Search
  • Follow NativePlanet
Share
» »వీక్ ఎండ్ విశ్రాంతి - లైఫ్ టైం అనుభూతి!

వీక్ ఎండ్ విశ్రాంతి - లైఫ్ టైం అనుభూతి!

డిస్కవరీ విలేజ్ బెంగుళూరు కు 62 కి. మీ. ల దూరంలో స్వచ్చమైన నీరు, పొగ మంచు కొండలు, ఆసక్తి కల పురాతన చరిత్ర కల ప్రదేశంలో నిర్మించారు. మండు వేసవిలో కూడా చల్లని గాలులు. నంది హిల్స్ కు దిగువ భాగంలో కల ఈ రిసార్ట్ లో దిగితే, బెంగుళూరు చుట్టుపక్కల ఆకర్షణలు అన్నీ తేలికగా చూడవచ్చు. ఎల్లపుడూ ఎంతో బిజి గా వుండే బెంగుళూరు కు దూరంగా ఏ అలజడులు లేని ఒక ప్రశాంత, సుందర ప్రకృతి ఒడిలో కల ఈ డిస్కవరీ విలేజ్ మీ మైండ్ ను శరీరాన్ని కూడా ఒక్క మారు పునరుజ్జీవనం చేస్తుంది.

 నంది హిల్స్ డిస్కవరీ !


ఈ రిసార్ట్ లోని ఆహ్లాదకర మొక్కలు, ఇతర ప్రాణులు మీకు మీ స్వంత గ్రామీణ పరిసరాలలో ఉన్నట్లే భావించేలా చేస్తుంది. నంది హిల్స్ కు సంవత్సరం పొడవునా రక రకాల వలస పక్షులు కూడా వస్తూ వుంటాయి. కనుక ఇది మీకు మరొక మంచి అవకాశం కాగలదు.

నంది హిల్స్ కు సుమారు వేయి సంవత్సరాల చరిత్ర, శిల్ప శైలి కల నిర్మాణాలు కలవు. ఇవి మీ మైండ్ ను, శరీరాన్ని ఎంతో ఆహ్లాద పరచి, మరొక మారు, మీరు క్లాసు రూమ్ లలో చదువుకున్న లెసన్స్ గుర్తుకు వచ్చేలా చేస్తాయి. ఈ ప్రాంత పాలకులు గంగలు, చోళులు, హోయసలులు, చివరిగా పాలించిన విజయనగర రాజులు ఆ ప్రాంతాన్ని ఎంత అభివృద్ధి చేసారో తెలుస్తుంది. ఈ పాలకుల తర్వాత, ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ వారు హస్త గతం చేసుకున్నారు. ఈ రకంగా ఈ ప్రాంతానికి అనేక శతాబ్దాల చరిత్ర కలదు.

 నంది హిల్స్ డిస్కవరీ !

డిస్కవరీ విలేజ్ రిసార్ట్ ఒక ప్రశాంత మైన వాలీ లో ఉండటమే కాక ప్రకృతి మీకు ఇచ్చే ఆతిధ్యం కూడా అందిస్తుంది. నూతన బృంద కార్యకలాపాలకు ప్రయోగాత్మకతగా ఈ రిసార్ట్ ను ఇక్కడ ఏర్పరచారు. మీరు కార్పోరేట్ రంగం లోని ఒక టీమా లేక, కుటుంబ సమేతంగా విహారానికి వచ్చారా ? ఏదైనప్పటికీ, ఈ డిస్కవరీ విలేజ్ రిసార్ట్ మీకు ఒక అరుదైన పేకేజ్ అందించి ఆనందింప చేస్తుంది. ఎన్నో ప్రకృతి దృశ్యాలు, సాహస క్రీడలకు నెలవైన నంది హిల్స్ పక్కనే ఈ డిస్కవరీ విలేజ్ వ్యూహాత్మకంగా నిర్మించబడి, మీకు ఆనందం కలిగిస్తుంది.

డిస్కవరీ విలేజ్ లో వసతి ఎలా వుంటుంది ?
సౌకర్యవంతమైన కాటేజ్ లు అన్ని వసతులు కల కాన్ఫరెన్స్ హాళ్ళు, స్విమ్మింగ్ పూల్ మొదలైన వాటితో మీకు పూర్తి విశ్రాంతి కలిగిస్తుంది.
కనీస ప్రాధమిక సౌకర్యాలతో ఇక్కడ పది కాటేజ్ లు కలవు. మరీ ఎక్కువ మంది వచ్చినా సరే సరిపుచ్చ కలదు. ఇక్కడ ఒక పెద్ద కాన్ఫరెన్స్ హాల్ కలదు. ఇది సుమారు వందమందికి సైతం ఒకేసారి వసతి నివ్వగలదు. దీనిని అవసరాలను బట్టి ఒక మల్టీ పర్పస్ హాలుగా వాడవచ్చు.

 నంది హిల్స్ డిస్కవరీ !

ఈ రిసార్ట్ లో సౌకర్యాలు ఏమేమి కలవు
ఈ రిసార్ట్ లో మీకు అవసరమైన ఎన్నో సౌకర్యాలు కలవు. కంపెనీల మీటింగ్ ల నుండి, శిక్షణ నిచ్చే వర్క్ షాపులు, కుటుంబ విహారాలు, ఫ్యామిలీ పార్టీలు, వివాహాలు వంటివి ఎన్నో కార్యక్రమాలు చేసుకొనవచ్చు. డిన్నర్ పార్టీలకు ప్రత్యేక బార్బెక్యూ, బోన్ ఫైర్ ప్రదేశం వంటివి కలవు.

మీకు ఆహారాలు అమిత ఇష్టమా ? ఎన్నో ఐటెం లు కావలసినన్ని తినండి, తాగండి, రిలాక్స్ అవండి. డిస్కవరీ విలేజ్ మీకు రుచికరమైన వెజ్ లేదా నాన్ వెజ్ వంటకాలు నార్త్ లేదా సౌత్ ఇండియా వంటకాలు అందిస్తుంది.

డిస్కవరీ విలేజ్ లో ఇంకా ఏమి చేయవచ్చు ?
మీరు అడ్వెంచర్ లవరా ? ఇక్కడ మీకు ఆనందించేందుకు రోప్ కోర్సు, ట్రెక్కింగ్, రాపెల్లింగ్, సర్వివాల్ కేమ్పింగ్, జ్యో కేచింగ్, నైట్ నావి గేషన్, టార్గెట్ షూటింగ్, అర్చరీ, వంటి క్రీడలు ఎన్నో కలవు. కేరమ్స్, టేబుల్ టెన్నిస్ వంటి ఇండోర్ గేమ్స్ కూడా కలవు. క్రికెట్, వాలీ బాల్, ఫుట్ బాల్, బాడ్మింటన్ లు కూడా కలవు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+