Search
  • Follow NativePlanet
Share
» »కలియుగ ప్రారంభంరోజున వెలిసిన ఈ దైవ దర్శనంతో మీ ఇంట

కలియుగ ప్రారంభంరోజున వెలిసిన ఈ దైవ దర్శనంతో మీ ఇంట

జమలాపురంలోని వేంకటేశ్వరుడి దేవాాలయానికి సంబంధించిన కథంన.

శ్రీరామ చంద్రుడే స్వయంగా తాను కలియుగం ప్రారంభం రోజున వేంకటేశ్వరుడి రూపంలో ఇక్కడ ఉద్భవిస్తానని చెప్పాడు. అన్నట్లుగానే ఈ క్షేత్రంలోని వేంకటేశ్వరుడు సాలగ్రామ రూపంలో కలియుగం ప్రారంభం రోజున వెలిశాడు. అందువల్ల ఇక్కడ ఉన్న వేంకటేశ్వరుడి విగ్రహం తిరుమలలోని వేంకటేశ్వరుడి విగ్రమం కంటే పురాతనమైనదని చెబుతారు.

ఈ దైవం కలియుగాంతం వరకూ ఇక్కడే ఉంటుంది. అటు పై ఓ భక్తుడి కోరిక పై కొండ పై ఉన్న ఆ వేంకటేశ్వరుడు కొండ కిందికి వచ్చాడు. ఇక్కడి దైవాన్ని సందర్శించుకొన్నవారి ఇంట్లో రామరాజ్యం వలే నిత్యం సుఖ సంతోషాలతో పాటు ఐశ్వర్య వృద్ధి కూడా జరుగుతుందని స్థానిక భక్తుల విశ్వాసం. ఇన్ని విశిష్టతలు కలిగిన ఆ పుణ్యక్షేత్రం గురించిన పూర్తి వివరాలు మీ కోసం

దశరాథ మహారాజ కొలువులో

దశరాథ మహారాజ కొలువులో

P.C: You Tube

స్థల పురాణాన్ని అనుసరించి దశరధ మహారాజు కొలువులో జాబాలి మహర్షి గురువు స్థానంలో ఉండేవారు. ఆయనకి శ్రీరామ చంద్రుడంటే అత్యంత ప్రేమ. శ్రీరాముడు వనవాసం వెళ్లినప్పుడు ఆయన చాలా బాధపడ్డాడు. శ్రీరాముడి చేత వానవాసం మార్పించడానికి విఫలయ యత్నం చేశాడు.

శ్రీరాముడి వనవాసం

శ్రీరాముడి వనవాసం

P.C: You Tube

అయితే శ్రీరాముడు తన దీక్షను వదలలేదు. దీంతో శ్రీరాముడి లేని రాజ్యంలో తాను ఉండలేనని చెప్పి జబాలి మహర్షి దేశ సంచారానికి బయలుదేరాడు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం జమలాపురం పిలువబడుతున్న ప్రాంతానికి చేరుకొంటాడు.

మహర్షి తపస్సు

మహర్షి తపస్సు

P.C: You Tube

అప్పట్లో ఈ ప్రాంతాన్ని సూచీగిరి అని పిలిచేవారు. ఇక్కడి ప్రక`తి రమణీయతకు ముగ్దుడైన జబాలి మహర్షి ఇక్కడే ఆ శ్రీరామ చంద్రుడి గురించి ఇక్కడ ఒక గుహలో తపస్సు చేస్తూ ఉండిపోతాడు. వనవాసం రావణ సంహారం తర్వాత శ్రీరాముడికి అవతారం చాలించే సమయం వస్తుంది.

ప్రత్యక్షమవుతాడు

ప్రత్యక్షమవుతాడు

P.C: You Tube

ఆ తరుణంలో జబాలి మహర్షి తపస్సుకు మెచ్చి ఆయన ఎదుట ప్రత్యక్షమవుతాడు. ఈ భూ మండలం ఉన్నంత వరకూ ఇక్కడే కొలువై ఉండాలని జబాలి మహర్షి కోరుతాడు. ఇందుకు శ్రీరాముడు ఇప్పుడు అందుకు సమయం కాదని చెబుతాడు.

కలియుగం ముగిసేంత వరకూ

కలియుగం ముగిసేంత వరకూ

P.C: You Tube

కలియుగం ప్రారంభం రోజున ఇక్కడ తాను స్వయంభువుగా వెలిసి ఆ యుగం ముగిసేంతవరకూ ఉంటానని చెప్పి జబాలి మహర్షికి మోక్షం ప్రసాదిస్తాడు. ఇచ్చిన మాట ప్రకారం విష్ణువు అంశ అయిన శ్రీరామ చంద్రుడు వేంకటేశ్వరుడిగా ఇక్కడ వెలిశాడని చెబుతారు.

తిరుమల కంటే పురాతనమైనది

తిరుమల కంటే పురాతనమైనది

P.C: You Tube

తిరుమలలోని విగ్రహం కంటే ఇక్కడ ఉన్న సాలగ్రామ వేంకటేశ్వరుడు పురాతనమైనదని పురాణాలు చెబుతున్నాయి. వేంకటేశ్వరుడిగా వెలిసిన ఈ గుహను వైకుంఠగుహ అంటారు.

