త్రిపుర  - ఘనమైన సంస్కృతీ వారసత్వం !

హోమ్ » ప్రదేశములు » » అవలోకనం

భారతదేశం ఘనమైన సంస్కృతీ వారసత్వం జోడించి, దాని అత్యంత అద్భుతమైన అందమైన రాష్ట్రాలలో త్రిపుర ఒకటి. దాని ఆకుపచ్చ లోయలు, కొండలతో ఆహ్వానించడం ద్వారా, త్రిపుర భారతదేశంలో ఒక ప్రధాన పర్యాటక ప్రదేశంగా తనదైన ముద్ర వేసుకుంది. దేశంలోని మూడవ అతిచిన్న రాష్ట్రమైన త్రిపుర, ఈశాన్య భారతదేశం, బంగ్లదేశ్ మధ్య ఒక చిన్న బిందువు రూపంలో ఉంది. ఈ రాష్ట్ర౦ పందొమ్మిది దేశీయ కమ్యూనిటీల, అలాగే గిరిజన బెంగాలీ ప్రజల సామరస్యపూర్వక మిశ్రమం. అంతేకాకుండా, త్రిపుర పర్యాటకానికి ఆశక్తికరమైన చరిత్ర ఉంది, గోప్పతనంలో విస్తారమైన జీవవైవిధ్యం కలిగిఉంది.

త్రిపుర – ప్రారంభం అనేకమంది చరిత్రకారులు, పరిశోధకులు త్రిపుర పేరు పుట్టుకపై అనేక సిద్ధాంతలను తీసుకు వచ్చారు. త్రిపుర ముఖ్యమైన కోర్టు చారిత్రక రచన ‘రాజమల’, అనేక సంవత్సరాల క్రితం, ‘త్రిపుర’ అనే రాజు పాలించాడు కాబట్టి ‘త్రిపుర’ అనే పేరు వచ్చింది. ఆధునిక త్రిపుర గతంలో ప్రిన్స్లీ రాష్ట్ర సమయంలో, బ్రిటీషు పాలనను అనుసరిస్తూ త్రిపుర రాజవంశం పాలించింది.

త్రిపుర పర్యటన – భౌగోళ శాస్త్రం, వాతావరణం వైపు చూడడంత్రిపుర 'సెవెన్ సిస్టర్స్' గా ప్రసిద్ధిచెందిన, ఈశాన్య భారతదేశ ఏడు రాష్ట్రాలలో, ఒకటి. ప్రధానంగా కొండలు, లోయలు, మైదానాలు కలిగిఉంది, త్రిపుర ఇరుకైన లోయల చే ఐదు కొండ ప్రాంతాలుగా విభజించబడింది. తీవ్రంగా తూర్పువైపు జమ్పుయి శ్రేణులు, పస్చిమాన్ని అనుసరిస్తూ ఉనోకోటి-సఖంట్లంగ్, లోన్గ్తోరై, అతరమురా-కలఝారి, బరమురా-దేయోతమురా ఉన్నాయి.

త్రిపుర వాతావరణం త్రిపుర వాతావరణ౦ దాని ఎత్తులో ప్రభావితంకాబడి, కొండ, పర్వత ప్రాంత స్థలాలు చాలా వరకు ఒకే విధమైన విశిష్టతలను కలిగి ఉన్నాయి. త్రిపుర ఉష్ణమండల సవన్నా వాతావరణం కలిగి ఉంటుంది, ఇక్కడ నాలుగు ప్రధాన సీజన్లు ఉన్నాయి: శీతాకాలం – డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు; ముందు-ఋతుపవన కాలం మార్చ్ నుండి ఏప్రిల్ వరకు; వర్షాకాలం – మే నుండి సెప్టెంబర్ వరకు. త్రిపురలో ఉష్ణోగ్రత శీతాకాలంలో షుమారు పది డిగ్రీలకు పడిపోవచ్చు, వేసవి కాలంలో షుమారు 35 డిగ్రీలు పెరగవచ్చు. జూన్ నెలలో ఈ రాష్ట్రంలో భారీ వర్షాలు పడతాయి.

త్రిపుర, దాని గొప్ప సంస్కృతి సందర్శకులు ఇక్కడ ఏడాది పొడవునా వివిధ రకాల సాంస్కృతిక సంఘటలను చూడవచ్చు, ఎందుకంటే త్రిపురలో వివిధ జాతి-భాష, మత వర్గాలకు చెందిన ప్రజలు ఉన్నారు. ఈ రాష్ట్రంలోని ప్రతి తెగ తమ సంప్రదాయాన్ని జోడించే, అనేక పండుగలను, వేడుకలను జరుపుకుంటుంది. సంవత్సరంలో సమయంపై ఆధారపడి, సందర్శకులు అక్టోబర్ నెలలో వచ్చే దుర్గాపూజ; దుర్గాపూజ తరువాత జరుపుకునే దీపావళి; జులై నెలలో జరిగే పద్నాలుగు దేవతలను పూజించే కరాచీ పూజ వంటి కొన్ని సందర్భోచిత పండుగలను చూడవచ్చు. గరియ పూజ, కేర్ పూజ, అశోక్ అష్టమి పండుగ, బుద్ధ పూర్ణిమ, పౌస్-సంక్రాంతి మేళా, వాహ్ (దీపం) పండుగ త్రిపురలో జరిగే కొన్ని ఇతర ప్రధాన పండుగలు. ఘనంగా పరిశీలించే పండుగలే కాకుండా, త్రిపుర పర్యాటకం నృత్యం, సంగీతం, చేతిపనులు వంటి గొప్ప సాంప్రదాయ కళలను కూడా కలిగి ఉంది. త్రిపురకు చెందిన వివిధ దేశీయ తెగల సంప్రదాయ నృత్య, సంగీత వ్యక్తిగత రూపాలను కలిగిఉంది. త్రిపుర, జమటియ ప్రజలు నిర్వహించే గోరియా నృత్య సృజనాత్మకత, అందం గోరియ పూజ సమయంలో చూడవచ్చు.

