Search
  • Follow NativePlanet
Share
» » తిరుచిరాపల్లిలో సందర్శించడానికి ఉత్త‌మ‌మైన‌ ప్రదేశాలు

తిరుచిరాపల్లిలో సందర్శించడానికి ఉత్త‌మ‌మైన‌ ప్రదేశాలు

తిరుచిరాపల్లిలో సందర్శించడానికి ఉత్త‌మ‌మైన‌ ప్రదేశాలు

తమిళనాడులోని నాలుగ‌వ‌ పెద్ద పట్టణం తిరుచిరాపల్లి. ఇది క్రీస్తుపూర్వం మూడ‌వ శతాబ్దానికి చెందినదిగా చరిత్ర చెబుతోంది. చోళులు, పాండ్యలు, పల్లవులు, విజయనగర సామ్రాజ్యం, కర్ణాటక రాజ్యం మరియు బ్రిటీష్ వారు ఈ ప్రాంతాన్ని పాలించారు.

వివిధ సాంస్కృతిక ప్రభావాల ఫలితంగా తిరుచిరాపల్లి అనేక‌ స్మారక చిహ్నాలు మరియు దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది. అలాగే, నగరం చుట్టూ కావేరీ నదీ ప్ర‌వాహం కార‌ణంగా వృక్షసంపదతోకూడిన సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. తిరుచిరాపల్లిలో ప‌ర్యాట‌కులు తప్పక సందర్శించవలసిన ఉత్తమ ప్రదేశాలను చూద్దాం.

రాక్‌ఫోర్ట్

రాక్‌ఫోర్ట్

రాక్‌ఫోర్ట్ అనేది ఒక పురాతన కోట. ఇది ఎత్త‌యిన కొండ ప్రదేశంలో నిర్మించ‌బ‌డింది. మ‌న‌దేశంలో బ్రిటీష్ పాలనను స్థాపించడంలో సహాయపడిన ప్రధాన యుద్ధం అయిన కర్ణాటక యుద్ధంలో రాక్‌ఫోర్ట్ ప్రధాన పాత్ర పోషించింది. ఈ కోటలో 7వ శతాబ్దంలో నిర్మించబడిన ప్రసిద్ధ ఉచ్చి పిల్లయార్ ఆలయం కూడా ఉంది. ఈ ఆల‌యం కోట సముదాయంలోని ఒక రాతిపై 83 మీటర్ల ఎత్తులో ఉంది. క్రీస్తు శ‌కం 508లో పల్లవులు నిర్మించిన గుహ, దేవాలయాలు కోటలోని పురాతన కట్టడాలు ఇక్క‌డ చూడవలసిన ప్ర‌ధాన‌ ఆకర్షణలు.

శ్రీ రంగనాథస్వామి ఆలయం

శ్రీ రంగనాథస్వామి ఆలయం

ప్రపంచంలోని అతి పెద్ద హిందూ దేవాలయాల జాబితాలో నిలుస్తుంది శ్రీ రంగ‌నాథ‌స్వామి ఆల‌యం. ఈ ఆలయం 6వ మరియు 9వ శతాబ్దాల మధ్య అజ్వార్ సాధువులచే నిర్మించబడింది. ఈ ఆలయం విష్ణువుకు అంకితం చేయబడింది. ప్రపంచంలోని 108 ప్ర‌సిద్ధ‌ విష్ణు దేవాలయాలలో ఇది ఒక‌ట‌వ‌ది. ఈ ఆలయ సముదాయం 156 ఎకరాల విస్తీర్ణంలో ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. ఆలయ గోపురం ఎత్తు 72 మీటర్లు మరియు 72 అంచెలను కలిగి ఉంటుంది.

