Search
  • Follow NativePlanet
Share
» »ఈ నగరాల్లో జరుపుకొనే దీపావళిని చూడాల్సిందే

ఈ నగరాల్లో జరుపుకొనే దీపావళిని చూడాల్సిందే

వివిధ నగరాల్లో జరిగే దీపావళి సంబరాలకు సంబంధించిన కథనం.

దీపావళి. భారతీయులందరూ ఆనందోత్సాహాలతో జరుపుకొనే పండుగ. ఈ వెలుగుల కాంతిని పంచే దీపావళి పండుగను ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా జరుపుకొంటారు. ముఖ్యంగా గోవా, కొలకత్తా, గుజరాత్, వారణాసి తదితర ప్రాంతాల్లో ఈ పండుగ జరుపుకొనే తీరు విభిన్నంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో ఈ దీపావళిని ఏవిధంగా జరుపుకొంటారో తెలుసుకొందామా?

వారణాసి

వారణాసి

P.C: You Tube

వారణాసిలో దీపావళిని పదిహేనురోజుల పాటు ఘనంగా జరుపుకొంటారు. ఈ పండుగను వారణాసిలో దేవతల పండుగ, దేవతల దీపావళి తదితర పేర్లతో పిలుస్తారు. ఫొటోగ్రాఫిని ఇష్టపడేవారికి వారణాసి దీపావళి సమయంలో స్వర్గధామం. రవిదాస్, రాజ్‌ఘాట్ల వద్ద సాయంత్రం పూట ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దీపావళి రోజున గంగానదిలో స్నానం చేయడానికి దేవతలు దిగివస్తారని నమ్మకం.

గోవా

గోవా

P.C: You Tube

వీకెండ్‌పార్టీలకు పెట్టింది పేరైన గోవాలో దీపావళి అంతతే వేడుకగా జరుపుకొంటారు. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలు మొత్తం రంగురంగు దీపాలను వెలిగిస్తారు. చల్లని సాయంత్రాల్లో రంగురంగు దీపాల వెలుగులో గోవా చూడటానికి చాలా బాగుంటుంది.అందుకే ప్రతి దీపావళికి ఇక్కడికి విదేశీయులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు.

కొలకత్తా

కొలకత్తా

P.C: You Tube

మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే కోల్‌కతాలో దీపావళి విభిన్నంగా జరుపుకొంటారు. సాధారణంగా దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు. అయితే అందుకు భిన్నంగా కోల్‌కతాలో కాళికా దేవిని పూజిస్తారు. టపాసులు కాలుస్తూ కాళికా దేవి రూపాలను ఊరేగిస్తారు.

చెన్నై

చెన్నై

P.C: You Tube

తమిళనాడువాసులు ముఖ్యంగా చెన్నైలోని ప్రజలు దీపావళికి కుబేరుడిని పూజిస్తారు. తేనే, బెల్లంతో తయారుచేసిన ఆహారాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ధన్వంతరిని ఈ రోజున పూజిస్తారు. ముంబై తర్వాత టపాసులును ఎక్కువగా పేల్చేది తమిళనాడువాసులే.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+