అదేవిధంగా రియాంగ్ కమ్యూనిటీ యువతులు మట్టితో చేసిన కుండపై తమను తాము నిలుపుకుంటూ చేసే హోజగిరి నృత్యం ఆకట్టుకునేటట్లు ఉంటుంది. అంతేకాకుండా, లేబంగ్ నృత్యం, మమిత నృత్యం, మోసాక్ సుల్మని నృత్యం, బిజ్హు

నృత్యం, హిక్-హక్ నృత్యం మొదలైనవి తిపుర లో ఇతర గుర్తించదగిన నృత్యాలు. అంతేకాక, త్రిపుర తెగలు సరిండ, చోన్గ్ప్రేంగ్, సుముయి వంటి స్థానికంగా ప్రశంస పొందిన సంగీత సాధనాలను తయారుచేస్తారు, వీటితోపాటు హస్తకళలు, ఫర్నిచర్, పాత్రలు, వెదురు, కొయ్యను ఉపయోగించి అలంకరణ వస్తువులను తయారుచేస్తారు.

త్రిపుర పర్యటన – త్రిపుర లోను, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు కాలుష్యం లేని గాలి, గొప్ప వాతావరణం, ఆశక్తికర పర్యాటక ప్రదేశాలు, ఎవరైనా సందర్శించడానికి త్రిపుర ఒక ఆదర్శవంతమైన ప్రదేశం. త్రిపుర పర్యాటకం అత్యధికంగా ఆనందించే సందర్శకుల కోసం మతపరమైన రంగులు, అందమైన ప్రదేశాల పరిపూర్ణ కలయిక. త్రిపుర సతత హరితారణ్యాల విస్తృత వ్యాప్తి, జలవనరులు కూడా అధికభాగాన్ని కలిగి ఉన్నాయి. ఒకసారి సందర్శకులు త్రిపుర వద్ద ఉన్నపుడు, ఈ ప్రాంతానికి ప్రభావితం చేసే శక్తి ఉందని వారి కళ్ళని మైమరపిస్తాయని హామీ ఇస్తుంది.

త్రిపుర రాజధాని నగరమైన అగర్తల, అనేక పర్యాటక ప్రదేశాలను అందిస్తుంది. జగన్నాధ ఆలయం, ఉమామహేశ్వర ఆలయం, బెనుబాన్ బీహార్/బుద్ధ ఆలయం వంటి ఇక్కడ కనిపించే ఆలయాలు గొప్ప పురావస్తు చరిత్రను కలిగి ఉన్నాయి. అంతేకాకుండా, అగర్తలా సేపహిజల జూ లో ఉన్న వివిధ రకాల జంతుజాతులను కూడా చూడవచ్చు. యువ ప్రయాణీకులకు, అగర్తల రోజ్ వ్యాలీ అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది.

అగర్తలా నుండి కాకుండా, త్రిపుర ధాలై, కైలశాహర్, ఉనకోటి, ఉదైపూర్ వంటి గమ్యస్థానల వద్ద ఇతర పర్యాటక ఆకర్షణలు కూడా ఉన్నాయి. ఉదయ్ పూర్ ప్రసిద్ధ త్రిపుర సుందరి ఆలయం, భువనేష్వారి ఆలయం వంటి దేవాలయాలు తో యాత్రికుల అవసరాలను తీరుస్తుంది, కైలాశాహర్ చౌడూ దేవోతర్ మందిర్, అందమైన టీ ఎస్టేట్స్ అందరినీ ఆకర్షిస్తుంది.

త్రిపుర లో ఆసక్తికరమైన కొన్ని ఇతర సమగ్ర స్థలాలు ఉజ్జయంత ప్యాలెస్, త్రిపుర రాష్ట్ర మ్యూజియం, సుకాంత అకాడమీ, లోన్గ్తరై  మందిర్, మణిపురి రాస్ లీల, ఉనకోటి, లక్ష్మీ నారాయణ ఆలయం, పురానో రాజ్బరి, నజ్రుల్ గ్రంథాగర్, మబ్బుల చిరుతపులి నేషనల్ పార్క్, రాజ్బరి నేషనల్ పార్క్ ఉన్నాయి.

అయితే మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు? మీ బాగ్ లు సర్దుకుని, త్రిపుర ఆకర్షణలు అనుభవించడానికి తయారవ్వండి. మీరు నిరాశతో తిరిగి రారు.  

Please Wait while comments are loading...