Search
  • Follow NativePlanet
Share
» »శివగామితో కలిసి పరమశివుడు నిరంతరం తాండవం చేసే రహస్య ప్రదేశం చూశారా?

శివగామితో కలిసి పరమశివుడు నిరంతరం తాండవం చేసే రహస్య ప్రదేశం చూశారా?

తమిళానడులోని చిదంబర ఆలయం గురించి కథనం.

భారతదేశంలోని పంచభూత క్షేత్రాలకు విశిష్ట ప్రధాన్యత ఉంది. వరుసగా భూమికి ప్రతీక అయిన పధ్వీలింగం తమిళనాడులోని కంచిలో ఉంది. అదే విధంగా జలలింగం జంబుకేశ్వరం (తమిళనాడు) లో ఉండగా తేజోలింగం తమిళనాడులోని తిరువణ్ణామలై లో కొలువుదీరింది. దీనినే అగ్నిలింగం అని కూడా అంటారు. ఇక వాయులింగం ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతికి సమీపంలో ఉన్న శ్రీ కాళహస్తిలో ఉండగా ఆకాశానికి ప్రతీక అయిన ఆకాశ లింగం తమిళనాడులోని చిదంబరంలో ఉంది. ఇందులో ఒక క్షేత్రంలో పరమశివుడు శివగామితో కలిసి నిత్యం ఆనంద తాండవం చేస్తూ ఉంటాడు. ఇందుకు సంబంధించిన కథనం....

నటరాజస్వామి దేవాలయం, చిదంబరం

నటరాజస్వామి దేవాలయం, చిదంబరం

P.C: You Tube

ఒక్క తమిళనాడులోనే కాకుండా దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రాచీన దేవాలయాల్లో చిదంబర దేవాలయం ఒకటి. ఈ ఆలయం శిల్పకళతో పాటు హిందూ ధార్మికతకు కూడా ప్రామూఖ్యం చెందినది.

నటరాజస్వామి దేవాలయం, చిదంబరం

నటరాజస్వామి దేవాలయం, చిదంబరం

P.C: You Tube


ఇది ఆలయం అనడం కంటే ఆలయాల సముదాయం అనడం మేలు. ఇది నడరం నడిబొడ్డున 40 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇది శైవ దేవాలయం అని చాలా మంది భావిస్తారు. అయితే వైష్ణవ దేవాలయం కూడా. దేశంలో అటు శైవులు, ఇటు వైష్ణవులకు పరమ పవిత్రమైన దేవాలయాలు కొన్నే ఉన్నాయి. అందులో చిదంబర నటరాజస్వామి దేవాలయం ముందువరుసలో ఉంటుంది.

 నటరాజస్వామి దేవాలయం, చిదంబరం

నటరాజస్వామి దేవాలయం, చిదంబరం

P.C: You Tube

చిందబర ఆలయం పంచభూత ఆలయాల్లో ఒకటి. ఈ చిదంబర దేవాలయం ఆకాశ తత్వానికి నిలయం. చిదంబరంలో మనం ఆరాధించే పరమశివుడు నిరాకార స్వరూపుడు.

 నటరాజస్వామి దేవాలయం, చిదంబరం

నటరాజస్వామి దేవాలయం, చిదంబరం

P.C: You Tube

అంటే ఎటువంటి ఆకారం లేనటువంటివాడు. స్వామి తన సతీమణి శిమగామితో కలిసి ఆద్యంత రహితమైన చిద్విలాసంతో ఆనంద తాండవం నిరంతరం చేస్తూ ఉంటారు.

 నటరాజస్వామి దేవాలయం, చిదంబరం

నటరాజస్వామి దేవాలయం, చిదంబరం

P.C: You Tube

ఈ ప్రదేశాన్ని కప్పి ఉంచే తెరని తొలగించగా వేలాడదీసిన బంగారు బిల్వ పత్రాల వరుసలు స్వామి సమక్షాన్ని సూచిస్తూ పైకి కనబడతాయి.

