దేశవ్యాప్తంగా దసరా సంబరాలు అంబరాన్నంటాయి. ఈ నవరాత్రుల వేళ చాలా ప్రాంతాల్లో దాండియా వేడుకలను నిర్వహిస్తారు. దాండియా గుజరాత్ సంప్రదాయ నృత్యం. అయితే ఇప్పుడు ఈ నృత్యానికి దేశమంతటా ఎంతో ఆదరణ లభిస్తోంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ నవరాత్రుల సందర్భంగా దాండియా వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతాయి. ఇంతకీ ఆ ప్రాంతాలేంటో చూసేద్దాం.. అక్కడి దాండియా వేడుకలకున్న ప్రత్యేకతల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
అహ్మదాబాద్
దాండియా నృత్యం గుజరాత్ రాష్ట్ర సంప్రదాయ నృత్యం. ఈ రాష్ట్రంలోని పలు నగరాల్లో దాండియా వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. నవరాత్రుల వేళ ఇక్కడీ వీధులు దాండియా ఆటలతో సందడి చేస్తుంటాయి. రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లోని పసిఫిక్ మాల్‌లో జరిగే దాండియా నైట్‌కు ఇక్కడ ప్రత్యేక ఆదరణ ఉంది. బుక్ మై షో తెలిపిన వివరాల మేరకు పసిఫిక్ మాల్‌లో జరిగే దాండియా వేడుకల్లో పాల్గొనాలంటే మాత్రం రూ.399 చెల్లించాల్సిందే.
వడోదర
దాండియా వేడుకలకు ప్రసిద్ధిచెందిన మరో ప్రాంతం గుజరాత్‌లోని వడోదర. ఇక్కడ నిర్వహించే దాండియా నైట్‌కు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ దాండియా వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించాలంటే మాత్రం రూ.400 నుండి రూ.500 వరకు చెల్లించాల్సి ఉంటుంది. కొన్నిప్రాంతాల్లో అయితే, టిక్కెట్ ధర రూ. రెండువేలకు పైగానే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.
థానే
దేశంలోని దాండియా వేడుకల్లో ప్రసిద్ధిచెందిన మరో ప్రదేశం మహారాష్ట్రలోని థానే.. ఇక్కడ దాండియా వేడుకలు థానేలోని ఆక్ట్రాయ్ మైదానంలో నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా ఇక్కడి దాండియాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి దాండియా వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి తరలి వస్తుంటారు. ఈ ఈవెంట్‌లో పాల్గొనాలంటే మాత్రం ఒక్కొక్కరికి టిక్కెట్టు ధర రూ.300గా నిర్ణయించారు.

న్యూఢిల్లీ
దాండియా వేడుకలకు ఫేమస్ ఢిల్లీలోని రాజ్‌వాడ ప్యాలెస్. ఇక్కడ నవరాత్రుల సందర్భంగా దాండియా నైట్ నిర్వహిస్తారు. ఇక్కడ దాండియా నిర్వహించేందుకు ప్లేస్ 22,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ ఎయిర్ కండిషన్డ్ ఏరియాలో దాండియా ఆడేందుకు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ జరిగే దాండియాలో ప్రత్యక్షంగా పాల్గొనాలనుకునేవారు తప్పకుండా 600 రూపాయలు ఎంట్రీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
బెంగళూరు
బెంగుళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలోనూ దాండియా వేడుకలను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడ జరిగే దాండియా నైట్ చాలామంది వీక్షకులు వస్తారు. జేపీ నగర్‌లో జరిగే ఈ కార్యక్రమానికి వెళ్లాలంటే ముందుగానే ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టిక్కెట్ ధర రూ. 100 వరకూ ఉంటుంది.
ఇండోర్
దాండియా వేడుకలకు ప్రసిద్ధిచెందిన మరో ప్రదేశం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్. ఇక్కడ చాలా చోట్ల దాండియా నైట్స్ నిర్వహిస్తారు. ఇక్కడ గర్బా, దాండియా నైట్స్ వంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు చాలా ఎక్కువ రోజుల సమయం తీసుకుంటారు. ఇక్కడి మరో ప్రత్యేకత ఏంటటే.. గర్బా లేదా దాండియా నైట్‌ని ఆస్వాదించే వారికి వేడుక తర్వాత బహుమతులను కూడా అందజేస్తారు.

సూరత్
దాండియా లేదా గర్బాకు ప్రసిద్ధిచెందిన మరో ప్రదేశం గుజరాత్‌లోని సూరత్. ఇక్కడ నవరాత్రులు విభిన్నంగా నిర్వహిస్తారు. సూరత్‌ను దాండియా లేదా గర్బా నగరం అని కూడా పిలుస్తారు.
ముంబై
దేశ ఆర్ధిక రాజధాని ముంబై నగరంలో దాండియా సంబరాలు అంబరాన్నంటుతాయి. నగరంలో నవరాత్రి వేడుకల కోసం దాండియా నైట్స్ నిర్వహిస్తారు. వీటితోపాటు డోమ్ రాస్ గర్బా వంటివి కూడా ఇక్కడ జరుగుతాయి.



Click it and Unblock the Notifications














