Search
  • Follow NativePlanet
Share
» »రాణి పేరుతో ప్రసిద్ధి చెందిన అరసికెరె చుట్టూ ఉన్న పర్యాటక కేంద్రాలను చూశారా?

రాణి పేరుతో ప్రసిద్ధి చెందిన అరసికెరె చుట్టూ ఉన్న పర్యాటక కేంద్రాలను చూశారా?

కర్నాటకలోని ప్రముఖ పట్టణం అరసికెరె చుట్టు పక్కల ఉన్న పర్యాటక కేంద్రాలకు సంబంధించిన కథనం.

సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన కర్నాటక చారిత్రాత్మకంగా ఎంతో ప్రఖ్యాతి గాంచింది. చాలుక్యుల నుంచి హొయ్సళ వరకూ అనేక రాజ్యాలు ఈ కన్నడ రాజ్యాన్ని పాలించాయి. వారి పాలనలో భారతీయ శిల్పకళకు ప్రతీకలైన అనేక దేవాలయాలు నిర్మించారు.

అటువంటి దేవాలయాల్లో ఎన్నో ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయి. అదే సమయంలో ప్రాచూర్యానికి నోచుకోని అనేక దేవాలయాలు ఇప్పటికీ ఉన్నాయి. ఇందులో కొన్ని మహిమాన్వితమైన దేవాలయాలు కూడా ఉన్నాయి. అందులో ఒక దేవాలయంతో పాటు ఆ ప్రాంతానికి చుట్టు పక్కల ఉన్న మరికొన్ని చూడదగిన ప్రదేశాలకు సంబంధించిన కథనం.

అరసికెరె

అరసికెరె

P.C: You Tube

కన్నడలో అరసి అంటే రాణి అని అర్థం. హొయ్సళ రాజ్యానికి చెందిన ఓ ఓ రాణి నిర్మించిన చెరువు వల్ల హరసికెరె అని హాసన జిల్లాలోని ఓ పట్టణానికి పేరు వచ్చింది. అదే పేరుతో ఆ పట్టణాన్ని కూడా పిలవడం ప్రారంభించారు.

అరసికెరె

అరసికెరె

P.C: You Tube

అరసికెరే కొబ్బరికాయలకు చాలా ప్రాముఖ్యం చెందినది. బెంగళూరు నుంచి 166 కిలోమీటర్లు, హాసన నగర కేంద్రం నుంచి 44 కిలోమీటర్ల దూరంలో ఈ అరసికెరె ఉంటుంది. అరసికెరెకు సమీపంలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన బేలూరు, హళేబీడు, శ్రావణబెళగోళ తదితర పర్యాటక కేంద్రాలు ఉన్నాయి.

అరసికెరె

అరసికెరె

P.C: You Tube

ఇవి కాక మాలెకల్లు తిరుపతి అరసికెరె నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీనిని కర్నాటక రెండవ చిక్క అంటే చిన్న తిరుపతి అని అంటారు. దాదాపు వెయ్యి మెట్లు ఉన్న ఓ చిన్న గుట్ట మీద ఈ దేవాలయం ఉంది.

అరసికెరె

అరసికెరె

P.C: You Tube

ఇక కలమేశ్వర దేవాలయంలో కూడా ఈ అరిసికెరె చుట్టు పక్కల ఉన్న దేవాయాల్లో కలమేశ్వర దేవాలయం ప్రసిద్ధి చెందినది. ఈ దేవాలయం కట్టమేశ్వర, చంద్రమౌళేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు. ఇక అరసికెరె బస్ స్టేషన్ నుంచి కేవలం కూత వేటు దూరంలో బాలమురిగణపతి పేరుతో ప్రసిద్ధి చెందిన దేవాలయం ఉంది.

అరసికెరె

అరసికెరె

P.C: You Tube

ఈ దేవాలయాన్ని సందర్శించడం వల్ల కష్టాలన్నీ తొలిగిపోతాయని ప్రజలు నమ్ముతారు. అందువల్లే ఈ దేవాలయానికి ప్రతి రోజూ వచ్చే వారి సంఖ్య పెరుగుతూ ఉంది. అదేవిధంగా అరసికెరె నుంచి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో యాదాపుర అనే గ్రామం ఉంది.

అరసికెరె

అరసికెరె

P.C: You Tube

ఈ గ్రామంలోని చిన్న గుట్టమీద సిద్దేశ్వరస్వామి దేవాలయం ఉంది. ప్రతి పౌర్ణమికి ఈ చుట్టు పక్కల ఉన్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఈ దేవాలయాన్ని సందర్శిస్తుంటారు. ఇక్కడ ప్రతి రోజూ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంటారు.

అరసికెరె

అరసికెరె

P.C: You Tube

ఇక శిల్పకళకు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన హలేబీడు అరసికెర నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ హలేబీడు ఒకప్పుడు హోయ్సళ రాజధాని కూడా. ఇక్కడ చూడదగిన దేవాలయాల్లో హొయ్సళేశ్వర దేవాలయం, కేదారేశ్వర దేవాలయం, హులికరే కళ్యాణి, జైన బసదేవాలు ముఖ్యమైనవి.

అరసికెరె

అరసికెరె

P.C: You Tube

ఈ దేవాలయాల్లో చాలా వరకూ హొయ్సళ రాజు విష్ణువర్థన్ మంత్రిగా చెప్పబడే కేతమల్లు క్రీస్తుశకం 1121లో వీటిని నిర్మించాడని ఇక్కడ దొరికిన శాసనాల వల్ల తెలుస్తోంది. హొయ్సళేశ్వర దేవాలయం నిర్మాణంలో దాదాపు 20 వేల మంది కార్మికులు నిత్యం పాలు పంచుకొనేవారని చెబుతారు.

అరసికెరె

అరసికెరె

P.C: You Tube

ఈ దేవాలయం హొయ్సళ శైలి శిల్పాలతో పాటు ద్రావిడ శైలి శిల్పాలను కూడా మనం చూడవచ్చు. ఇక అరిసికెర నుంచి 45 కిలోమీటర్ల దూరంలో మనకు హళేబీడు కనిపిస్తుంది. మరో ప్రముఖ పర్యాటక కేంద్రం బేలూరు నుచి కేవలం 27 కిలోమీటర్ల దూరంలోనే ఈ అరసికెరె ఉంటుంది.

అరసికెరె

అరసికెరె

P.C: You Tube

హసన జిల్లాలోని ఈ బేలూరు-హళేబీడు ప్రపంచ ప్రసిద్ధి చెందినవి. బేళూరులోని చెన్నకేశవ దేవాలయం శిల్పకళా వైభవాన్ని ఎంత వర్ణించినా తక్కువే. ప్రతి ఏడాది వేల సంఖ్యలో ఇక్కడకు పర్యాటకులు వస్తుంటారు. యాగాచి నది ఒడ్డున ఉన్న బేలూరును పూర్వం వేలాపురి అనే పేరుతో పిలిచేవారు.

అరసికెరె

అరసికెరె

P.C: You Tube

ఈ చెన్నకేశవ దేవాలయంతో పాటు అద్భుత శిల్పకళ సంపదకు నిలయమైన సౌమ్యనాయకి, రంగనాయకి అమ్మవారి దేవాలయంతో పాటు కప్పచెన్నగిరాయ దేవాలయం కూడా ప్రాముఖ్యం చెందిన పర్యాటక ప్రాంతాలు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+