 నటరాజస్వామి దేవాలయం, చిదంబరం

నటరాజస్వామి దేవాలయం, చిదంబరం

P.C: You Tube

అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే చిదంబర రహస్యమంటే ఏ సమయంలో అయితే భగవంతుడికి మనం పూర్తిగా లొంగిపోయి ఆయనను మనలో లీనం చేసుకొని అజ్జానాన్ని తొలగించుకుని భగవంతుడి సమక్షాన్ని చూసి అందువల్ల కలిగే బ్రహ్మానందాన్ని పొందడమే చిందంబర రహస్యం అని చెబుతారు.

 నటరాజస్వామి దేవాలయం, చిదంబరం

నటరాజస్వామి దేవాలయం, చిదంబరం

P.C: You Tube

ఇక్కడ పరమశివుడి ఆనంద తాండవ భంగిమ ప్రపంచ ప్రసిద్ధి చెందిన భంగిమల్లో ఒకటి. ఈ భంగిమ భరతనాట్య నర్తకుడు ఎలా నర్తించాలో తెలియజేస్తుంది. నటరాజు విగ్రహం కింద రాక్షసుడు ఉంటాడు.

 నటరాజస్వామి దేవాలయం, చిదంబరం

నటరాజస్వామి దేవాలయం, చిదంబరం

P.C: You Tube

ఈ రాక్షసుడు అజ్జానాన్ని సూచిస్తాడు. చేతిలోని నిప్పు దుష్టశక్తులను నాశనం చేయడానికి ప్రతీయ. ఎత్తిన చేయి సర్వ జగత్తుకి రక్షకుడు అని అర్థం. వెను ఉన్న వలయం విశ్వాన్ని సూచిస్తుంది. చేతిలోని ఢమరుకం జీవం పుట్టుకను సూచిస్తుంది.

 నటరాజస్వామి దేవాలయం, చిదంబరం

నటరాజస్వామి దేవాలయం, చిదంబరం

P.C: You Tube

ఇక ఇక్కడ నటరాజు రూపం ఉండటం వెనుక ఒక పురాణ కథ వినిపిస్తుంది. ఈ చిదంబరం ప్రాంతం ఒకప్పుడు దట్టమైన అడవి. అక్కడ అనేక మంది రుషులు నివసించేవారు.

 నటరాజస్వామి దేవాలయం, చిదంబరం

నటరాజస్వామి దేవాలయం, చిదంబరం

P.C: You Tube

వారిలో కొందరికి అహంకారం ఎక్కువవుతుంది. దీంతో తమకు వచ్చిన మంత్రాల ద్వారా ఆ పరమశివుడిని తమ వశం చేసుకోవచ్చునని భావిస్తారు.

 నటరాజస్వామి దేవాలయం, చిదంబరం

నటరాజస్వామి దేవాలయం, చిదంబరం

P.C: You Tube

విషయం తెలుసుకొన్న పరమశివుడు అందమైన యాచకుడి రూపంలో అక్కడికి వస్తాడు. ఇక విష్ణువు మోహిని రూపంలో ఆ పరమశివుడి వెంట ఉంటారు.

 నటరాజస్వామి దేవాలయం, చిదంబరం

నటరాజస్వామి దేవాలయం, చిదంబరం

P.C: You Tube

చూడముచ్చటైన ఈ జంటను చూసి ఆ బుుషుల భార్యలు తమను తాము మరిచిపోయి వారి వెంట పడుతారు. దీంతో బుుషులు ఆగ్రహించి వేలాది పాములను ఆ యాచకుడి మీదకు వదులుతారు.

