Search
  • Follow NativePlanet
Share
» »కర్ణాట‌క‌లోని పుణ్య‌క్షేత్రాల‌కు వెళ్లాల‌నుకుంటున్నారా..? ఈ ప్యాకేజీ మీకోస‌మే..!

కర్ణాట‌క‌లోని పుణ్య‌క్షేత్రాల‌కు వెళ్లాల‌నుకుంటున్నారా..? ఈ ప్యాకేజీ మీకోస‌మే..!

క‌ర్ణాట‌క‌లోని ప్ర‌సిద్ధ‌పుణ్య‌క్షేత్రాల‌ను చూడాల‌నుకునేవారికి ఐఆర్‌సిటిసి ఓ స‌రికొత్త టూర్ ప్యాకేజీనీ అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా హైద‌రాబాద్ టు క‌ర్ణాట‌క ప్ర‌యాణం ఉంటుంది. ఈటూర్ మొత్తం ఆరురోజులు ఉంటుంది. ఈ టూర్ లో భాగంగా కర్ణాటకలోని ధర్మస్థల, మంగుళూరు, శృంగేరి, ఉడిపి, కుక్కే సుబ్రమణ్య క్షేత్రాలను దర్శించుకోవచ్చు. డివైన్ కర్ణాటక పేరుతో ఐఆర్‌సిటిసి ఈ టూర్ ప్యాకేజీని ప‌ర్యాట‌కుల‌కు అందుబాటులోకి తెచ్చింది. ఇది ట్రైన్ జ‌ర్నీ. హైద‌రాబాద్ నుంచి ట్రైన్ బ‌య‌లుదేరుతోంది.

ఆరురోజుల టూర్ షెడ్యూల్‌..

మొద‌టి రోజు మంగళవారం 12789 అనే నెంబ‌ర్‌గ‌ల ట్రైన్ కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 06:05 గంటలకు బ‌య‌లుదేరుతుంది. రాత్రంతా జ‌ర్నీ ఉంటుంది. మ‌రుస‌టి రోజు ఉదయం 09:30 గంటలకు రైలు మంగళూరు సెంట్రల్ చేరుకుంటుంది. రైల్వే స్టేషన్ లో పర్యాటకులను పికప్ చేసుకుని ఉడిపికి తీసుకెళ్తారు. హోటల్‌లో చెక్ ఇన్ చేస్తారు. అనంతరం శ్రీ కృష్ణ దేవాలయం, మల్పే బీచ్ సంద‌ర్శ‌న ఉంటుంది. ఆ రాత్రికి ఉడిపిలో స్టేయింగ్ ఉంటుంది. అనంత‌రం మూడోరోజు

dharmasthala

హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి శృంగేరికి ప్ర‌యాణం ఉంటుంది. శృంగేరిలోని శారదాంబ ఆలయ ప‌ర్య‌ట‌న ఉంటుంది. అనంత‌రం మంగుళూరుకు ప్ర‌యాణం ఉంటుంది. మంగుళూరు చేరుకుని హోటల్‌లో చెక్ ఇన్ అవుతారు. ఆ రాత్రంతా మంగుళూరులో బస చేస్తారు. ఆ మ‌రుస‌టి రోజు ఉదయం మంజునాథ ఆలయాన్ని సందర్శన నిమిత్తం ధర్మస్థలానికి ప్ర‌యాణం ఉంటుంది. ఆ త‌ర్వాత కుక్కే సుబ్రహ్మణ్యానికి వెళ్తారు. సాయంత్రం తిరిగి మంగుళూరు చేరుకుంటారు. అక్క‌డే నైట్ స్టేయింగ్ ఉంటుంది.

ఐదోరోజు మంగుళూరులోని ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రాలైన మంగళ దేవి ఆలయం, కద్రి మంజునాథ దేవాలయం సందర్శ‌న ఉంటుంది. అక్క‌డ షాపింగ్ చేసుకునేందుకు కూడా సౌక‌ర్యం ఉంటుంది. సాయంత్రం తన్నెరభావి బీచ్, కుద్రోలి గోకర్నాథ ఆలయాన్ని సందర్శ‌న ఉంటుంది. అదే రోజు రాత్రి 7:00 గంటలకు మంగుళూరు సెంట్రల్‌ రైల్వేస్టేషన్ లో డ్రాప్ చేస్తారు. 12790 అనే ట్రైన్‌నెంబ‌ర్‌లో తిరిగి హైదరాబాద్ కు రాత్రి 08:05 గంటలకు బయలుదేరతారు. రాత్రంతా ప్ర‌యాణం ఉంటుంది. ఆ మ‌రుస‌టి రోజు
రాత్రి 11:40 గంటలకు కాచిగూడ చేరుకోవ‌డం మీ టూర్ ముగుస్తుంది. ప‌ర్యాట‌కులు ఇత‌ర పూర్తి వివ‌రాల కోసం ఐఆర్‌సిటిసి అధికారిక వెబ్‌సైట్‌ను సంప్ర‌దించ‌గ‌ల‌రు.

udupikrishanamata

టూర్ ధ‌ర‌లివే..

ఒక్కో వ్యక్తికి ప్యాకేజీ టారిఫ్ (1 నుంచి 3 మంది) కంఫర్ట్(3A) సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.37350 చెల్లించాలి. డబుల్ ఆక్యుపెన్సీ అయితే రూ.21920 ఇవ్వాలి ఉంటుంది. అదే ట్రిపుల్ ఆక్యుపెన్సీ అయితే రూ.17690 చెల్లించాలి. చైల్డ్ విత్ బెడ్ (5-11 సంవత్సరాలు) రూ.10220 నిర్ణ‌యించారు. చైల్డ్ వితవుట్ బెడ్(5-11 సంవత్సరాలు) రూ.9110 చెల్లించాలి.

స్టాండర్ట్(SL) సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.34360 చెల్లించాలి. డబుల్ ఆక్యుపెన్సీ అయితే రూ.18920గా నిర్ణ‌యించారు. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.14700 ఉంటుంది. చైల్డ్ విత్ బెడ్ (5-11 సంవత్సరాలు) రూ.7230 చెల్లించాల్సి ఉంటుంది. చైల్డ్ వితవుట్ బెడ్(5-11 సంవత్సరాలు) రూ.6110 గా నిర్ణ‌యించారు.

ukkesubramanyaksetram

ఒక్కో వ్యక్తికి ప్యాకేజీ టారిఫ్ (4 నుంచి 6 మంది) కంఫర్ట్(3A) డబుల్ ఆక్యుపెన్సీ రూ.18890 చెల్లించాలి. ట్రిపుల్ ఆక్యుపెన్సీ రూ.16800గా నిర్ణ‌యించారు. చైల్డ్ విత్ బెడ్(5-11 Years) రూ.11190 చెల్లించాల్సి ఉంటుంది. చైల్డ్ వితవుట్ బెడ్(5-11 years) రూ.9800 చెల్లించాలి.

స్టాండర్డ్(SL) డబుల్ ఆక్యుపెన్సీ రూ.15890చెల్లించాలి. ట్రిపుల్ ఆక్యుపెన్సీ రూ.13800గా నిర్ణయించారు. చైల్డ్ విత్ బెడ్ (5-11 Years) రూ.8200 గా నిర్ణ‌యించారు. చైల్డ్ వితవుట్ బెడ్(5-11 years) రూ.6800 చెల్లించాల్సి ఉంటుంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+