Search
  • Follow NativePlanet
Share
» »సూరత్‌లో పేరుపొందిన ప‌ర్యాట‌క ఆక‌ర్ష‌ణ‌లు మీకు తెలుసా?!

సూరత్‌లో పేరుపొందిన ప‌ర్యాట‌క ఆక‌ర్ష‌ణ‌లు మీకు తెలుసా?!

సూరత్‌లో పేరుపొందిన ప‌ర్యాట‌క ఆక‌ర్ష‌ణ‌లు మీకు తెలుసా?!

దేశంలోని తొమ్మిద‌వ అతిపెద్ద నగరంగా.. గుజరాత్‌లో రెండవ అతిపెద్ద నగరంగా ఉంది సూరత్. ప్రపంచంలోని తొంభైశాతానికి పైగా వజ్రాలు ఇక్కడే క‌ట్ చేసి, పాలిష్ చేయబడ‌తాయి. అందుకే ఈ న‌గ‌రానికి "ది డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా" అనే మారుపేరు వచ్చింది.

ఇది గుజరాత్ యొక్క ప్రధాన పారిశ్రామిక కేంద్రాలలో ఒకటి. ఇది ఒక ముఖ్యమైన వస్త్ర తయారీ మరియు విస్తరిస్తున్న ఐటీ కేంద్రం. ఇక్క‌డి ప‌ర్య‌ట‌న‌లో చూడద‌గిన ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌ను ప‌రిశీలిద్దాం.

మొఘల్ సరాయ్

మొఘల్ సరాయ్

నేటికీ, "మొఘల్ సరాయ్" అనే పదం చారిత్ర‌క నేప‌థ్యానికి ప్ర‌తీక‌గానే నిలిచిపోతుంది. కాబట్టి మొఘల్ యుగంలో నడవడం ఎలా ఉంటుంద‌నే అనుభూతిని పొందేందుకు ప్రజలు ఈ భవనానికి తండోపతండాలుగా వెళతారు. చావడిగా ఉపయోగించబడిన ఈ భవనంలో ఇప్పుడు అనేక సూరత్ మునిసిపాలిటీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయాలకు నిల‌యంగా మారింది. ఇక్క‌డి తోరణాలపై అద్భుతమైన కళాకృతులు మరియు నైపుణ్యం కలిగిన శిల్పాలు మొఘల్ చరిత్ర యొక్క వైభవాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాయి. ఈ పరిసరాల్లో అనేక మోడ్ర‌న్‌ కేఫ్‌లు, రెస్టారెంట్లు సాంప్రదాయ గుజరాతీ ఆహారాన్ని అందిస్తాయి.

దూరం: సూరత్ విమానాశ్రయం నుండి 13.6 కిలోమీట‌ర్లు

సందర్శించడానికి ఉత్తమ సమయం: అక్టోబర్-మార్చి

సమయాలు: 24 గంటలు

ఎలా చేరుకోవాలి: మీరు గమ్యస్థానానికి చేరుకోవడానికి బస్సు లేదా టాక్సీ/ఆటో ఎక్కవచ్చు.

ఖుదావంద్ ఖాన్ సమాధి

ఖుదావంద్ ఖాన్ సమాధి

సూరత్‌లో అత్యంత గౌర‌వాన్ని పొందిన‌ గవర్నర్‌లలో ఒకరైన ఖుదావంద్ ఖాన్ చక్లాబజార్‌కు సమీపంలో ఉన్న సమాధి వద్ద ఖననం చేయబడ్డారు. అతను సూర‌త్‌ను వాణిజ్య కేంద్రంగా ప్రమోట్ చేయడానికి గణనీయమైన కృషి చేసాడు. సమాధి యొక్క నిర్మాణం ఎంతో భిన్నంగా ఉంటుంది. ఇందులో అందమైన ఇస్లామిక్ చెక్కడాలు ఉన్నాయి. సూరత్‌లోని అత్యంత ప్రసిద్ధ షాపింగ్ ప్ర‌దేశాల‌లో ఒకటి ఇక్క‌డికి పొరుగున ఉన్న చక్లా బజార్. ఇక్కడ గాజులు, క్లాత్‌ పర్సులు మరియు సాంప్రదాయ బంధాని దుపట్టాలను స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌కు పొందవచ్చు.

