Search
  • Follow NativePlanet
Share
» »మన దేశంలోని 5500 అడుగుల ఎత్తులోని అగ్నిపర్వతం పేలక పోవడానికి కారణం ఆ మంత్రాలేనా?

మన దేశంలోని 5500 అడుగుల ఎత్తులోని అగ్నిపర్వతం పేలక పోవడానికి కారణం ఆ మంత్రాలేనా?

సిక్కింలో ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రం నామ్చి గురించి కథనం.

సముద్ర మట్టం నుంచి 5500 అడుగుల ఎత్తున ఉన్న నామ్చి సిక్కింలోని ఓ ధార్మిక క్షేత్రం. అంతేకాకుండా అత్యంత వేగంగా అభివద్ధి చెందుతున్న నగరాల్లో నామ్చి ముందు వరుసలో ఉంటుంది. ఛార్ దామ్ ప్రతిరూపాన్ని ఈ ధార్మిక క్షేత్రంలో చూడటానికి వేలమంది పర్యాటకులు వస్తూ ఉంటారు. అంతేకాకుండా గురుపద్మ సంభవకు సంబంధించిన అతి ఎతైన విగ్రహం కూడా ఈ క్షేత్రంలో ఉంది. ఇక ప్రకతి అందాలకు నిలయమైన ఈ క్షేత్రం సందర్శనతో మనసు పులికించిపోతుందని చెప్పడంలో అతిశయోక్తి కాదు.

నామ్చి

నామ్చి

P.C: You Tube

ఏడాదిలో ఎప్పుడైనా సందర్శించే పర్యాటక కేంద్రాలను భారత దేశంలో వేళ్లపైన లెక్కపెట్టవచ్చు. అటువంటి పర్యాటక కేంద్రాల్లో నామ్చి కూడా ఒకటి.

నామ్చి

నామ్చి

P.C: You Tube

అయితే మార్చి నుంచి అక్టోబర్ మధ్య కాలంలో పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో ఇక్కడకు వస్తుంటారు. నామ్చి ధార్మిక కేంద్రంగానే కాకుండా ప్రక`తి సంపదలకు నిలయం.

నామ్చి

నామ్చి

P.C: You Tube

అందువల్ల అటు వయస్సు మీదపడిన వారితో పాటు ఇటు యువకులు కూడా ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు.అంటే అన్ని వర్గాల వారికి ఈ క్షేత్రం పర్యాటకంగా అనుకూలమని చెప్పవచ్చు.

నామ్చి

నామ్చి

P.C: You Tube

ముఖ్యంగా నామ్చిలో రాంగిట్ పర్వత లోయ ప్రాంతం అత్యంత ఆకర్షణీయం. అరుదైన పుష్పలను చూడటానికి, వాటి పై పరిశోధనకు ఎక్కువ మంది ఇక్కటికి వస్తుంటారు.

నామ్చి

నామ్చి

P.C: You Tube

అదే విధంగా ప్రపంచంలో ఎత్తు విషయంలో మూడవ స్థానంలో ఉన్న కాంచన్ జంగ్ పర్వత శ్రేణి కూడా ఇక్కడ నుంచి చాలా అందంగా కనిపిస్తుంది.

నామ్చి

నామ్చి

P.C: You Tube

స్థానికుల కథనం ప్రకారం ఒక ప్రేతాత్మ ఇక్కడ తిరుగుతూ ఉంటుంది. వారు చెప్పే విషయాలను అనుసరించి పండె ఓంగ్మ అనే పేరుగల ఓ రాజకుమారి ఓ సన్యాసికి విషం ఇచ్చి చంపాలని విఫలయత్నం చేస్తుంది.

నామ్చి

నామ్చి

P.C: You Tube

అయితే ఈ విషయాన్ని పసిగట్టిన రాజు ఆ రాజకుమారికి మరణ దండన విధిస్తాడు. ఆమె ఇప్పుడు ప్రేతాత్మగా తిరుగుతూ ఉందని చెబుతారు

నామ్చి

నామ్చి

P.C: You Tube

ముఖ్యంగా ఇక్కడ సంద`స్య పేరుతో ఉన్న అగ్నిపర్వతాన్ని కొంతమంది బౌద్ధలు నిత్యం కొన్ని మంత్రాలతో శాంతపరుస్తూ ఉంటారు.

నామ్చి

నామ్చి

P.C: You Tube

ఒక్కరోజు వారు ఆ ప్రక్రియను నిర్వహించకపోయినా ఆ అగ్ని పర్వతం పేలి ఉత్తరభారత దేశం మొత్తం అగ్నికి ఆహుతి అవుతుందని చెబుతారు.

నామ్చి

నామ్చి

P.C: You Tube

రంగీట్ అనే నదీ పరివాహక ప్రాంతంలో సికిప్ అనే ప్రాంతం ఫిషింగ్ కు ప్రఖ్యాతి గాంచింది. ఈ సికిప్ పరివాహక ప్రాంతం మొత్తం ప్రక`తి సంపదలకు నిలయం.

నామ్చి

నామ్చి

P.C: You Tube

ఇక్కడ ఉన్న గురు పద్మసంబవ అనే స్థానిక సన్యాసి విగ్రహం కూడా ఆకర్షణాయంగా ఉంటుంది. మొత్తం 120 అడుగుల ఎతైన ఈ విగ్రహం చూడటానికే చాలా మంది ఇక్కడికి వస్తుంటారు.

నామ్చి

నామ్చి

P.C: You Tube

దలైలామా ఈ విగ్రహ నిర్మాణాన్ని 1997లో ప్రారంభించారు. దాదాపు ఏడేళ్ల పాటు సాగిన ఈ విగ్రహ నిర్మాణం 2004లో పూర్తయ్యింది.

నామ్చి

నామ్చి

P.C: You Tube

ఇక్కడ పూరి జగన్నాథ్, బదరీనాథ్, ద్వారకనాథ్, రామేశ్వరం ప్రతి రూపాలను ఒకే చోట చూడవచ్చు. దీంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఛార్ దామ్ క్షేత్రాలన్నింటినీ ఒకేచోట చూసిన అనుభూతి కలుగుతుంది.

నామ్చి

నామ్చి

P.C: You Tube

సిక్కింలో ఉన్న ప్రఖ్యాతిగాంచిన టీ తోట టెమి. 177 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ టీ తోట చూడటం ప్రత్యేక అనుభూతిని మిగులుస్తుందనడంలో అతిశయోక్తి లేదు.

నామ్చి

నామ్చి

P.C: You Tube

అదే విధంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ తోటలో పండిన టీకు అత్యంత ఎక్కువ డిమాండ్ ఉంది. ఇక్కడ ఉన్న మరో పర్యాటక కేంద్రం టెన్డాంగ్ పర్వత శిఖరం.

నామ్చి

నామ్చి

P.C: You Tube

సముద్రమట్టానికి 8530 అడుగుల ఎతైన ఈ పర్వత శిఖరం పై బౌద్ధ సన్యాసులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఇక్కడ కట్టడాలను చూడటానికే చాలా మంది పర్యాటకులు వెలుతూ ఉంటారు.

నామ్చి

నామ్చి

P.C: You Tube

సముద్రమట్టానికి 5500 అడుగుల ఎత్తున ఉన్న నామ్చి సిక్కి రాజధాని గాంగ్ టక్ నుంచి 78 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

నామ్చి

నామ్చి

P.C: You Tube

అదే విధంగా సిలిగురి నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి చేరుకోవడానికి అనేక సిక్కింలోని మిగిలిన ప్రాంతాల నుంచి బస్సు సర్వీసులు బాగున్నాయి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+