Search
  • Follow NativePlanet
Share
» »పింక్‌సిటికి ఆ పేరేలా వ‌చ్చిందో తెలుసా?

పింక్‌సిటికి ఆ పేరేలా వ‌చ్చిందో తెలుసా?

పింక్‌సిటికి ఆ పేరేలా వ‌చ్చిందో తెలుసా?

భారతదేశం సంస్కృతి సంప్ర‌దాయాల‌తో పాటు తన అందానికి కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉండటమే కాదు. ఇక్కడి ఆహారం మరియు వస్ర్త‌ధార‌ణ కూడా చాలా కాలంగా ప్రజలను ఆకర్షిస్తున్నాయి. ఇక్కడ ప్రతి రాష్ట్రం మరియు నగరానికి దాని స్వంత ప్రత్యేక సంస్కృతి మరియు సంప్రదాయాలు ఉన్నాయి. భారతదేశంలోని ఈ రాష్ట్రాల్లో రాజస్థాన్ ఒకటి. ఇక్కడ సంస్కృతి మరియు సంప్రదాయాలు ప్రజలలో బాగా ప్రాచుర్యం పొందాయి.

\ఈ ప్రాంతంలో అత్యుత్తమ సంస్కృతి మరియు చారిత్రక వారసత్వాన్ని చూడటమే కాకుండా రుచికరమైన వంటకాలను కూడా రుచి చూడొచ్చు. రాజస్థాన్ రాజధాని జైపూర్ దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా గొప్ప సంస్కృతికి ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదేశం యొక్క అందానికి ఆకర్షితులై, ప్రపంచం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో పర్యాటకులు ప్రతి సంవత్సరం ఇక్కడికి త‌ర‌లి వ‌స్తుంటారు.

citypalace1

ఈ నగరాన్ని పింక్ సిటీ అని కూడా అంటారు. జైపూర్‌ని చాలా కాలంగా ఈ పేరుతో పిలుస్తున్నారు. అయితే ఈ పేరు వెనుక ఉన్న కథ ఏమిటో మీకు తెలుసా. వాస్తవానికి, జైపూర్ గులాబీ నగరం కావడం వెనుక ఉన్న చారిత్రక కథ ఏమిటో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు? కాబట్టి జైపూర్ పింక్ సిటీగా మారిన ఆసక్తికరమైన చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప‌దండి.

రాజు జైపూర్ నగరాన్ని నిర్మించాడు

జైపూర్ నవంబర్ 18, 1927న కచ్వాహా రాజవంశానికి చెందిన మహారాజా సవాయి జై సింగ్ II చే స్థాపించబడింది. అతను ఈ నగరాన్ని స్థిరపరచడంలో బెంగాల్ వాస్తుశిల్పి విద్యాధర్ భట్టాచార్య సహాయం తీసుకున్నాడు. ఈ రాజస్థాన్ నగరం సూర్యుని ఏడు గుర్రాల ఆధారంగా ఏడు ద్వారాలు మరియు ప్రాకారాలతో చుట్టుముట్టబడి ఉంది. మ‌హారాజు శ్రీ కృష్ణ భగవానుడి యొక్క అమితమైన భక్తుడు కావ‌డంతో ఈ ద్వారాలలో ఒకదానికి కృష్ణపాల్ అని పేరు పెట్టారు.

jainiwasgarden1

దీనిని ఇప్పుడు అజ్మేరీ గేట్ అని పిలుస్తున్నారు. అంతేకాకుండా, నగరం మధ్యలో ఒక చతురస్రాన్ని మరియు చెరువును నిర్మించారు. దీనిని తాల్కతోరా అని పిలుస్తారు. దీంతో పాటు, జైపూర్‌లో ఇంకా చూసేందుకు సిటీ ప్యాలెస్, జైనివాస్ గార్డెన్, రాజ్‌ మహల్ వంటి అనేక ప‌ర్యాట‌క ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి.

నగరానికి 'జైపూర్' అనే పేరు ఎలా వచ్చింది?

ఈ నగరానికి జైపూర్ పేరు రావడం వెనుక కూడా ఓ ఆసక్తికరమైన కథనం ఉంది. ఈ నగరాన్ని సవాయి జై సింగ్ స్థాపించారు కాబట్టి ఈ నగరాన్ని జైపూర్ అని పిలిచేవారు. మరోవైపు, నగరం పింక్ సిటీగా మారడం గురించి మాట్లాడుకోవాలి. ఈ నగరానికి ప్రిన్స్ ఆల్బర్ట్ పింక్ సిటీ అని పేరు పెట్టాడని ఇక్క‌డివారు నమ్ముతారు. నిజానికి, 1853వ సంవత్సరంలో బ్రిటన్ రాణి ఎలిజబెత్ మరియు వేల్స్ యువరాజు ఆల్బర్ట్ జైపూర్‌ను సందర్శించారు. ఆ స‌మ‌యంలో మహారాజా సవాయి రామ్ సింగ్, ఇద్దరినీ స్వాగతించే సన్నాహాల్లో నిమగ్నమై, నగరం మొత్తాన్ని ఎంతో అందంగా అలంక‌రించారు.

jaipur1

జైపూర్ 'పింక్ సిటీ'గా మారింది.

ఆ అలంక‌ర‌ణ‌లో భాగంగా నగరానికి ఒకే రంగు వేయకూడదనే ఆలోచన మహారాజుకి వచ్చింది. తన ఆలోచనతో ముందుకు సాగి, ఉన్నతాధికారులతో చర్చించి, నగరం మొత్తాన్ని పింక్ కలర్‌తో చిత్రించారు. జైపూర్ సంద‌ర్శ‌నార్థం వ‌చ్చిన‌ ప్రిన్స్ ఆల్బర్ట్ రాజు ఇచ్చిన ఆతిథ్యాన్నిమరియు నగరం యొక్క గులాబీ దృశ్యాన్ని చూసి ఆశ్చ‌ర్య‌పోయారు. జైపూర్ న‌గ‌ర అందాల‌ను చూడగానే, అతని నోటి నుండి పింక్ సిటీ అనే పేరు వచ్చింది. అప్పటి నుంచి జైపూర్‌కి పింక్ సిటీ అనే పేరు వచ్చింద‌ని చ‌రిత్ర చెబుతోంది.

More News

    Read more about: city palace jainiwas garden
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+