 నటరాజస్వామి దేవాలయం, చిదంబరం

నటరాజస్వామి దేవాలయం, చిదంబరం

P.C: You Tube

అయితే పరమశివుడు వాటిని తన ఒంటి పై ఆభరణాలుగా ధరిస్తాడు. దీంతో బుుషులు ఒక పెద్ద పులిని స`ష్టించి ఆ పరమశివుడి మీదకు వదులుతారు.

 నటరాజస్వామి దేవాలయం, చిదంబరం

నటరాజస్వామి దేవాలయం, చిదంబరం

P.C: You Tube

శివుడి రూపంలో ఉన్న యాచకుడు ఆ పులిని చీల్చి చర్మాన్ని నడుము చుట్టూ ధరిస్తారు. దీంతో విసుగు చెందిన బుుషులు తమ తప:శక్తి మొత్తాన్ని వినియోగించి ముయాలకన్ అనే రాక్షసుడిని స`ష్టించి యాచకుడి రూపంలో ఉన్న శివుడి పైకి వదులుతారు.

 నటరాజస్వామి దేవాలయం, చిదంబరం

నటరాజస్వామి దేవాలయం, చిదంబరం

P.C: You Tube

ఆ పరమశివుడు చిరునవ్వుతో అజ్జానానికి, గర్వానికి చిహ్నమైన రాక్షసుడి వెన్ను మీద కాలుమోపి కదలకుండా చేసి ఆనంద తాండవం దీనినే ఆద్యంత రహితమైన చిద్విలాస న`త్యం అని అంటారు.

 నటరాజస్వామి దేవాలయం, చిదంబరం

నటరాజస్వామి దేవాలయం, చిదంబరం

P.C: You Tube

అటు పై తన నిజస్వరూపాన్ని ఆ బుుషులకు చూపిస్తారు. దీంతో భగవంతుడు మంత్రాలకు లొంగడని నిర్మలమైన మనస్సుకు మాత్రమే లొంగుతాడిన భావించి స్వమిని పూజిస్తారు.

 నటరాజస్వామి దేవాలయం, చిదంబరం

నటరాజస్వామి దేవాలయం, చిదంబరం

P.C: You Tube

అటు పై ఆ బుషి పుంగవుల కోరిక మేరకు ఆ పరమశివుడు ఆ ఆనంద తాండవ రూపంలోనే శివగామిని సమేతంగా కొలువై ఉన్నారని చెబుతారు.

 నటరాజస్వామి దేవాలయం, చిదంబరం

నటరాజస్వామి దేవాలయం, చిదంబరం

P.C: You Tube

తమిళానడులోని ఆలయాల్లో కెల్లా చిదంబర ఆలయంలోని రథం ఎంతో అందమైనది. . సాధారణంగా ఏడాదికి ఒకసారి మాత్రమే ఏ దేవాలయంలోనైనా రథోత్సవం జరుగుతుంది. అయితే ఏడాదిలో రెండుసార్లు నటరాజస్వామి చిదంబరంలోని రథంలో ఊరేగుతారు

 నటరాజస్వామి దేవాలయం, చిదంబరం

నటరాజస్వామి దేవాలయం, చిదంబరం

P.C: You Tube

ఇక ఇదే చిదంబర ఆలయ ప్రాంగణంలో గోవిందరాజ పెరుమాళ్ స్వామి, ఆయన సతీమణి పుండరీగవల్లి తాయార్ విగ్రహాలు కొలువై ఉన్నాయి. ఈ విగ్రమాన్ని తిల్లై తిరుచిత్రకూటం అని అంటారు.

 నటరాజస్వామి దేవాలయం, చిదంబరం

నటరాజస్వామి దేవాలయం, చిదంబరం

P.C: You Tube

చిదంబరం పుణ్యక్షేత్రం తమిళనాడులోని కడలూర్ జిల్లా కారైకల్ కి 60 కిలోమీటర్ల దూరంలో పాండిచ్చేరికి 78 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడకు చెన్నై నుంచి నిత్యం బస్సు సర్వీసులు ఉన్నాయి.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+