దూరం: సూరత్ విమానాశ్రయం నుండి 14.1కిలోమీట‌ర్లు

సందర్శించడానికి ఉత్తమ సమయం: అక్టోబర్-మార్చి

సమయాలు: సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు

ఎలా చేరుకోవాలి: మీరు గమ్యస్థానానికి చేరుకోవడానికి బస్సు లేదా టాక్సీ/ఆటో ఎక్కవచ్చు.

డుమాస్ బీచ్

డుమాస్ బీచ్

సూరత్‌లోని డుమాస్ బీచ్ వింత కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందింది. స్థానికులు మరియు అతిథులు రాత్రి సమయంలో తీరప్రాంతం వెంబడి దెయ్యాలు తిరుగుతున్నాయ‌ని చెప్పుకొచ్చారు. రాత్రిపూట అరుపులు, వింత నవ్వులు మరియు విచిత్రమైన శబ్దాలు అన్నీ సాక్షులచే రికార్డ్ చేయబడ్డాయి. డుమాస్ బీచ్‌లో కొంత‌మంది వ్యక్తులు అనేక సందర్భాల్లో అదృశ్యమైనట్లు చెబుతారు. మీరు పగటిపూట వెళితే పొడవైన తీర‌పు నడక మార్గాలను సద్వినియోగం చేసుకోవ‌చ్చు. అంతేకాదు, అక్కడ లభించే భజియా మరియు టొమాటో పురీని రుచిచూడొచ్చు.

దూరం: సూరత్ విమానాశ్రయం నుండి 6.7 కిలోమీట‌ర్లు

సందర్శించడానికి ఉత్తమ సమయం: అక్టోబర్-మార్చి

సమయాలు: 07:00 AM నుండి 05:00 PM వరకు

ఎలా చేరుకోవాలి: మీరు గమ్యస్థానానికి చేరుకోవడానికి బస్సు లేదా టాక్సీ/ఆటో ఎక్కవచ్చు.

డచ్ గార్డెన్

డచ్ గార్డెన్

సూరత్‌లో ఎక్కువమంది ప‌ర్యాట‌కులు సందర్శించే ప్రదేశాలలో డచ్ గార్డెన్స్ ఒకటి. వ్యాపార నిమిత్తం సూరత్‌కు వెళ్లిన బ్రిటీష్, అర్మేనియన్ మరియు డచ్ అధికారుల సమాధులను ఇక్కడ చూడవచ్చు.

క్రిస్టోఫర్ మరియు జార్జ్ ఆక్సెండెన్ స‌మాధులు నిర్మాణ‌శైలి చూప‌రుల మ‌న‌సును క‌ట్టిప‌డేస్తాయి. బారన్ అడ్రియన్ వాన్ రీడ్ యొక్క సమాధి, పక్కనే ఉన్న ఆంగ్లికన్ చర్చి మరియు పూర్వపు బ్రిటీష్‌ కర్మాగారాన్ని సందర్శించడం అస్స‌లు మిస్స‌వ్వ‌కూడ‌దు. ఇక్క‌డి విస్తార‌మైన మైదానాలు యూరోపియన్ పద్ధతిలో నిర్మించబడ్డాయి. సూరత్ నివాసితులు ఈ ప్రాంతాన్ని జాగింగ్‌కు ఉపయోగిస్తారు.

దూరం: సూరత్ విమానాశ్రయం నుండి 12 కిలోమీట‌ర్లు
సందర్శించడానికి ఉత్తమ సమయం: అక్టోబర్-మార్చి

సమయాలు: 06:00 AM నుండి 12:00 PM మరియు 03:00 PM నుండి 10:00 PM వరకు

ఎలా చేరుకోవాలి: మీరు గమ్యస్థానానికి చేరుకోవడానికి బస్సు లేదా టాక్సీ/ఆటో ఎక్కవచ్చు.

More News

Read more about: tourist places in surat
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+