీటర్లు ఉంటుంది. దీనిపై డ్రైవింగ్ చేయడం చాలా సులభం. ఈ బీచ్ నుండి 100 మీటర్ల దూరంలో సముద్రంలో ఒక ద్వీపం కూడా ఉంది. ఈ బీచ్‌లో నీరు తక్కువగా ఉన్నప్పుడు, కాలినడకన ఈ ద్వీపానికి చేరుకోవచ్చు.

కొంకణ్ తీరం తార్కర్లీ

మహారాష్ట్రలోని కొంకణ్‌లో తార్కర్లీ చాలా అందమైన బీచ్. ఇక్కడి నీరు చాలా శుభ్రంగా ఉంటుంది. ఇక్క‌డి సముద్రపు నీటిలో అనేక అడుగుల లోతులో స్పష్టమైన దృశ్యాన్ని చూడొచ్చు. ఇక్కడ ప‌ర్యాట‌కులు పారాసైలింగ్, స్కూబా డైవింగ్, స్నార్కెల్లింగ్ వంటి సాహ‌స కార్య‌క‌లాపాల‌ను ఆస్వాదించొచ్చు. తార్కర్లీ బీచ్‌లో హౌస్‌బోట్‌లో కూర్చొని విహ‌రించే స‌దుపాయం కూడా ఉంది. ఇక్క‌డ బస చేసేంద‌కు సమీపంలోని బస్తీలో కొంకణ్ స్టైల్ వెదురు హోమ్‌స్టేలు కూడా ఉన్నాయి. తార్కర్లీ ముంబై నుండి 546 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గోవాలోని దబోలిమ్ విమానాశ్రయం ఇక్కడికి సమీప విమానాశ్రయం. తార్కర్లీకి సమీప రైల్వే స్టేషన్ 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుడాల్. ఇది కొంకణ్ రైల్వేలో ముఖ్యమైన స్టేషన్. ఈ స్టేషన్ నుండి బీచ్ చేరుకోవడానికి బస్సులు, ఆటోలు అందుబాటులో ఉంటాయి.

konkancoasttarkarli beach

బెంగాల్-ఒరిస్సా సరిహద్దులో ఉండే ఉదయపూర్ బీచ్

ఉదయపూర్ బీచ్ బెంగాల్-ఒరిస్సా సరిహద్దులో పశ్చిమ బెంగాల్‌లోని దిఘకు పశ్చిమాన 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ఎంతో ప్రశాంతమైన, పరిశుభ్రమైన బీచ్. చాలా తక్కువ మంది పర్యాటకులు ఇక్క‌డ‌కు వస్తుంటారు. దిఘా బీచ్‌లో నీటిలోకి వెళ్లే అవ‌కాశం ఉండ‌దు. కానీ, ఉదయపూర్ బీచ్‌లో హాయిగా స్నానం చేయొచ్చు. ఇక్క‌డ బైక్‌పై తిరిగే సౌల‌భ్యం కూడా ఉంది. ఇక్కడ పారాగ్లైడింగ్ కూడా జరుగుతుంది. ఉదయపూర్ బీచ్ చేరుకునేందుకు కోల్‌కతా నుండి బస్సు లేదా రైలులో దిఘా, ఉదయపూర్ చేరుకోవచ్చు.

కార్వార్

కర్ణాటకలోని కార్వార్ జిల్లా గోవాకు ఆనుకుని ఉంటుంది. ఇక్క‌డ ఒకదానికొకటి ప‌క్క‌న వరుసగా 5 బీచ్‌లు ఉన్నందున దీనిని బీచ్ టౌన్ అని కూడా పిలుస్తారు. కవి రవీంద్రనాథ్ ఠాగూర్‌కు ఈ ప్ర‌దేశం అంటే ఎంతో ఇష్టం. అందుకే కార్వార్‌లోని బీచ్‌ను ఠాగూర్ బీచ్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతం కూడా కొంకణ్‌లో ఒక భాగం, అందుకే అక్కడి ఆహారం, సంస్కృతిలో అదే ప్రతిబింబిస్తుంది. ఇక్కడ సముద్రపు ఆహారం చాలా ప్రసిద్ధి చెందింది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+