జంబుకేశ్వర దేవాలయం

జంబుకేశ్వర దేవాలయం

జంబుకేశ్వర ఆలయం తమిళనాడులోని ఐదు ప్రధాన దేవాలయాలలో ఒకటిగా చెప్పుకుంటారు. ఇవి శివునికి అంకితం చేయబడ్డాయి. క్రీస్తు శ‌కం రెండ‌వ శతాబ్దంలో చోళులు ద్రావిడ నిర్మాణ శైలిలో ఈ ఆలయాన్ని నిర్మించారు. అద్భుతమైన రాతి శిల్పాలు వివిధ పౌరాణిక సంఘటనలను వర్ణిస్తాయి ఇక్క‌డి నిర్మాణాలు. అప్ప‌టి కళాకారుల రాతి శిల్ప నైపుణ్యానికి చక్కని ఉదాహరణగా జంబుకేశ్వ‌ర దేవాల‌యం నిలుస్తుంది.

ఎరుంబేశ్వరర్ ఆలయం

ఎరుంబేశ్వరర్ ఆలయం

శివునికి అంకితం చేయబడిన ఎరుంబేశ్వరర్ ఆలయాన్ని చోళుడు 18 మీటర్ల ఎత్త‌యిన‌ కొండపై నిర్మించాడు. ఈ ఆలయం కూడా ద్రావిడ శైలిలో నిర్మించబడింది. అయితే ఇతర ద్రావిడ దేవాలయాల కంటే ఇది కొంత భిన్నంగా ఉంటుంది. ఈ ఆలయ గోపురం ఇతర ఆలయాల మాదిరి ఎత్తుగా ఉండదు. కేవలం రెండు అంచెలను కలిగి ఉంటుంది. దీని నిర్మాణం ఆలయంలా కాకుండా కోటను పోలి ఉంటుంది.

వాయలూర్ మురుగన్ ఆలయం

వాయలూర్ మురుగన్ ఆలయం

మురుగన్ కు అంకితం చేయబడిన ఈ ఆలయం క్రీస్తుపూర్వం తొమ్మిద‌వ శతాబ్దంలో చోళులచే నిర్మించబడింది. ఇక్క‌డి గోడలపై హిందూ మతానికి సంబంధించిన వివిధ శాసనాలు ఉన్నందున పురావస్తు దృక్కోణంలో ఈ ఆలయం ముఖ్యమైన వాటిలో ఒకటిగా చెప్ప‌బుడుతోంది.

కల్లనై ఆనకట్ట

కల్లనై ఆనకట్ట

కల్లనై డ్యామ్ తమిళనాడులోని ప్రధాన ఆకర్షణలలో ఒకటి. కల్లనై డ్యామ్ 2వ శతాబ్దంలో చోళులచే నిర్మించబడింది. ఇది ఇప్పటికీ వాడుకలో ఉన్న ప్రపంచంలోని అత్యంత పురాతనమైన నీటి మళ్లింపు నిర్మాణాలలో ఒకటి. ఈ ప్రదేశం ప్రశాంతమైన మరియు పచ్చటి పరిసరాలలో ఉంది. కుటుంబ స‌మేతంగా గ‌డిపేందుకు ఇది గొప్ప పిక్నిక్ స్పాట్.

పులియంచోలై జలపాతం

పులియంచోలై జలపాతం

పురాతన పట్టణమైన తిరుచిరాపల్లిలో మీరు సందర్శించగల అద్భుతమైన పిక్నిక్ స్పాట్‌లలో పులియంచోలై జలపాతం ఒకటి. ఈ జలపాతం చాలా నిర్మలమైన మరియు ప్రశాంత వాతావరణంలో ఉంటుంది. ఇక్క‌డికి ప్రయాణ సమయంలో దారిపొడ‌వునా ఎదురయ్యే ప్రశాంతమైన దృశ్యం అద్భుతమైన అనుభవంతో ఖచ్చితంగా మీ మ‌న‌సును రిఫ్రెష్ చేస్తుంది.

More News

    Read more about: tiruchirappalli
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+