Search
  • Follow NativePlanet
Share

సూరత్ – యోగులతో కూడిన ప్రకాశవంతమైన భూమి !

45

గుజరాత్ రాష్ట్రంలో నైరుతి వైపు నెలకొని ఉన్న సూరత్ నేడు వస్త్రాలకు, వజ్రాలకు పేరుగాంచింది. వైభవ౦, ఆడంబరాల మాటున ఈ నగరం గొప్ప చారిత్రక ప్రాధాన్యతను, కీర్తిని కూడా కలిగిఉంది.

గత వైభవం

క్రి.శ.990 లో, సూరత్ నగరం సూర్యదేవుని నగరం సూర్యాపూర్ గా పిలువబడేది. తరువాత పార్సీలు 12వ శతాబ్దంలో ఇక్కడ స్థిరపడ్డారు. మరికొంత కాలానికి సూరత్ ను కుతుబుద్దీన్ ఐబక్ ఆక్రమించే వరకు పాశ్చాత్య చాళుక్యుల సామ్రాజ్యంలో ఒక భాగంగా ఉంది. 1514 నాటికి గుజరాత్ సుల్తానత్ కి ముఖ్య అధికారిగా ఉన్న గోపి అనే పేరుగల బ్రాహ్మణుడు వ్యాపారులు సూరత్ లో స్థిరపడడానికి ఒప్పించడం వల్ల ఇది ఒక ప్రధాన వాణిజ్య కేంద్రంగా అభివృద్ధికి దారితీసింది. నగర భద్రతకు సుల్తానత్ ఒక గోడను నిర్మించారు, ఇప్పటికీ అక్కడ దాని అవశేషాలు కనిపిస్తాయి. మొఘల్ చక్రవర్తులైన అక్బర్, జహంగీర్, షాజహాన్ కాలంలో మొఘల్ వాణిజ్యానికి ముఖ్యమైన నౌకాశ్రయం అభివృద్ది చెందింది. భారతదేశానికి వాణిజ్య కేంద్రంగా మారిన ఈ పట్టణం లో బ్రిటిష్ వారు నాణేల ముద్రణ శాల ఇక్కడ స్థాపించబడింది. హజ్ యాత్రకు మక్కా వెళ్ళే ముస్లిం మతస్థులు బయలుదేరే ప్రదేశమే సూరత్ పోర్ట్.

బ్రిటీష్ కాలంలో, ఈస్ట్ ఇండియా కంపెనీ వారు నౌకలకు ఈ రేవు లో వసతులను ప్రారంభించారు. సూరత్ వర్తక కేంద్రంగానే కాకుండా, భారతదేశం నుండి వచ్చే ప్రయాణీకులకు ఒక రవాణా కేంద్రంగా కూడా మారింది. బ్రిటీషు వారి వర్తక కేంద్రం బాంబే కి మారెంతవరకు సూరత్ భారతదేశం లోని అత్యంత సంపన్న నగరాలలో ఒకటిగా ఉంది. తరువాత, క్రమంగా సూరత్ వైభవం క్షీణించింది.

నగరం

సూరత్ ప్రపంచంలో వజ్రాలు, వస్త్రాల వ్యాపారానికి ప్రసిద్ధ కేంద్రంగా పేరుగాంచింది. ప్రపంచ మార్కెట్ లోని అన్ని వజ్రాలూ 92% వరకు సూరత్ లోనే కోసి, మెరుగుపెట్టబడతాయి. భారతదేశం లో ఏ నగరంలో లేని ఎంబ్రాయిడరీ యంత్రాలు అత్యధిక సంఖ్యలో ఇక్కడ ఉంటాయి కావున దీనిని “భారతదేశ ఎంబ్రాయిడరీ రాజధాని” గా పిలుస్తారు. ఒక ప్రపంచ వ్యాప్త అధ్యయనం ప్రకారం ఇది ప్రపంచంలో వేగంగా అభివృద్ది చెందుతున్న నగరాలలో నాల్గవ స్థానంలో ఉంది. ఈ వ్యాపార అంశాల కారణంగా, ఈ నగరం గుజరాత్ వాణిజ్య రాజధానిగా భావించబడుతుంది.

సూరత్ వజ్రాలు

1901లో వజ్రాలు కత్తిరించే గుజరాతీయులు తమ సొంత దేశంలో స్థానిక ప్రరిశ్రమ స్థాపన కోసం తూర్పు ఆఫ్రికా వచ్చేసారు, ఇది విజయవంతమైన తరువాత సూరత్ 1970లో వజ్రాలను యుఎస్ కి ఎగుమతి చేయడం ప్రారంభించారు. నేడు సూరత, ప్రపంచ వజ్రాల మార్కెట్ లోనే ప్రసిద్ది గాంచింది, భవిష్యత్తులో మరింత పెద్ద మెరుగులతో, విలువైన రాళ్ళతో అభివృద్ది చెందుతుంది.

భౌగోళిక స్థితి

సూరత్ కి ఉత్తరాన కోసా౦బా, దక్షిణాన బిల్లిమోరా, తూర్పున తపతి, పశ్చిమాన గల్ఫ్ కాంబే నదులు ఉన్నాయి. సూరత్ జిల్లాకి ఉత్తరాన భరుచ్, నర్మదా జిల్లాలు, దక్షిణాన నవ్సారి, డాంగ్ జిల్లాలు ఉన్నాయి. గాంధీనగర్ సూరత్ నుండి ఉత్తరం వైపు 284 కిలోమీటర్ల దూరంలో ఉంది.

