Search
  • Follow NativePlanet
Share
» »అగర్తల వెళ్లి ఇవి చూడకుండా వెనక్కు రాకండి?

అగర్తల వెళ్లి ఇవి చూడకుండా వెనక్కు రాకండి?

అగర్తలలో చూడదగిన పర్యాటక ప్రాంతాల గురించి కథనం

అగర్తల భారతదేశపు ఈశాన్య భారతదేశంలోని ముఖ్యమైన నగరం. అగర్తల నగరం గౌహతి తర్వాత అత్యంత పెద్దనగరం. అదేవిధంగా అగర్తల త్రిపుర రాష్ట్రం రాజధాని. బాంగ్లాదేశ్ సరిహద్దు నుంచి కేవలం రెండుకిలోమీటర్ల దూరంలో ఈ నగరం ఉంది. ఇక అగర్తల పర్యాటక పరంగా అత్యంత ఆకర్షణీయమైన ప్రదేశం.

అగర్తల

అగర్తల

P.C: You Tube

అగర్తల అడ్వెంచర్ టూరిజం, సంస్క`తి పర్యాటకానికి చాలా ప్రాచూర్యం చెందినది. భౌగోళికపరంగా ఈ అగర్తల ఎంతోఆకర్షణీయంగా ఉంటుంది. అందుల్లే ప్రక`తిప్రేమికులు ఇక్కడకు ఎక్కువగా వస్తుంటారు. ముఖ్యంగా దట్టంగా ఉండే అటవీప్రాంతాల వల్ల జంగిల్ టూరిజం అంటే ఇష్టపడేవారికి అగర్తల చాలా బాగా నచ్చుతుంది.

అగర్తల

అగర్తల

P.C: You Tube

రణగొణుల మధ్య నుంచి కొంత ప్రశాంతంగా రెండురోజులు గడపాలనుకొన్నవారికి ఈ అగర్తలకు మించిన ప్రదేశం మరొకటి ఉండదు. అగర్తలో ముఖ్యంగా చూడదగినది ప్యాలెస్. పెద్ద పెద్ద గోపురాలు, ఇండో పర్శియన్ శైలి వాస్తుకళతో నిర్మించిన ఈ ప్యాలెస్ చూడటానికి రెండుకళ్లు సరిపోవు.

అగర్తల

అగర్తల

P.C: You Tube

అందువల్లే అగర్తల వెళ్లినవారు తప్పకుండా ఈ ప్యాలెస్‌ను సందర్శిస్తారు. రవీంద్రనాథ్ ఠాగూర్ కు ఈ ప్యాలెస్ అంటే చాలా ఇష్టం. ఆయన అగర్తలకు వచ్చినప్పుడు ఈ ప్యాలెస్ ను తప్పకుండా సందర్శించేవారు. అగర్తలోని క`ష్ణానగర్ కూడా అత్యంత ప్రజాదరణ పొందిన ప్రాంతం. ఇక్కడ అనేక ధార్మిక స్థలాలు ఉన్నాయి. పండుగ సమయాల్లో ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా ముస్తాబు చేస్తారు.

అగర్తల

అగర్తల

P.C: You Tube

రంగురంగు దీపాలతో అలంకరిస్తారు. ఇక్కడ మోమోస్ ఎన్ మోర్, చాయ్ థై నూగ్, అబ్బా కెఫే వంటి అనేక రెస్టోరెంట్లు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడకు ఎక్కువగా యువకులు వస్తుంటారు. అదేవిధంగా అగర్తలో గోల్‌బజార్ కూడా చూడదగిన ప్రదేశాల్లో ఒకటి.

అగర్తల

అగర్తల

P.C: You Tube

ఇది ప్రముఖ వ్యాపార కేంద్రం. ఇక్కడి నుంచి భారత దేశంలోని అనేక ప్రాంతాలకు సుగంధ ద్రవ్యాలు ఎగుమతి అవుతాయి. భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ముందే ఇక్కడ ఈ మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. ఇదే నగరంలో ఉన్న హెరిటేజ్ ఉద్యానవనం కూడా పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంది. ఇక్కడ అనేక ఆయుర్వేద మూలికలు అందుబాటులో ఉంటాయి. అగర్తల ప్రధాన నగర కేంద్రం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో వేణబాన్ విహార కేంద్రం ఉంది.

అగర్తల

అగర్తల

P.C: You Tube

ఇది కూడా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూడదగిన మరో ప్రాంతం రవీంద్రన్ కార్నర్. రాజ్‌భవన్ ప్యాలెస్ లో ఉంది. ఇక్కడ సాధారణ పర్యాటకులకు కూడా ప్రవేశం ఉండటం విశేషం. సాయంత్రం సమయంలో ఇక్కడకు వెళ్లడం మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది. అగర్తలో అటు ఇంటర్నేషనల్ స్థాయి రెస్టోరెంట్లతో పాటు స్థానిక సంస్క`తి సంప్రదాయాలను ప్రతిబింబించే చిన్న చిన్న హోటల్స్ కూడా ఉన్నాయి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+