Search
  • Follow NativePlanet
Share
» »దేవరాయనదుర్గ - పర్యాటకులను కట్టిపడేసే హిల్ స్టేషన్ !!

దేవరాయనదుర్గ - పర్యాటకులను కట్టిపడేసే హిల్ స్టేషన్ !!

3940 అడుగుల ఎత్తులో వుండడం వల్ల ఈ ప్రాంతంలోని వాతావరణం కట్టి పడేస్తుంది. ఈ ప్రదేశం బెంగళూరు మహానగరం నుండి 70 కిలోమీటర్ల దూరంలో కలదు.

By Mohammad

చుట్టూ పరచుకున్న పచ్చని అడవుల మధ్య దేవరాయనదుర్గ లోని రాతి కొండలు ఈ ప్రాంత సందర్శన ను ఆహ్లాదకరంగా మారుస్తాయి. 3940 అడుగుల ఎత్తులో వుండడం వల్ల ఈ ప్రాంతంలోని వాతావరణం కట్టి పడేస్తుంది. ఈ ప్రదేశం బెంగళూరు మహానగరం నుండి 70 కిలోమీటర్ల దూరంలో కలదు. దేవరాయనదుర్గ, కర్ణాటకలోని తూమ్కుర్ జిల్లలో ఉంది. అక్కడి ఆలయాలు, అడవులు అలాగే అద్భుతమైన వాతావరణం, అక్కడి అందమైన దృశ్యాలు ఎంతో ప్రసిద్ధిగాంచాయి.

దేవరాయనదుర్గను వోడేయార్లు పాలించారు. జడక అనే ఒక సామంత రాజును ఓడించి ఈ పట్టణాన్ని చేజిక్కించుకున్న చిక్క దేవరాజ వడేయార్ రాజు పేరిట ఈ ఊరు ఏర్పడింది.

ఇది కూడా చదవండి : పర్యాటకులను మంత్రముగ్ధులను చేసే బృందావన్ గార్డెన్స్ !!

దేవరాయనదుర్గలో గుర్తుంచుకోవలసిన స్థలాలు

ఈ కొండ ప్రాంతం లో భోగనరసింహ, యోగనారసింహ, లక్ష్మీ నరసింహ దేవాలయాలు వున్నాయి. దేవరాయనదుర్గ లో మూడు ప్రత్యేకమైన ఎత్తైన ప్రదేశాలు ఉన్నాయి. యోగనారసింహ విగ్రహం కొండ పైన ఉంటె, భోగనరసింహ ఆలయం కొండకింద ఉంది. లక్ష్మి నరసింహ దేవాలయం మొదటి ఎత్తులో ఉంది. ఇక్కడ మరొక సహజ ఆకర్షణ నామద చిలుమే !!

ఆలయాలు

ఆలయాలు

దేవరాయనదుర్గ లో ఉన్న ఆలయాలలో ప్రధానమైనది యోగా నరసింహ స్వామి ఆలయం, భోగ నరసింహ స్వామి ఆలయం. వీటితోపాటు మహాలక్ష్మి ఆలయం, సంజీవరాయ ఆలయం లు చూడదగ్గవిగా ఉన్నాయి.

చిత్ర కృప : Sunnya343

భోగ నరసింహస్వామి ఆలయం

భోగ నరసింహస్వామి ఆలయం

దేవరాయనదుర్గ లో ప్రయాణం చేసేటప్పుడు కొండ దిగువన ఉన్న భోగ నరసింహ స్వామి ఆలయాన్ని తప్పక సందర్శించాలి. చోళుల కాలంలో ఈ ఆలయాన్ని కట్టించినారు. శివుని అవతారంగా భావించబడే దుర్వాస మహాముని చేత విగ్రహం ప్రతిష్టించబడింది.

చిత్ర కృప : Mishrasasmita

యోగ నరసింహస్వామి ఆలయం

యోగ నరసింహస్వామి ఆలయం

దేవరాయనదుర్గ సందర్శించే యాత్రికులు కొండ పైన ఉన్న యోగ నరసింహ స్వామి ఆలయాన్ని తప్పక సందర్శించాలి. బ్రహ్మ సుమారు 1000 ఏళ్ళు తపస్సు చేస్తే శివుడు మహావిష్ణువు అవతారాల్లో ఒకటైన నరసింహ స్వామి రూపంలో ప్రత్యక్షమైనట్టు భావిస్తారు.