వాతావరణం

సూరత్ ఉష్ణమండల సవన్నా వాతావరణాన్ని కలిగిఉంటుంది. అరేబియన్ సముద్రం ఉండడం వల్ల ఇక్కడ వాతావరణం అత్యంత ప్రభావాన్నికలిగిఉంటుంది. జూన్ తరువాత నుండి సెప్టెంబర్ చివరి వరకు అత్యధిక వర్షపాతం ఉంటుంది. వేసవి మార్చ్ తో ప్రరంభమై జూన్ వరకు ఉంటుంది, ఏప్రిల్, మే అత్యధిక వేడిగా ఉండే మాసాలు. అక్టోబర్ నుండి నవంబర్ చివరి వరకు తీవ్రమైన ఉష్ణోగ్రతలు ఉంటాయి. శీతాకాలం డిసెంబర్ లో మొదలై ఫిబ్రవరి చివరి వరకు ఉంటుంది.

అనుసంధానం

ఈ నగరం ఎస్ ఎమ్ ఎస్ ఎస్ బస్సు సర్వీసును కలిగి ఉంది. ఈ బస్సులు సి ఎన్ జి ఇంధనాన్ని ఉపయోగిస్తాయి, ప్రయాణానికి చెందిన అన్ని వివరాలను ఎల్ సి డి స్క్రీన్ లు అందిస్తాయి.

జనాభా వివరాలు

సూరత్ లో ప్రధానంగా గుజరాతి, సింది, హిందీ, మార్వాడీ, మరాఠీ, తెలుగు, ఒరియా భాషలు మాట్లాడతారు. సూరత్ లో వలస జనాభా 70% కంటే ఎక్కువమంది ఉంటారు. ఇది ఇప్పటికీ జైనులకు, పరసీలకు కేంద్రబిందువు. సూరత్ లోని ప్రజలను సూరతీస్ అంటారు. సూరతీలు ప్రత్యేకమైన లక్షణాలతో, ప్రత్యేకమైన యాసతో వేరుగా ఉంటారు. సూరతీలు హాస్య ప్రేమికులు, ఆహారంపై మక్కువతో తేలిక మనస్తత్వాన్ని కలిగిఉంటారు.

సంస్కృతీ, పండుగలు

గుజరాత్ అంతటా సూరతీ కారపు వంటకాలకు ప్రసిద్ది చెందింది, అంతేకాకుండా ఇక్కడ రుచికరమైన ప్రత్యెక తినుబండారాలను కూడా తయారుచేస్తారు. ఒక ప్రత్యెక తీపి పదార్ధం ఘారి, లోకో, ఉందియు, రసావాలా ఖామన్, సూర్తి చైనీయుల ప్రసిద్ధ సూర్తి వంటకాలు ఉన్నాయి. గుజరాత్ లోని మాంసాహార భోజనానికి సూరత్ మినహాయింపు.

అన్ని పండుగలను ఏంతో ఉత్సాహంతో జరుపుకునే నగరం సూరత్. నవరాత్రి తో ప్రారంభమై, దీపావళి, వినాయక చవితి, “మకర సంక్రాంతి” సమయంలో గాలిపటాలు ఎగరేసే పండుగ అన్నీ సూరత్ లో ప్రసిద్ధ పండుగలు. అక్టోబర్ నెలలో వచ్చే నిండు పౌర్ణమి “శరద్ పౌర్ణమి” తరువాతి రోజు జరుపుకునే చండి పాడవో కూడా సూర్తీలకు మరో ఇష్టమైన పండుగ. ఆరోజు, సూరతీలు ఘారి, రుచికరమైన అనేక ఇతర సూర్తి పదార్ధాలను కొనుగోలు చేస్తారు.

చూడదగ్గ ప్రదేశాలు

పార్సీ అగియారి, మార్జన్ శామి రోజా, చింతామణి జైన్ మందిరం, వీర్ నర్మద్ సరస్వతి మందిరం, గోపి చెరువు, నవ సయ్యద్ మసీదు, రాండర్, జామా మసీదు, నావ్సరి, బిలిమోర, ఉద్వాడా, సూరత్ కోట మొదలైనవి సూరత్ లో చూడదగ్గ ప్రధాన ప్రాంతాలు.

ఈ నగరాన్ని సందర్సించేవారికి సూరత్ అనేక అనుభవాలను అందిస్తుంది.

 

 

Powered by 

సూరత్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

సూరత్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం సూరత్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? సూరత్

  • రోడ్డు ప్రయాణం
    సూరత్ కు దేశం లోని వివిధ ప్రాంతాల నుండి బస్సు లు కలవు. అనేక రహదారులకు కలుపబడి వుంది. నగరం లో స్థానిక బస్సు లు సి ఎన్ గి గ్యాస్ పై నడుస్తాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    సూరత్ కు రైల్ స్టేషన్ కలదు. ఈ రైలు స్టేషన్ నుండి దేశం లోని వివిధ ప్రాంతాలకు రైళ్ళు కలవు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    సూరత్ కు 11 కి. మీ.ల దూరం లో మగ్దాల వద్ద ఎయిర్ పోర్ట్ కలదు. ఇక్కడ నుండి దేశం లోని అన్ని ప్రదేశాలకూ విమాన ప్రయాణం చేయవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun