Search
  • Follow NativePlanet
Share
» »దేశంలోని ఈ ప్రాంతాల్లో దాండియా నృత్యాల‌ను చూడాల్సిందే...

దేశంలోని ఈ ప్రాంతాల్లో దాండియా నృత్యాల‌ను చూడాల్సిందే...

దేశంలోని ఈ ప్రాంతాల్లో దాండియా నృత్యాల‌ను చూడాల్సిందే...

దేశవ్యాప్తంగా దేవి నవరాత్రులు మొద‌ల‌వనున్నాయి. తొమ్మిది రోజుల పాటు జ‌రిగే ఈ పండుగ‌కు దేశంలోని ప్ర‌జ‌లంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రజలు ఈ పండుగను వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా జరుపుకుంటారు. చాలా ప్రదేశాల్లో దేవి న‌వ‌రాత్రుల సంద‌ర్భంగా దాండియా వంటి నృత్యాల‌ను చేస్తారు. ఇంకా ఇక్కడ ప్రజలు రాత్రంతా గర్బా, వేడుకల్లో లీన‌మైపోతుంటారు. దేశమంతా వివిధ సంస్కృతుల్లో, వివిధ పద్ధతుల్లో ఈ న‌వ‌రాత్రులను నిర్వ‌హించుకుంటారు. ఉత్తర భారతదేశం అంతా కూడా చాలా కోలాహలంగా ఉంటుంది. ఈ తొమ్మిది రోజులు దేవి మంటపాలు నెలకొలిపి ఎంతో ఘ‌నంగా దేవీమాత‌ను కొలుస్తారు. ఈ న‌వ‌రాత్రుల సంద‌ర్భంగా దేశంలోని ఈ ప్రాంతాల్లో జ‌రిగే దాండియా నృత్యాల‌ను చూసేద్దామా...

ఇండోర్

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దేవి న‌వరాత్రుల సంద‌ర్భంగా చాలా చోట్ల దాండియా నైట్స్ నిర్వహిస్తున్నారు. ఈ నగరంలోని ఇతర ప్రదేశాల మాదిరిగానే, గర్బా, దాండియా నైట్స్‌ని నిర్వహించడానికి చాలా రోజుల ముందునుంచే సన్నాహాలు మొద‌లుపెడ‌తారు. గర్బా లేదా దాండియా నైట్‌లో పాల్గొనే వారికి వేడుక తర్వాత బహుమతులను కూడా అందజేస్తారు. ప్ర‌తి ఏటా ఇక్క‌డ దేవి న‌వ‌రాత్రుల సంద‌ర్భంగా గ‌ర్బా, దాండియా నృత్యాల‌ను నిర్వ‌హిస్తుంటారు. వీటిని చూసేందుకు పెద్ద ఎత్తున జ‌నం వ‌స్తుంటారు.

dandiya , folk dances performed in the country on the occasion of Navratri

గుజ‌రాత్‌

గార్బా, దాండియా రెండూ కూడా గుజరాతి నృత్యాలే కావ‌డం విశేషం. ఇక్క‌డ మహిషాసురుడిని వధించే క్రమంలో తొమ్మిదిరోజుల పాటు సాగిన ఆమె యుద్ధ రీతిని వివరించేవిగా ఈ నృత్యాలు సాగుతాయి. గార్బా గుజరాతి గ్రామాల్లో పుట్టిన కళ. ఇప్పుడు ఈ క‌ళ దేశమంతా విస్తరించింది. ముఖ్యంగా గుజరాతీ కమ్యూనిటీలు ఉన్న ప్రతిచోటా ఈ నృత్యాలు చేస్తు ఉంటారు. పెద్ద దీపపు సెమ్మె లేదా దేవి విగ్రహం చుట్టూ వృత్తాకారంలో తిరుగుతూ ప్ర‌ద‌ర్శ‌న‌లు చేస్తూ ఉంటారు. ఒకరినొకరు దాటు కుంటూ తిరుగుతూ చేసే బృంద నృత్యం ఇది. అయితే, ఇప్పుడు ఈ నృత్యాల‌ను పెళ్లిళ్లు, ఇత‌ర వేడుక‌ల్లో కూడా చేస్తున్నారు. ప్రాంతం, భాష‌తో సంబంధం లేకుండా దాండియా, గార్భా నృత్యాలు దేశ‌వ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. గార్బా స్త్రీ శక్తిని, ఫెర్టిలిటిని ఆరాధిస్తూ సాగే నృత్యం. తల్లిదుర్గాదేవి లోని మాతృత్వపు తొమ్మిది రూపాలను కొలిచే నృత్య రీతి గార్భా. దాండియా క‌ర్ర‌ల‌తో ల‌య‌బ‌ద్ద‌మైన ద‌రువు వేస్తూ వృత్తాకారంలో తిరుగుతూ ప్రదర్శించే నృత్యం.

సూరత్

దాండియా లేదా గర్బా అనగానే అందరి మదిలోనూ ముందుగా గుర్తుకొచ్చేది గుజరాత్. దాండియాకు పునాదిగా భావించే గుజరాత్‌లోని సూరత్‌లో నవరాత్రులను ఎంతో విభిన్నంగా నిర్వ‌హిస్తారు. సూరత్‌ను దాండియా లేదా గార్భా నగరం అని కూడా పిలుస్తారు.

garba , దాండియా నృత్యాలకు ప్ర‌సిద్ధి చెందిన ప్రాంతాలేవి

ఢిల్లీ

దేశ రాజధాని ఢిల్లీలో నివసించేవారు కూడా దాండియా నైట్స్‌లో పాల్గొంటారు. ఇక్క‌డ కూడా అనేక ప్రదేశాల్లో నవరాత్రి వేడుకలను నిర్వహిస్తారు. ఢిల్లీలో కూడా నవరాత్రి ఉత్సవాలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఇక్క‌డివారు కూడా దాండియా, గార్భా నృత్యాల్లో పాల్గొంటారు.

ముంబై

దేశ ఆర్ధిక రాజధాని ముంబై నగరంలో దాండియా సందడి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ నగరంలో నవరాత్రి వేడుకల కోసం దాండియా రాత్రులు కూడా నిర్వహిస్తుంటారు. దాండియా, గార్భా నృత్యాలతో వీధులంతా ఎంతో కోలాహ‌లంగా మారుతాయి. గార్బా, దాండియాలుగా పిలిచే ఈ జానపద నృత్యాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపును సంపాదించుకున్నాయి. ఈ జాన‌ప‌ద నృత్యాల్లో అందమైన రంగురంగుల ఎంబ్రాయిడరీ దుస్తులు ధరించి యువతీ యువకులు ఎంతో అందంగా ముస్తాబు అయ్యి ఈ నృత్యాలను చేస్తారు. ఇవి చూసేందుకు ఎంతో కన్నుల పండువగా ఉంటాయి. డోమ్ రాస్ గార్భా ఇక్క‌డ ఎంతో ప్ర‌త్యేకం.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+