చిత్ర కృప : Sunnya343

సంజీవరాయ దేవాలయం

సంజీవరాయ దేవాలయం

సంజీవుడు అంటే ఆంజనేయుడు. ఆయనే కదా లక్ష్మణుడు స్పృహ కోల్పోతే సంజీవ పర్వతం తెచ్చింది. సంజీవరాయ దేవాలయం లో అనజనేయుడు కొలువై ఉంటాడు. ఈ ఆలయాన్ని నరసింహ స్వామి ఆలయం అకంటే ముందు నిర్మించారని స్థానికుల నమ్మకం.

చిత్ర కృప : Hari Prasad Nadig

కళ్యాణ తీర్థం

కళ్యాణ తీర్థం

యోగ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో కనిపించే చెరువు కళ్యాణ తీర్థం. ఇక్కడి ప్రధాన దైవం విగ్రహం లో నుంచి ఒక పవిత్రమైన తీర్థం వస్తుందని భక్తుల, స్థానికుల నమ్మకం.

చిత్ర కృప : Siddarth P Raj

విద్యాశంకర దేవాలయం

విద్యాశంకర దేవాలయం

దేవరాయనదుర్గ కు సమీపంలో ఉన్న దుర్గదహళ్లి గ్రామంలో విద్యాశంకర దేవాయం కలదు. ఇది సుమారు 400 ఏళ్ళ కిందట నిర్మించినట్టు చెబుతారు. చూడటానికి ఎంతో అందంగా కనిపించే ఈ ప్రదేశాన్ని కూడా పర్యాటకులు తప్పక సందర్శించాలి.

చిత్ర కృప : Srinivasa83

మహాలక్ష్మి దేవాలయం

మహాలక్ష్మి దేవాలయం

దేవరాయదుర్గ సమీపంలోని గోరహనహళ్లి వద్ద ఉన్న మహాలక్ష్మి ఆలయాన్ని తప్పక సందర్శించాలి. ఇక్కడ మహాలక్ష్మి, మారికాంబ, నాగ దేవత వంటి దేవతా విగ్రహాలను చూడవచ్చు. ఆలయంలో ప్రతిరోజూ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది.

చిత్ర కృప : latha05

నామద చిలుమే

నామద చిలుమే

కొండ కింద నుండి తుముకూరు వెళ్ళే మార్గంలో 'నామద చిలుమే' స్థలం ఉన్నది. శ్రీరాముడు లంకకు వెళుతూ మార్గమధ్యంలో ఇక్కడ కొంత సేపు విశ్రమించాడు. నీరు త్రాగుదామని అటు ఇటు చూసాడు. చివరికి నీరు లేదని గ్రహించిన శ్రీరాముడు భూమి మీదకు ఎక్కుపెట్టి బాణాన్ని సంధిస్తే నీరు ఎగిసి ఎగిసి పడింది.

చిత్ర కృప : AjithBhat

నామద చిలుమే

నామద చిలుమే

ఎగిసి పడే నీటి ధారలను పర్యాటకులు ఇప్పటికీ చూడవచ్చు. అలాగే సమీపంలో రాముని పాద ముద్రలు కూడా గమనించవచ్చు. నామద చిలుమే ప్రదేశంలో పాత భవనం ఒకటి కనిపిస్తుంది. అందులో ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త డాక్టర్ సలీం అలీ తన పరిశోధనల నిమిత్తం ఇక్కడ నివసించాడని చెబుతారు.

చిత్ర కృప : Siddarth P Raj

దేవరాయనదుర్గ ఎలా చేరుకోవాలి ?

దేవరాయనదుర్గ ఎలా చేరుకోవాలి ?

విమాన మార్గం

బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం దేవరాయనదుర్గ కు సమీపాన ఉన్న విమానాశ్రయం (70 కి.మీ. దూరంలో).

రైలు మార్గం

దేవరాయనదుర్గ కు 18 కి.మీ. ల దూరంలో తుముకూరు రైల్వే స్టేషన్ (జంక్షన్) కలదు.

రోడ్డు మార్గం / బస్సు మార్గం

దేవరాయనదుర్గ చేరుకోవటానికి బెంగళూరు నుండి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు, ప్రవేట్ బస్సులు అందుబాటులో ఉంటాయి.

చిత్రకృప : Subramanya Prasad

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+