Search
  • Follow NativePlanet
Share
» »చెన్నైను ఫ్లైఓవర్ల నగరం అని కూడా పిలుస్తారు..తెలుసా?

చెన్నైను ఫ్లైఓవర్ల నగరం అని కూడా పిలుస్తారు..తెలుసా?

చెన్నైను ఫ్లైఓవర్ల నగరం అని కూడా పిలుస్తారు..తెలుసా?

భారతదేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వాటి స్వంత ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి. అందుకే దేశంలోని ఈ నగరాలు వాటి ప్రత్యేకతలకు ప్రసిద్ధి చెందాయి. కొన్ని నగరాలు దుస్తులకు ప్రసిద్ధి చెందితే, మరికొన్నిసాంకేతికతలకు ప్రసిద్ధి చెందాయి. ఈ నగరాలలో మ‌రో నగరం ఫ్లైఓవ‌ర్ల‌కు ప్ర‌సిద్ధి చెందింది. దీనినే సిటీ ఆఫ్ ఫ్లైఓవర్ అని కూడా పిలుస్తారు. ఇంత‌కీ ఆ న‌గరం ఏంటో తెలుసుకోవాల‌నుందా? దాన్ని సిటి ఆఫ్ ఫ్లైఓవ‌ర్ అని ఎందుకు పిలుస్తారో తెలుసుకోవాల‌నుందా? మ‌రెందుకాల‌స్యం ప‌దండి ఆ వివరాలేంటో చూసేద్దాం..

ఈ నగరాన్ని సిటీ ఆఫ్ ఫ్లైఓవర్ అంటారు

భారతదేశంలోని అనేక నగరాలు తమ గుర్తింపుకు ప్రసిద్ధి చెందాయి. భారతదేశంలోని చెన్నై నగరాన్ని ఫ్లైఓవర్ల నగరం అని అంటారు. ఎందుకు పిలుస్తారంటే.. ఇక్కడ అధిక సంఖ్యలో ఫ్లైఓవర్లు ఉన్నాయి. ఒక నివేదిక ప్రకారం ఇక్కడ 272 (ఫ్లైఓవ‌ర్లు) వంతెనలు ఉన్నాయి. వీటిలో అనేక ఫ్లైఓవర్లు ఇంకా నిర్మాణంలోనే ఉన్నాయి.

1

ఏ ఫ్లై ఓవర్ ప్రసిద్ధి చెందింది

చెన్నైని ఎప్పుడైనా సంద‌ర్శించి ఉంటే మాత్రం కత్తిపాడు ఫ్లైఓవర్‌ను కూడా క‌చ్చితంగా చూసి ఉంటారు. ఎందుకంటే, ఈ ఫ్లైఓవర్ అత్యంత ప్రసిద్ధమైనది. వాస్తవానికి, ఇది దాని ఆకర్షణీయమైన డిజైన్‌కు ప్రసిద్ధి చెందింది. ఇది గడ్డి బ్లేడ్ ఆకారంలో ఉంటుంది. పై నుండి చూస్తే ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఈ ఫ్లైఓవర్‌ని చాలా పెద్ద పెద్ద సినిమాల్లో కూడా చూపించారు.

2

ఇన్ని ఫ్లై ఓవర్లు ఎందుకు నిర్మించారు

భారతదేశంలోని అతిపెద్ద నగరాల్లో చెన్నై నగరం మొద‌టి స్థానంలో ఉంద‌ని చెప్పుకోవాలి. ఈ నగరంలో ట్రాఫిక్ స‌మ‌స్య అధికంగా కనిపిస్తుంది. ఇక్క‌డ త‌రుచుగా ట్రాఫిక్ జామ్‌తో ప్ర‌జ‌లు ఇబ్బందులు ఎదుర్కోవ‌ల‌సిన ప‌రిస్థ‌తి వ‌చ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలో గరిష్ట సంఖ్యలో ఫ్లై ఓవర్లు నిర్మించడం జ‌రిగింది. వీటి నిర్మాణంతో కొంత మేర‌కు ట్రాఫిక్ స‌మ‌స్య కాస్త త‌గ్గుముఖం ప‌ట్టింది. ఇక్క‌డి రోడ్ల‌పై ప్ర‌యాణించేట‌ప్పుడు అతి కొద్ది దూరంలోనే ప్లైఓవ‌ర్లు ద‌ర్శ‌న‌మిస్తాయి. అందుకే దీన్ని సిటి ఆఫ్ ప్లైఓవ‌ర్స్ అని పిలుస్తున్నారు.

3

చెన్నైలో ముఖ్యమైన ఫ్లై ఓవర్లు

2014 నాటికి ఈ నగరంలో 22 ఫంక్షనల్ ఫ్లైఓవర్‌లు, దాదాపు 30 వంతెనలు ఉండేవి. ఇవి దాదాపు 600,000 కార్లతో సహా దాదాపు 3.9 మిలియన్ల నగరపు వాహన జనాభాకు ఉపయోగపడుతున్నాయి. వీటితోపాటు 36కు పైగా ఫ్లై ఓవర్లు పైప్‌లైన్‌లో ఉన్నాయి. ఈస్ట్ కోస్ట్ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వే-చెన్నై పొడవు 9.7 కిలోమీటర్లు. ఇది నగరంలోని అతి పొడవైన ఫ్లై ఓవర్. పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే బంగాళాఖాతం తీరం వెంబడి నడుస్తుంది.

చెన్నైలోని ప్రసిద్ధ బ్రోకెన్ బ్రిడ్జికి పశ్చిమం వైపు వెళుతుంది. ఇంకా అన్నాఫ్లైఓవ‌ర్ లేదా జెమినీ ఫ్లైఓవర్ చెన్నైలో ప్రసిద్ధి చెందిన మరొక ఫ్లై ఓవర్. ఇది డ్యూయల్ ఆర్మ్డ్ ఫ్లై ఓవర్. మ‌రొక ఫ్లైఓవ‌ర్ తిరువాన్మియూర్- లాటిస్ బ్రిడ్జ్ రోడ్ ఫ్లైఓవర్, క్రోంపేట్ ఫ్లైఓవర్ ఇలా ప్ర‌సిద్ధి చెందిన ప్లైఓవ‌ర్లు చాలానే ఉన్నాయి. ఇటీవల నిర్మించిన లేదా నిర్మాణంలో ఉన్న ఇతర ఫ్లై ఓవర్లలో కొన్ని డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లు ఉన్నాయి. వేలచేరిలోని విజయనగర్ జంక్షన్ వద్ద పాదచారుల కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఉన్నాయి. చాలా ఫ్లైఓవర్లు టూ వే ట్రాఫిక్ కోసం నిర్మించబడ్డాయి.

More News

Read more about: city of flyovers chennai
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+