Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» కుక్కే సుబ్రమణ్య

కుక్కే సుబ్రమణ్య – నాగదేవత నివసించే ప్రదేశం !

21

కర్ణాటకలోని మంగళూరు దగ్గరలోని సుల్లియా అనే ఊళ్ళో కుక్కే సుబ్రమణ్య దేవాలయం వుంది. సుబ్రహ్మణ్య స్వామిని ఇక్కడ నాగ దేవతగా ఆరాధించడం విశేషం. ఇది ఒక ప్రసిద్ధ యాత్రా స్థల౦ – ఇక్కడి క్షేత్ర గాధ కూడా  యాత్రికుల్ని ఇక్కడికి ఆకర్షిస్తుంది.

పురాణ గాధ 

వాసుకి శివుడిని ప్రార్ధించి, గరుత్మంతుడి నుంచి నాగ జాతి ని కాపాడమని వేడుకున్న ప్రదేశం లో ఈ గుడి నిర్మించారని పురాణ గాధ చెప్తుంది. ఈ తపస్సుకు మెచ్చిన శివుడు సుబ్రహ్మణ్య స్వామి ని నాగజాతిని రక్షించ డానికి పంపాడు, అప్పటి నుంచి ఆయన్ను నాగ జాతి రక్షకుడిగా కొలుస్తున్నారు.

గరుత్మంతుడి గోపురం ఇక్కడి ప్రధాన ఆకర్షణ. ఈ వెండి గోపురాన్ని వాసుకి బుసల్లోంచి వచ్చే విష వాయువుల నుంచి భక్తులను కాపాడడానికి నిర్మించారు. వాసుకి ఈ గుళ్ళో వుంటాడని నమ్ముతారు. ఆశ్లేష బలి, సర్ప సంస్కారం ఈ గుళ్ళో జరిగే ప్రధాన పూజలు.

కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం

కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం  వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా చేరుకోవచ్చు. మంగళూరు దగ్గరలోని  విమానాశ్రయం. గుడి నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్ వుంది.  బెంగళూరు, మంగళూరు నుంచి కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం వరకు చాలా ప్రభుత్వ బస్సు సేవలు అందుబాటులో వున్నాయి.

కుక్కే సుబ్రమణ్య ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కుక్కే సుబ్రమణ్య వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కుక్కే సుబ్రమణ్య

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కుక్కే సుబ్రమణ్య

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ద్వారా : బెంగళూరు, మంగళూరు ల నుంచి నిత్యం ప్రభుత్వ , ప్రైవేట్ బస్సులు ఇక్కడికి తిరుగుతాయి. సరసమైన ధరలో సౌకర్యం గా ప్రయాణించాలంటే KSRTC (కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ) బస్సులు ఎక్కవచ్చు. దీంతో పాటు ప్రైవేట్ సర్వీసుల వారు ఎయిర్ కండిషన్డ్వి లేనివి, వోల్వో బస్సులు కూడా బెంగుళూరు, మంగళూరు లనుంచి కుక్కే సుబ్రహ్మణ్య నుంచి నడుపుతున్నారు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం : 7 కిలోమీటర్ల దూరంలో వున్న సుబ్రహ్మణ్య రోడ్ రైల్వే స్టేషన్ ఇక్కడికి దగ్గరలోని రైల్వే స్టేషన్. ఇక్కడి నుంచి యాత్రికులు, టాక్సీలు గాని, ఆటోలు గాని మాట్లాడుకుని గుడి దగ్గరకు చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా యాత్రికులు ఇక్కడికి చేరుకోవచ్చు. కుక్కే సుబ్రహ్మణ్య నుంచి 115 కిలో మీటర్ల దూరంలో వున్న మంగళూరు విమానాశ్రయం ఇక్కడికి దగ్గరగా వుండే విమానాశ్రయం. యూరప్, ఆసియా, అమెరికా, మధ్య ప్రాచ్యం లేక ప్రపంచం లోని ఇతర దేశాల నుంచి వచ్చే వారు బెంగళూరు విమానాశ్రయం లో దిగాలి. కుక్కే సుబ్రహ్మణ్య నుంచి 340 కిలోమీటర్ల దూరంలో వుండే బెంగళూరు విమానాశ్రయం డిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై లాంటి అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానం చేయబడి వుంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Aug,Thu
Return On
21 Aug,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Aug,Thu
Check Out
21 Aug,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Aug,Thu
Return On
21 Aug,Fri