సుఖ సంతోషాలు

సుఖ సంతోషాలు

P.C: You Tube

శ్రీరామ చంద్రుడే ఇక్కడి వేంకటేశ్వరుడిని కొలువై ఉండటం వల్ల ఇక్కడి దైవాన్ని దర్శించిన వారి ఇంట రామరాజ్యం వలే నిత్యం సుఖ సంతోషాలతో పాటు ఐశ్వర్య వ`ద్ధి కూడా జరుగుతుందని స్థానిక భక్తుల విశ్వాసం.

కైలాస గుహ

కైలాస గుహ

P.C: You Tube

ఇక ఇక్కడే కైలాస గుహ కూడా ఉంది. ద్వాపర యుగంలో అర్జునుడు పాతుపతాస్త్రం కోసం ఈ సూచీగిరికి తూర్పున ఉన్న ఇంద్రకీలాద్రి పై తపస్సు చేసిన విషయం మనకు తెలిసిందే. ఆ సమయంలో పరమేశ్వరుడు అర్జునిడి శక్తిసామర్థ్యాలు పరీక్షించదలుచుకొంటాడు.

 వరాహ రూపం దాల్చిన చోటు

వరాహ రూపం దాల్చిన చోటు

P.C: You Tube

ఆ సమయంలో మూకాసురుడు శివుడి ఆదేశాలను అనుసరించి వరాహరూపం దాల్చిన ప్రదేశమే ఈ కైలాస గుహ అని చెబుతారు. ఇక్కడే పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారని భక్తులు నమ్మకం. అందువల్లే జమలాపురం వెళ్లిన వారు ఖచ్చితంగా ఈ గుహను కూడా సందర్శిస్తుంటారు.

 అతి నిటారైన పర్వత శిఖరం

అతి నిటారైన పర్వత శిఖరం

P.C: You Tube

ఇదిలా ఉండగా ఇక్కడ వెలిసిన వేంకటేశ్వరుడికి ఉప్పల నారాయణ శర్మ పూజలు చేసేవాడు. అతి నిటారైన పర్వతశిఖరం పై భాగంలో ఉన్న వైకుంఠ గుహను రోజూ చేరుకొని అక్కడి దైవానికి ధూప, దీప నైవేద్యాలు సమర్పించేవాడు.

అక్కుభట్టు

అక్కుభట్టు

P.C: You Tube

ఈయన వంశంలోని ఆరవ తరం వాడే అక్కుభట్టు. ఆయన కూడా స్వామివారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించేవాడు. ఆయన కూడా వ`ద్యాప్యం వస్తుంది. వయస్సు మీద పడినా వేంకటేశ్వరుడి పూజకు మాత్రం ఎటువంటి లోటు రానించేవాడు కాదు.

నైవేద్యం

నైవేద్యం

P.C: You Tube

ఈ క్రమంలో ఒకరోజు దైవానికి పూజ చేసిన తర్వాత తాను ముసలివాడినవుతున్నానని ఇక కొండపైకి రాలేనని బాధపడుతాడు. అప్పుడు వేంకటేశ్వరుడు నీ బాధను అర్థం చేసుకొన్నాను. అయితే నీ నైవేద్యం స్వీకరించనిదే నేను ఉండలేనని చెబుతాడు.

వెనక్కు తిరిగి చూడకూడదు

వెనక్కు తిరిగి చూడకూడదు

P.C: You Tube

అందువల్లే తానే ఈ రోజు నీ వెంట మీ ఇంటివరకూ వచ్చి అక్కడే కొలువై ఉంటానని చెబుతాడు. అయితే తాను నీవెంట వచ్చే సమయంలో వెనక్కు తిరగకూడదని వేంకటేశ్వరుడు షరత్తు పెడుతాడు. ఇందుకు అక్కుభట్టు సంతోషంగా అంగీకరిస్తాడు.

పెద్ద శబ్దం

పెద్ద శబ్దం

P.C: You Tube

అయితే కిందికి వచ్చే సమయంలో ఒక చోట పెద్ద శబ్దం వస్తుంది. దీంతో అక్కుభట్టు వెనక్కు తిరిగి చూస్తాడు. ఈ పరిమాణంతో వేంకటేశ్వరుడు ఇక్కడ సాలగ్రామ ప్రతిమగా మారిపోతాడు. ఈ విషయం ఆ గ్రామ ప్రజలందరికీ తెలిసి అక్కడ ఓ దేవాలయాన్ని నిర్మిస్తాడు.

ఎక్కడ ఉంది.

ఎక్కడ ఉంది.

P.C: You Tube

ఇక సాలగ్రామ వేంకటేశ్వరుడి విగ్రహం వెనుక మానవ రూపంలోని వేంకటేశ్వరుడి విగ్రహాన్ని1975లో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఈ ఆలయం అభివ`ద్ధి చెందుతూ వస్తోంది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో ఉన్న జమలాపురం చేరుకోవడానికి రైలు, రోడ్డు మార్గాలు ఉన్నాయి.

ఎలా వెళ్లాలి

ఎలా వెళ్లాలి

P.C: You Tube

విజయవాడ నుంచి పాసింజర్ రైలు, హైదరాబాద్ నుంచి వచ్చే గోల్కొండ ఎక్స్ ప్రెస్ రైలు జమలాపురం దగ్గర్లోని ఎర్రుపాలెం స్టేషన్ల లో ఆగుతాయి. అక్కడి నుంచి జమలాపురానికి ఆటోలో చేరుకోవచ్చు. విజయవాడ నుంచి ఇక్కడికి 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+